Coolie Movie Review and Rating: కూలీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబీన్ షాషిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, రెబా మోనికా జాన్, పూజా హెగ్డే తదితరుల
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నిర్మాత: కళానిధి మారన్
సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-08-14

సైమన్ ( నాగార్జున అక్కినేని) పోర్టులో అక్రమ దందాలు నిర్వహిస్తుంటాడు. సైమన్ వద్ద దయాల్ (సౌబీన్ షాహిర్) నమ్మకంగా పనిచేస్తుంటాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకొంటాడు. అయితే రాజశేఖర్ (సత్యరాజ్)ను దయాల్ చంపేస్తుంటాడు. అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే..చివరి చూపు కోసం దేవా (రజనీకాంత్) వెళ్తే అతడి కూతురు ప్రీతీ (శృతిహాసన్) అడ్డుకొంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతీతో ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకొన్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు.

Coolie Movie Review and Rating

సైమన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి? సైమన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాళ్లు లేకుండా వాళ్ళను కాల్చివేస్తుంటారు? సైమన్ బిజినెస్‌పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు? రాజశేఖర్‌ను దయాల్ ఎందుకు చంపాడు? దయాల్ చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏమిటి? అసలు రాజశేఖర్, దేవాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తన స్నేహితుడి కోసం దేవా దేనికైనా తెగించేందుకు సిద్దపడ్డారు. ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నెంబర్ కాల్ చేసి రాజశేఖర్ కూలీ నంబర్ ఎందుకు చెప్పమన్నాడు? ఆ కూలీ నంబర్ ఎవరిది? సైమన్‌కు దేవాకు ఉన్న వైరం ఏమిటి? దాహా (అమీర్ ఖాన్)కు దేవాకు ఉన్న కనెక్టవిటీ ఏమిటి? దేవా అసలు జీవితం ఏమిటి? సైమన్‌కు దేవా ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కూలీ సినిమా కథ.

లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే.. మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందరిలో ఉన్న అభిప్రాయానికి తగినట్టే లోకేష్ తాను నమ్ముకొన్న పాయింట్‌కు ఎమోషన్స్ జోడించి పాత కథనే తిరగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తగా విషయం ఏమీ లేదనే విషయం సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది. ఇమేజ్‌కు భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్‌ను ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయాడు. నాగార్జున ఇలాంటి పాత్రతో విలనిజాన్ని చేయాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్న ఆడియెన్స్‌లో కలగడం అత్యంత సహజంగా అనిపిస్తుంది. విలన్‌గా స్టైలిష్‌గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే కానీ.. పెర్ఫార్మెన్స్‌ విషయంలో తడబాటుకు గురయ్యాడని పలు సన్నివేశాలు స్పష్టంగా చెప్పాయి. రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది. చివర్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయాల్ పాత్రలో కనిపించిన సౌబీన్. ఈ సినిమాకు హీరో అతనే అనడంలో ఏ మాత్రం అనుమానం, సందేహాలు అక్కర్లేదు. సౌబీన్ ఈ సినిమా భారాన్నంతా తన భుజాలపై మోయడమే కాకుండా తన పెర్ఫార్మెన్స్‌తో అందరి హీరోల అభిమానులను ఆకట్టుకొన్నాడు. ఈ సినిమాకు పవర్‌హౌస్ సౌబీన్ అని చెప్పాలి.

టెక్నికల్ విషయానికి వస్తే.. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. చాలా పేలవమైన సీన్లను తన మ్యూజిక్‌తో హైప్ ఇచ్చాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ఫ్యాన్స్‌తో కేక పెట్టించేలా ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, యాక్షన్ కోరియోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. గిరీష్ గంగాధరన్ చిత్రీకరించిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. కథ, కథనాలు చాలా బలహీనంగా ఉంటాయి. సినిమా మొత్తం నత్త నడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. భారీ అంచనాలు పెట్టుకొన్న ఫ్యాన్స్‌ను లోకేష్ నిరాశపరిచాడనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకున్నా.. అసంతృప్తికి గురి కాకుండా ఉండలేరు. రజనీ, సౌబీన్, శృతి ఫెర్ఫార్మెన్స్‌ కోసం, అనిరుధ్ మ్యూజిక్ ఓ సారి చూడొచ్చు. రజనీ ఎప్పటిలానే తన యాక్టింగ్‌తో అక్కడక్కడ మాయాజాలం చేయడం సినిమా రక్షణగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X