Court First Review: కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి ఫస్ట్ రివ్యూ.. నాని ఖాతాలో హిట్ పడిందా?

నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా సమర్పణతో తెరకెక్కించిన చిత్రం కోర్ట్-స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. ప్రశాంతి త్రిపిర్నేనేని నిర్మాతగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించి తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాని కీలకంగా వ్యవహరించడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. హోళీ పండుగ కానుకగా ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు ముస్తాబైంది. ఈ సినిమాకు సంబంధించిన బలబలాలు ఏంటి? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

Court  State vs A Nobody first Review

ప్రియదర్శి ప్రధాన పాత్రలో బాల నటుడిగా పరిచమై మంచి గుర్తింపు పొందిన హర్ష్ రోషన్, శ్రీదేవీ అపాళ్ల, బిగ్‌బాస్ ఫేమ్, సీనియర్ నటుడు శివాజీ, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తీ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ బుల్గానియన్ మ్యూజిక్ అందించగా, దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రాఫర్‌గా, విఠల్ కోసనమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

హర్స్ రోషన్, శ్రీదేవీ మధ్య సాగే లవ్ స్టోరీ ప్రాధానంగా సాగే సినిమా ఇది. అయితే వారి ప్రేమకు పెద్దల అంగీకారం లేకపోవడం కథ మలుపు తిరుగుతుంది. అమ్మాయి మైనర్ కావడంతో హర్ష్‌పై ఫోక్సో కేసు నమోదు చేయడం.. అబ్బాయి జైలు పాలు కావడం స్టోరీలో ఎమోషన్స్, ఇంటెన్సిటీని పెంచుతాయి. ఇక ఈ కేసును వాదించడానికి సీనియర్ లాయర్లు కూడా చేతులెత్తేస్తారు.

హర్ష్ రోషన్‌పై నమోదైన పోక్సో కేసు ఎలాంటి అంశాలపై నమోదైంది? హర్ష్, శ్రీదేవీ ప్రేమకు ఎవరు అడ్డుగా మారారు? కేసును వాదించడానికి సిద్దమైన లాయర్లను ఎవరు అడ్డుకొన్నారు? సీనియర్ లాయర్లందరూ చేతులెత్తేసిన సమయంలో జూనియర్ లాయర్ ప్రియదర్శి ఈ కేసును ఎలా వాదించాడు? ఎవరూ ఊహించిన పాయింట్ పట్టుకొని కేసును ప్రియదర్శి గెలిచాడు? హర్ష్‌కు న్యాయం జరిగిందా? లేదా? ఇద్దరు ప్రేమికులు ఒక్కటయ్యారా? అనేది సినిమా కథ.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు యూఏ (U/A) సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఎమోషనల్ అంశాలు విశేషంగా సెన్సార్ బోర్డు అధికారులను ఆకట్టుకొన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఇంటెన్స్ కథ, కోర్టు డ్రామా రావడం ఇదే ప్రథమం. యూత్‌తో ఇతర వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొనే అంశాలు బాగున్నాయి అని సెన్సార్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

యువ ప్రేమికులుగా హర్ష్, శ్రీదేవీ. ప్రధాన పాత్రల్లో శివాజీ, సాయి కుమార్ తమ మార్క్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా ప్రియదర్శి అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తాడు అని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు అందర్నీ ఆలొచింపచేసే ప్రశ్నగా మారింది. అయితే ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అయితే నాని ఖాతాలో గ్యారెంటీగా హిట్ పడినట్టే.. 12 తేదీ మీడియాకు ప్రెస్ ప్రివ్యూ వేస్తున్నారు అలాగే.. 13 తేదీన పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్నాయి. పబ్లిక్ టాక్ ఏంటో తెలియడం ఖాయంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Read more about: court nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X