Coolie Movie Twitter Review: కూలీ మూవీ ట్విట్టర్ రివ్యూ
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్‌లో అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో అమెరికా, ఇతర దేశాల్లో ప్రీమియర్లను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియాల వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

కూలీ సినిమా డిజాపాయింట్ చేసింది. ఫస్టాఫ్ విషయానికి వస్తే.. నత్త నడకగా సాగుతుంది. పేలవమైన కామెడీ, ఊహించినట్టు ఉండే సీన్ల పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ఫోర్సుగా ఉండే డ్రామా కారణంగా కంగాళీగా తయారైంది. యాక్షన్ సీన్లు అతిగా ఉన్నాయి. క్లైమాక్స్ సాగదీసినట్టు ఉండటం వల్ల సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
30 నిమిషాలు సినిమా బాగుంది. టైటిల్ కార్డు చాలా డిజైన్ చేశారు. బీజీఎం సూపర్బ్‌గా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ సింపుల్‌గా ఉంది. స్క్రీన్ ప్రజెన్స్ ఎలివేట్ చేసిన విధానం బాగుంది. చికిటు సాంగ్ నైస్‌గా పిక్చరైజ్ చేశారు. సైమన్ పాత్రలో నాగార్జున ఎంట్రీ బాగుంది. ఇప్పటి వరకు సినిమా బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
మోనిక పాట బయటనే కాకుండా థియేటర్‌లో అదిరిపోయింది. థియేటర్‌లో వైబ్ చూస్తే మతిపోయింది. ఓ మై గాడ్ ప్యూర్ గూస్ బంప్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
రజనీకాంత్ టైటిల్ కార్డును లోకేష్ కనకరాజ్ డిజైన్ చేసిన విధానం అదిరిపోయింది. దానిని బుక్ మార్క్ చేసుకోనేంతగా ఉంది. కూలీ ఇంటర్వెల్ సీన్ వీర మాస్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
రజనీకాంత్ వన్ మ్యాన్ షో. సైమన్ పాత్రలో నాగార్జున విలన్‌గా గూస్ బంప్స్. అమీర్ ఖాన్ పవర్ ఫుల్ కేమియో. యాక్షన్ సీన్లకు అనిరుధ్ బీజీఎం నెక్ట్స్ లెవెల్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ అదిరిపోయింది. తమిళ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. నా రేటింగ్ 4/5 అని ఓనెటిజన్ కామెంట్ చేశాడు.
కూలీ సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఆపడం ఎవరి తరం కావడం లేదు. రజనీకాంత్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ బాగుంది. చెన్నైలో రోహిణి థియేటర్ వద్ద క్యూ కట్టి బ్లాక్‌లో టికెట్లు కొనేందుకు ప్రేక్షకులు పోటీ పడుతున్నారు. ఒక్కో టికెట్ 4500 రూపాయలకు అమ్ముడం కనిపించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కూలీ సినిమా చూశాను. స్క్రిప్ట్ బాగా రాశారు. స్క్రీన్ ప్లే స్పీడ్‌గా సాగడంతో సన్నివేశాలు వేగంగా దూసుకెళ్తాయి. మాస్ సన్నివేశాలు బాగున్నాయి. మంచి లాజిక్‌తో ట్విస్ట్ రివీల్ చేసిన తీరు ఆకట్టుకొన్నేలా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కూలీ సినిమా ఫస్టాఫ్ బాగుంంది. సెకండాఫ్ మూవీ కొంత ఫ్లాట్‌గా సాగుతుంది. అయితే క్లైమాక్స్ ఈ సినిమాను అమాంతం కొంత వరకు పైకి లేపింది. ఈ సినిమా వార్2 పోటాపోటీగా నడుస్తాయని తెలిసింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
కూలీ సినిమా చూసిన తర్వాా ప్రతీ ఒక్కరు ఈ ఫ్రేమ్‌ను ఎల్లకాలం గుర్తుంచుకొంటారు. లోకేష్ కనకరాజ్ కేవలం సినిమాలను మాత్రమే బ్రిల్లియెంట్ తీయడమే కాకుండా ట్రైలర్స్ కూడా బాగా కట్ చేస్తారు అని నిరూపించుకొంటారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











