Coolie Trailer Review: కూలీ మూవీ ట్రైలర్ రివ్యూ
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలోని జేఎన్‌యూ స్టేడియంలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మాస్ ఆడియెన్స్‌కు, రజనీకాంత్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ మాత్రమే కాకుండా పండగ రోజు పరమాన్మంలా మారింది. ఇప్పటికే పాటలు ఓ రేంజ్‌లో ఉంటే.. ట్రైలర్ అంచనాలు రెండితలు పెంచేసింది. ఈ ట్రైలర్‌పై లుక్కేయండి..
కూలీ సినిమా విషయానికి వస్తే.. దేవా (రజనీకాంత్), తన స్నేహితుడు (సత్యరాజ్) మధ్య జరిగే కథ. సత్యరాజ్‌తో దేవాకు ఎందుకు గొడవ జరిగింది. సత్య రాజ్ కూతురు (శృతిహాసన్) తండ్రి పట్ల ఆవేదనను దేవా వద్ద ఎందుకు వెలిబుచ్చింది? నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర పాత్రలు ఈ కథలోకి ఎలా జొప్పించారు అనేది ఇంట్రెస్టింగ్‌గా కథలో కనిపించింది. అయితే క్యారెక్టర్లు చేసే మ్యాజిక్ థియేటర్‌లోనే చూడాలనే కుతూహలం ఏర్పడింది.
ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలన్నది రాసి పెట్టి ఉంటుంది. ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటైపోయింది. ఆయన మీకు కేవలం ఫ్రెండ్ కానీ.. నాకు మా నాన్న. వాడు మీకు నాన్న మాత్రమే. నాకు ప్రాణ స్నేహితుడు. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడుతావా? లాంటి డైలాగ్స్ బుల్లెట్స్‌లా పేలాయి. ఈ సినిమాలో డైలాగ్స్‌కు విజిల్స్ పడటం ఖాయమనే ఫీలింగ్ ఇచ్చేసింది.
ఇక ఈ సినిమాలో తొలిసారి నాగార్జున అక్కినేని విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే అమీర్ ఖాన్ తొలిసారి దక్షిణాదికి పరిచయం అవుతున్నారు. పూజా హెగ్డే గ్లామర్ పాత్రలో, సౌబీన్ షాహిర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ట్రైలర్ మరింత క్రేజీగా మార్చేసింది. ఈ ట్రైలర్ మాస్, మసాలా, యాక్షన్ సినిమాను చూడబోతున్నామనే సంకేతాన్ని అందించింది.


Click it and Unblock the Notifications











