Coolie Critic Review: కూలీ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నటించిన నటీనటులే కాకుండా, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు ఈ మూవీపై అంచనాలు ఆకాశానికి తాకేలా చేశాయి.
ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను దుబాయ్‌లో పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో దుబాయ్ క్రిటిక్‌గా చెప్పుకొనే ఉమేర్ సంధూ తన అభిప్రాయాన్ని, రివ్యూను పోస్టు చేశాడు.

దుబాయ్ సెన్సార్ స్క్రీనింగ్ సందర్భంగా కూలీ సినిమాను చూశాను. సోషల్ మీడియా ద్వారా నా అభిప్రాయాన్ని ఈ సినిమా గురించి వెళ్లడిస్తున్నాను. ఈ సినిమాపై నా ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ ఇదే. రజనీకాంత్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం పైసా వసూల్ సినిమా. తప్పకుండా ఈ చిత్రాన్ని చూడండి అంటూ ఉమేర్ సంధూ తన పోస్టులో పేర్కొన్నారు.
కూలీ సినిమా రివ్యూ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో రజనీకాంత్ వన్ మ్యాన్ షో. ఈ సినిమాలో తన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులు, అభిమానులు హృదయాలను దోచుకోవడమే కాకుండా.. కమ్ బ్యాక్ సినిమాగా మార్చుకొన్నాడు. ఈ చిత్రంలో పవర్ ప్యాక్ట్ పెర్ఫార్మెన్స్‌తో రజనీకాంత్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్‌లో నటించిన అగ్ర నటులు అద్బుతంగా నటించారు అని తన రివ్యూలో పేర్కొన్నారు.
అయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు పక్కన పెడితే.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే వీక్. యావరేజ్‌గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్, సినిమా చివరి 20 నిమిషాలు ఈ సినిమా కంటెంట్ ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తుంది. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడండి అని ఉమేర్ సంధూ వెల్లడించారు. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు గాను.. 3.5 పాయింట్స్ అని ఆయన వెల్లడించారు.
ఇక ఉమేర్ సంధూ విషయానికి వస్తే.. దుబాయ్ సెన్సార్ స్క్రీనింగ్ సమయంలో సినిమాలు చూశానని చెప్పుకొనే క్రిటిక్.. పలు భారీ సినిమాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటాడు. తను గొప్పగా ఉన్నాయని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఫ్లాఫ్, ఫలానా హీరో కెరీర్ ముగిసినట్టే అని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇక ఈ సినిమాపై ఆయన అభిప్రాయం పక్కన పెడితే.. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, అప్ డేట్స్ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











