Lokesh Kanagaraj Review on Coolie: లోకేష్ కనకరాజ్ కూలీ రివ్యూ.. రజనీ ఎవర్ అండ్ నెవర్ బిఫోర్, 1000 కోట్లు..!
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్‌ను ఏరియాల వారీగా గ్రాండ్‌గా ముగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌లోకి వచ్చి సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
కూలీ సినిమా రిలీజ్‌కు ముందే ప్రభంజనం క్రియేట్ చేస్తున్నది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాలీవుడ్ రిపోర్టర్ ఛానెల్‌లో అనుపమ చోప్రాతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ..

కూలీ సినిమాపై హైప్ చాలా హై లెవెల్‌లో ఉంది. కూలీ సినిమా గురించి నాకు తెలియని విషయాలను కూడా ప్రేక్షకులు మాట్లాడుకొంటున్నారు. ప్రతీ రోజు ఉదయం లేచిన వెంటనే మూవీ గురించి కొత్త విషయాలు నాకు తెలుస్తున్నాయి. వాటిని విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అలాంటి విషయాలు సినిమా ప్రమోషన్స్‌కు ఉపయోగపడుతున్నాయి. కూలీ ట్రైలర్ రిలీజ్ ఆగస్టు 2వ తేదీన ఉంటుంది అని లోకేష్ కనకరాజ్ తెలిపారు.
కూలీ సినిమా కథ విషయానికి వస్తే.. సెంటిమెంట్ డ్రామాను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాను. ఫస్టాఫ్‌లో యాక్షన్‌కు సమానంగా ఎమోషన్స్ పండాయి. ప్రశాంతం థియేటర్‌లో కూర్చొని చూస్తుంటే ఫస్టాఫ్‌లో ఎమోషనల్ నుంచి నెమ్మదిగా సెకండాఫ్‌లో ఉన్న యాక్షన్ మోడ్‌లోకి వెళ్తారు. సినిమా సెకండాఫ్‌లో ఇప్పటి వరకు చూడని రజనీకాంత్‌ను ప్రేక్షకులు, అభిమానులు చూస్తారు. ఆయనకు సంబంధించిన రెండో కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించడానికి అవకాశం ఏర్పడింది అని లోకేష్ కనకరాజ్ తెలిపారు.
కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల సంపాదిస్తుందా? అంటే నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను. కానీ 150 రూపాయలు పెట్టి సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకుడికి మాత్రం ఆ రేంజ్‌లో వినోదం లభిస్తుందని కచ్చితంగా చెప్పగలను. ప్రేక్షకుడు కొనే టికెట్ డబ్బుకు ఈ మూవీ పైసా వసూలు చిత్రం అని లోకేష్ కనకరాజ్ తెలిపారు.
కూలీ మూవీని టెక్నికల్‌గా చాలా రిచ్‌గా నిర్మించారు. హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూట్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికి ఐమాక్స్ వెర్షన్‌లో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. ఈ సినిమాలోని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులను కలుపుకొని 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.


Click it and Unblock the Notifications











