Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు అధికారులు వెల్లడించిన అభిప్రాయాలు, సర్టిఫికెట్ వివరాల్లోకి వెళితే..

కూలీ సినిమాలో హింస, యాక్షన్, రక్తపాతం డామినేషన్ చేశాయనే వార్తల నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించాడు. వయోలెన్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలివేట్ కావడానికి వయోలెన్స్ కీలకం. కాబట్టి సెన్సార్ అభ్యంతరాలు తెలిపినా తాను పట్టించుకోను అని అన్నారు. ఈ క్రమంలో సెన్సార్ కూడా హింస, రక్తపాతం అంశాలపై అభ్యంతరం చెప్పారనేది తాజా సమాచారం.
అయితే కూలీ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు అధికారులు కొన్ని సన్నివేశాల్లో రక్తపు సీన్లలో కలర్ మార్చాలని సూచించారు. హింసతో కూడిన సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి.. వాటిపై కత్తెర వేయకుంటే.. A సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని చెబితే.. చిత్ర యూనిట్ అందుకు సరే అనడంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ లభించింది. అయితే 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం చర్చనీయాంశమైంది.
కూలీ సినిమా మల్టీ స్టారర్‌గా రూపొందడం, ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగగా ఉండటంతో ఈ సినిమా నడివి భారీగానే పెరిగిపోయింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు అంటే.. 170 నిమిషాల కట్ ఫిక్స్ చేశారు. దాంతో యాడ్స్, ఇతర అంశాలతో ఈ సినిమా నిడివి సుమారుగా మూడు గంటలపాటు కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
ఇక కూలీ సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు దేవ. ఈ సినిమాలో లవ్ ట్రాక్స్ ఉండవు. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ డ్రామా. సెకండాఫ్‌లో మితీమీరిన హింస ప్రధాన అంశాలు. ఇక నాగార్జున విలనిజం, శృతిహాసన్ పాత్ర, అలాగే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్స్ విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు పాజిటివ్‌గా స్పందించారని తెలిసింది.


Click it and Unblock the Notifications











