Couple Friendly Review: కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, రాజీవ్ కనకాల, యోగిబాబు, గోపరాజు, ప్రమోదిని తదితరులు
దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్
నిర్మాతలు: యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ పీ
సినిమాటోగ్రఫి: దినేష్ పురుషోత్తం
మ్యూజిక్: ఆదిత్య రవీంద్రన్
ఎడిటింగ్: గణేష్ శివ
ఆర్ట్: మైఖేల్ విభాగం,
క్యాస్టూమ్: దినేష్ మనోహరన్
సమర్పణ: యూవీ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2026-02-14

నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనర్‌ ఉద్యోగం కోసం, చిత్తూరుకు చెందిన మిత్ర (మానస వారణాసి) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం చెన్నైలో ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగం లభించకపోవడంతో రాపిడో తరహా బైక్ టాక్సీ నడుపుతూ శివ పూట గడిపేందుకు కష్టాలు పడుతుంటాడు. ఆ క్రమంలో యాక్సిడెంటల్‌గా మిత్రను శివ కలుస్తాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చెన్నైలో తిరుగుతుంటారు. అయితే మిత్రకు ఓ సమస్య ఎదురు కావడంతో శివ రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. అలా వారిద్దరూ లివింగ్ టుగెదర్ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారి అఫైర్ మిత్ర తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో శివ, మిత్ర జీవితాన్ని విధి ఆడుకొంటుంది.

Couple Friendly Review and Rating

ఇంటీరియర్ డిజైనర్‌గా ఉద్యోగం రాకపోవడంతో ఎలాంటి సమస్యలు వచ్చాయి? శివ లైఫ్‌లోకి మిత్ర వచ్చిన తర్వాత అతడి పరిస్థితులు ఎలా మారిపోయాయి? మిత్రకు ఉన్న సమస్య ఏమిటి? మిత్ర, శివ రిలేషన్‌షిప్‌లోకి ఎలా వచ్చారు? వారిద్దరి శృంగార జీవితం ఎలా సాగింది? శివతో సహజీవనం గురించి తెలిసిన తర్వాత మిత్ర తండ్రి (రాజీవ్ కనకాల) రియాక్షన్ ఏమిటి? మిత్రను వెంటాడిన పరిస్థితులు ఏమిటి? చివరకు మిత్ర, శివ ప్రేమ కథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కపుల్ ఫ్రెండ్లీ సినిమా కథ.

లవ్, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తోపాటు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంగా కపుల్ ఫ్రెండ్లీ సినిమాను నూతన దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ డీల్ చేసిన విధానం బాగుంది. కథను మొదలుపెట్టిన విధానం.. హీరో, హీరోయిన్లను కలిపిన తీరును చూస్తే అనుభవం ఉన్న డైరెక్టర్‌లా సీన్లను రాసుకొన్నాడనిపిస్తుంది. అలాగే సెన్సిబుల్ రొమాన్స్, యూత్‌కు జోష్ పుట్టించే లివింగ్ టుగెదర్ అంశాలను బాగా దట్టించాడు. ఫస్టాఫ్‌ను చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారు. భావోద్వేగంతో కూడిన పాయింట్‌తో ఇంటర్వెల్‌ కార్డు వేసి సెకండాఫ్‌పై ఆసక్తిని దర్శకుడు రేకెత్తించాడు.

తొలి భాగంలో ఎలాంటి కంప్లయింట్స్ లేకుండా డీల్ చేసిన దర్శకుడు అశ్విన్ సెకండాఫ్‌కు వచ్చే సరికి తడబాటుకు గురయ్యాడు. మోస్ట్ సెన్సిబుల్ పాయింట్‌తో కథను లాగిన తీరు కాస్త గందరగోళమే కనిపిస్తుంది. కానీ పేరెంట్స్ ఎమోషన్స్, యోగిబాబు కామెడీ, సంతోష్ శోభన్, మానస వారణాసి పెర్ఫార్మెన్స్ కొన్ని లోపాలను కప్పిపుచ్చేలా చేశాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్ పాయింట్ మెయిన్ ట్రాక్ కావడంతో కొంత స్లోగా, సాగదీసినట్టు అనిపిస్తుంది. ఊహించని విధంగా ఉన్న క్లైమాక్స్ చూస్తే.. దర్శకుడు హడావిడిగా సినిమాను ముగించే ప్రయత్నం చేశాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా ఈ సినిమాను అశ్విన్ రూపొందించిన తీరు కొత్తగా అనిపిస్తుంది.

కొద్దికాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కెరీర్ కొనసాగిస్తున్న సంతోష్ శోభన్ కపుల్స్ ఫ్రెండ్లీ పాయింట్‌ను ఎంచుకోవడంతో ఈ సారి ఎలాంటి తప్పు చేయలేదు. తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగా శివ పాత్రలో సంతోష్ శోభన్ ఒదిగిపోయాడు. ఇక మానస వారణాసి కూడా గ్లామర్ పరంగా, బోల్డ్ కంటెంట్ సీన్లలో చెలరేగిపోయింది. కళ్లతో పలికించిన హావభావాలు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేలా ఉంటాయి. అందం, అభినయంతో తన ప్రతిభను తెర మీద గుప్పించింది. రాజీవ్ కనకాల పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోయేలా నటించాడు. యోగిబాబు కామెడీ ప్రతీ చోట పేలింది. గోపరాజు రమణ, ఇతరుల పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ఆదిత్య రవీంద్రన్ సంగీతం హైలెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్లను బాగా ఎమోషనల్‌గా మార్చారు. దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. చెన్నై నగర అందాలను బాగా చూపించాడు. ఈ సినిమాను ఎమోషనల్ జర్నీగా మార్చడంలో ఎఢిటర్ గణేష్ శివ పనితనం అద్బుతంగా ఉంది. ఫ్రంట్, బ్యాక్ స్క్రీన్ ప్లేతో సాగే సినిమాను ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా భావోద్వేగాలు దెబ్బ తినకుండా తన టాలెంట్‌తో కట్టిపడేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. యువ దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు, డైలాగ్స్, కథ, కథనాలు బాగున్నాయి. సంతోష్, మానస పాత్రల్లో దూరిపోవడమే కాకుండా సహజంగా నటించారు. సాంకేతిక విలువలు ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చాయి. ఈ సినిమా డిఫరెంట్ లవ్ స్టోరి. ఎమోషనల్ డ్రైవ్. భావోద్వేగాలతో కట్టిపడేసే ఫ్యామిలీ జర్నీ. ఈ సినిమాను ఎలాంటి అంచనాలతో వెళ్లినా మెప్పిస్తుంది. సెకండాఫ్‌లో కథలో ట్విస్టులు కన్ఫ్యూజన్‌గా ఉంటాయి. స్లోగా సాగడం మైనస్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఏ మాత్రం నిరాశపరచదు. ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా మోడరన్ లవ్ స్టోరి అని చెప్పవచ్చు. థియేటర్లోనే చూడండి... డెఫినెట్ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X