Couple Friendly First Review: కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఫస్ట్ రివ్యూ

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, అజయ్ కుమార్ పీ నిర్మించిన తాజా లవ్ అండ్ రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కపుల్ ఫ్రెండ్లీ (Couple Friendly). యువ హీరో, హీరోయిన్లు సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్ఫించింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, యోగిబాబు, గోపరాజు తదితరులు నటించారు.

ప్రేమికుల రోజున టార్గెట్ చేసుకొని వస్తున్న ఈ ప్రేమ కథా చిత్రానికి దినేష్ పురుషోత్తం సినిమాటోగ్రఫిని, ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్, గణేష్ శివ ఎడిటింగ్ బాధ్యతలను అందించారు. ఈ సినిమాకు మైఖేల్ ఆర్ట్ విభాగం, దినేష్ మనోహరన్ క్యాస్టూమ్ డిపార్ట్‌మెంట్ పనులను పర్యవేక్షించారు. వాలంటైన్స్ డే రోజు కానుకగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ మూవీకి సెన్సార్ రిపోర్ట్ ఏమిటి? సెన్సార్ అధికారుల ఫైనల్ రివ్యూ ఏమిటి? ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ జారీ అయింది? ఈ చిత్రం రన్‌టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Couple Friendly Review by Censor Board

శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్‌లో సక్సెస్ కోసం తంటాలు పడుతుంటాడు. మిత్ర (మానస వారణాసి) ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇద్దరు చెన్నైలో యాక్సిడెంటల్‌గా కలిసి లివింగ్ టుగెదర్‌తో ముందుకు వెళ్తారు. వారి మధ్య కలిగిన ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అనేది సంక్షిప్తంగా ఈ సినిమా కథ.

ఈ చిత్రంలో యూత్‌ఫుల్ కంటెంట్‌తో రూపొందింది. నేటి తరం యువత ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ చిత్రంలోని సన్నివేశాలను డిజైన్ చేశారు. సంతోష్ శోభన్ తన ఇమేజ్‌కు భిన్నంగా సినిమాలో కనిపించబోతున్నారు. మానస వారణాసి కూడా ఎమోషనల్ పాత్రలో నటించారు. పిల్లల కెరీర్, భవిష్యత్ కోసం పేరెంట్స్ పడే తాపత్రయం ఈ సినిమాలో హైలెట్‌గా ఉంటుంది. రిలేషన్‌షిప్, లవ్ అంశాలు హైలెట్‌గా ఉంటాయి అనే అభిప్రాయం సెన్సార్ రిపోర్టుతో స్పష్టమైంది.

కపుల్ ఫ్రెండ్లీ సినిమా టైటిల్ తగినట్టుగానే యూత్ ఫుల్ సీన్లు, మోతాదుకు మించి శృంగారం ఉండటంపై సెన్సార్ అధికారులు కొన్ని అభ్యంతరాలు తెలిపారు. వారు కొన్ని సూచనలు, సలహాలు చేసి కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వాటిని మార్చడానికి వీలు లేకపోవడం, కథ డిమాండ చేయడంతో కొన్ని సెమీ అడల్డ్ కంటెంట్ ఉంచాల్సి వచ్చింది. దాంతో ఈ సినిమాలో సెన్సార్ సూచించిన కొన్ని విషయాలకు మార్పులు, చేర్పులు చేశాయి అని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈ సినిమాలోని సన్నివేశాల్లో రొమాంటిక్ డోస్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాపై పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేయలేకపోయారు. ఈ చిత్రానికి A (Adult Only) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 18 ఏళ్లకుపై బడిన ఆడియెన్స్ మాత్రమే చూడాలి. అంతకంటే తక్కువ వయసు ఉన్న ప్రేక్ష్రకులకు అనుమతి లేదు అని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

ఇక కపుల్ ఫ్రెండ్లీ సినిమా కేవలం ఓ ఎమోషనల్ డ్రైవ్ కావడంతో.. కథ, సన్నివేశాలను విస్తరించడానికి స్కోప్ లేకపోవడంతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్‌ను దృష్టిలో పెట్టుకొని నిడివిపై నిర్మాత, దర్శకులు జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా ఎక్కువ సాగదీయకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమాను 2 గంటల 1 నిమిషం నిడివిని, అంటే.. 121 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని సెన్సార్ సర్టిఫికెట్ స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X