Court Movie Review: స్టేట్ వర్సెస్ ఏ నోబడి ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవీ అపాళ్ల, బిగ్‌బాస్ ఫేమ్ సీనియర్ నటుడు శివాజీ, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తీ తదితరులు
దర్శకత్వం: రామ్ జగదీష్
సమర్పణ:నేచురల్ స్టార్ నాని
నిర్మాత: ప్రశాంతి త్రిపిర్నేనేని
సహ నిర్మాత: దీప్తి గంటా
మ్యూజిక్: విజయ్ బుల్గానియన్
సినిమాటోగ్రాఫర్‌గా: దినేష్ పురుషోత్తమన్
ఆర్ట్ డైరెక్టర్‌: విఠల్ కోసనమ్
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
రిలీజ్ డేట్: 2023-03-14

ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండే చందూ (రోషన్) చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. అదే ఊరికి చెందిన గ్రామ పెద్ద మంగపతి (శివాజీ)కి మహా కోపిష్టి. ఆయన కోడలైన జాబిలి (శ్రీదేవి) తొలి చూపులోనే చందూని ఇష్టపడుతుంది. అమ్మాయిల ప్రవర్తన, కట్టు బొట్టు విషయంలో చండశాసనుడిలా ఉండే మంగపతికి తన కోడలికి చందూకు మధ్య జరుగుతున్న ప్రేమకథ తెలుస్తుంది. తన కోడలు చేసిన పనిని సహించలేకపోతాడు. తన పరువు గంగలో కలుస్తుందేమోననే అనుమానంతో చందూని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు.

Court  State vs A Nobody Review and Rating in Telugu  Nani s Pocso Act based Impressive Court drama

చందూ కుటుంబ నేపథ్యం ఏమిటి? జాబిలి ప్రపోజల్‌కు చందూ రియాక్షన్ ఏమిటి? జాబిలితో చందూ ప్రేమ కథ ఎలా సాగింది? కోడలు జాబిలి ప్రేమ కథ చెవిన పడిన తర్వాత మంగపతి పరిస్థితి ఏమిటి? పోక్సో కేసు పెట్టిన తర్వాత అతడిని విడిపించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి. పోక్సో కేసు వాదించడానికి జూనియర్ లాయర్ తేజ (ప్రియదర్శి) ఎందుకు ముందుకు వచ్చాడు? చందూను కేసు నుంచి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలకు మంగపతి ఎలాంటి పైఎత్తులు వేశాడు. పేరున్న లాయర్ మోహన్ రావు (సాయి కుమార్) ఈ కేసు విషయంలో ఎలా వ్యవహరించాడు. చందూను విడిపించడానికి తేజ చేసిన ప్రయత్నాలు ఎలా సఫలమయ్యాయి. చందూను పోక్సో కేసు నుంచి ఎలా బయటపడేలా చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కోర్ట్ సినిమా కథ.

తొలి చిత్ర దర్శకుడైన రామ్ జగదీష్ అత్యంత క్లిష్టమైన సబ్జెక్ట్‌ను ఎంచుకొన్న తీరు, చేసిన ప్రయత్నాన్ని మంచి సాహసమే అని చెప్పాలి. సాధారణంగా కోర్టు డ్రామాలను ఎలాగోలా నడిపించేయవచ్చు. కానీ న్యాయశాస్త్రంలో అత్యంత వివాదాస్పద అంశాన్ని అలాగే సినిమాకు ముడిసరుకుగా ఎంచుకోవడానికి కష్టమైన పాయింట్‌ను కథగా రాసుకొన్న తీరు.. దానిని పకడ్బందీగా సన్నివేశాలుగా మలిచిన విధానం బాగుంది. నిబ్బానిబ్బి తరహా ప్రేమకథ బేస్ చేసుకొని సీరియస్ అంశాన్ని డ్రామాగా మలిచిన కట్టిపడేలా ఉంటుంది. ఫస్టాఫ్‌లో ఎమోషన్స్ బిల్డ్ చేసిన సెకండాఫ్‌కు బాగా ఉపయోగపడింది. ఫస్టాఫ్‌లో మంగపతి క్యారెక్టర్‌ను మలిచిన విధానం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. చక్కటి పాయింట్‌తో ఇచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది.

Court  State vs A Nobody Review and Rating in Telugu  Nani s Pocso Act based Impressive Court drama

సెకండాఫ్‌లో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు కట్టిపడేసేలా ఉంటే సినిమాకు ప్రాణంగా ఉంటుంది. ఇరు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తులు అంచనాలకు మించి ఉంటే సినిమాలో ఉద్వేగం, భావోద్వేగాలు రిజిస్టర్ అవుతాయి. అలాంటి తరహా పనినే దర్శకుడు ఎలాంటి తడబాటు లేకుండా పూర్తి చేయడంలో తొలి చిత్ర దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. సదుద్దేశం, బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి రూపొందించిన పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందనే విషయాన్ని చాలా స్ఫష్టంగా చెప్పే ప్రయత్నం జరిగింది. చట్టం మీద అవగాహన కల్పించేందుకు తీసుకొన్న చొరవను అభినందించాలి.

నటీనటుల విషయానికి వస్తే.. మంగపతి క్యారెక్టర్‌లో శివాజీ చేసిన పెర్పార్మెన్స్ చాలా బాగుంది. శివాజీ కాకుండా మంగపతి మాత్రమే కనిపించేలా నటించాడు. కథను, పాత్రలను ప్రభావితం చేసేంతగా తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఇక ప్రియదర్శిని కొత్త కోణంలో నటుడిగా చూసేందుకు అవకాశం లభించింద. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు ఆయన ఫెర్ఫార్మెన్స్, హావభావాలు, క్యారెక్టర్ యాటిట్యూడ్‌ను చక్కగా పండించాడు. రోషన్, శ్రీదేవీ తమ అనుభవానికి మించిన నటనను ప్రదర్శించారు. సాయి కుమార్ కనిపించినంత సేపు హుందాగా, మంచి స్క్రీన్ ప్రజెన్స్‌తో గుర్తుండిపోయేలా పాత్రను పోషించారు. ప్రాసిక్యూషన్ లాయర్‌గా హర్షవర్ధన్ పోటాపోటీగా నటించారు. రోహిణి, రోషన్ తల్లిగా చేసిన నటి, మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

Court  State vs A Nobody Review and Rating in Telugu  Nani s Pocso Act based Impressive Court drama

కథ, కథనాలు, ఎమోషన్స్, సీరియస్ అంశాలకు తగినట్టుగా సాంకేతిక నిపుణులు తమ వంతు పని కానిచ్చారు. ఈ సినిమాలోని సన్నివేశాలు ఎలివేట్ కావడానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ కారణం. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ వర్క్ కూడా చక్కగా కుదిరింది. కోర్టు సెట్ మూడ్ క్రయేట్ చేసేలా చేసింది. విజువల్, సన్నివేశాలు చక్కగా చిత్రీకరించారు. వాల్ పోస్టర్ బ్యానర్‌పై నాని ఈ సినిమాను డిజైన్ చేసిన తీరు ఆయన అభిరుచిని తెలియజెస్పింది. ప్రశాంతి, దీప్తి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓ చిన్న ప్రేమ కథ చుట్టూ అల్లుకొన్న కోర్ట్ డ్రామా. కథలో ఎమోషన్స్, కోర్టులో సీరియస్ అంశాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ వల్లనే ఈ సినిమా నాలుగు మెట్లు ఎక్కిందని ఫీలింగ్ కలుగుతుంది. కోర్టు డ్రామా బేస్ కావడంతో చందూ, జాబిలి లవ్ స్టోరికి కొంత ప్రాధాన్యం తగ్గించారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం పాయింట్‌ను బేస్‌ తీసుకొని కోర్టులో సన్నివేశాలను రాసుకొన్నారనిపిస్తుంది. దాంతో లవ్ స్టోరీ అంతగా మెప్పించదు. పోక్సో చట్టం గురించి తెలియని వారికి ఈ సినిమా కొంత ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోయే అవకాశం లేకపోలేదు. కానీ కథను సులభంగా చెప్పిన తీరు సినిమాకు బలంగా నిలిచింది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ మధ్యకాలంలో వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాల్లో ఒక బెస్ట్ మూవీ. ఈ సినిమా ఎలాంటి అంచనాలతో వెళ్లినా నిరాశపరచదు. డొంట్ మిస్ ఇట్.. ఓ లుక్ ఈ సినిమాపై ఈ వారం వేయండి. మంచి సినిమా చూసిన అనుభూతిని పొందుతారు.

More from Filmibeat

Read more about: court nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X