Cousins and Kalyanams Web Series Review: కజిన్స్ అండ్ కల్యాణమ్స్ వెబ్ సిరీస్ రివ్యూ
నటీనటులు: కృష్ణ విజయచంద్రన్, మనస్విని కే రామ్, సిద్దార్థ్ బాబు, రోషన్ అబ్దుల్ రాహూఫ్, సుబిన్ టార్జన్, సానియా ఫాతిమా, నందన వర్మ, నైనితా మారియా తదితరులు
దర్శకత్వం: నిజు సోమన్
నిర్మాతలు: ఆదిత్య పిట్టి, సమర్ ఖాన్, అనుప్ చంద్రశేఖరన్
ఎడిటర్: టిటస్ జోసెఫ్
మ్యూజిక్: సందీప్ పలనాడ్, సంజిత్ జార్జ్
సినిమాటోగ్రఫి: రవి చంద్రన్
బ్యానర్: ఎపిక్ కంపెనీ
రిలీజ్ డేట్: 29-05-2026
మను (కృష్ణ విజయచంద్రన్) తన కుటుంబ మూలాలు కేరళలోని కోచిలో ఉన్నప్పటికీ.. తాను ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ముంబైలో పెరుగుతాడు. శుభకార్యాల సందర్భంగా కలిసిన సందర్భంలో చిన్నతనంలోనే దియా(మనస్విని కే రామ్)కు దగ్గరవుతాడు. వారిద్దరికి ఒకరంటే మరొకరికి వీడదీయలేని ప్రేమబంధం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మనుకు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. అయితే మనుకు మరోకరితో పెళ్లి జరిపించడం ఇష్టం లేని దియా పెళ్లి పీటలపై ఆ పెళ్లిని చెడగొట్టడానికి ప్లాన్ వేస్తుంది.
కోచిలో జరిగే మను పెళ్లికి ముందు రాత్రి దియా కలిసి ఏం ఫీలైంది? దియా అంటే ఇష్టం ఉన్నప్పటికీ వీణాతో మను ఎందుకు పెళ్లి చేసుకొనేందుకు సిద్దపడ్డాడు? దియాకు తన కజిన్స్ చందూ (సిద్దార్థ్), అశ్వతి (నైనిత) సంస్కృతి (మాన్య) ఎలా సపోర్ట్ చేయడానికి ప్లాన్ చేశారు? పెళ్లి పీటలపై తాళి కట్టిన తర్వాత మను భార్యతో దియా ఎలా బిహేవ్ చేసింది? దియా చేసిన పనికి మను, దియా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? మను, దియా ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? మను ఎందుకు ఒంటరిగా ముంబైలో తన తల్లితో జీవించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే కజిన్స్ అండ్ కల్యాణమ్స్ అనే వెబ్ సిరీస్ కథ.

6 కజిన్స్ 7 పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్‌తో సుమారుగా 56 ఎపిసోడ్స్‌తో కజిన్స్ అండ్ కల్యాణమ్స్ సిరీస్‌ను ఓటీటీలో ప్లాన్ చేశారు. తొలి ప్రయత్నంలో నాలుగు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించారు. మను పెళ్లికి ముందు రోజు దియాను అర్ధరాత్రి కలిసి ఎమోషనల్ అవుతారు. అయితే మను తనను మోసం చేశారనే భావనలో దియాతోపాటు కజిన్స్ ఉంటారు. అయితే తాళి కట్టిన వీణ ముందే మనును దియా ముద్దు పెట్టుకోవడంతో పెళ్లి అంతా తలకిందులవుతుంది. ఇలాంటి ఎమోషనల్ పాయింట్‌తో ఫీల్‌గుడ్‌గా ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం దర్శకుడు నిజు సోమన్ చేశారు. కానీ కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం, పాత తరహాలోనే కథనం ఉండటం, స్టోరీలో వేగం లేకపోవడం వల్ల సిరీస్ నత్త నడకన సాగినట్టు 4 ఎపిసోడ్స్‌లో స్పష్టమైంది. అయితే కథను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోబోతున్నారనేది చెప్పకనే అర్ధమైంది.
మను వ్యక్తిగత జీవితాన్ని చెప్పి సానుభూతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం బాగుంది. మను జీవితంలోకి మారు తండ్రి రావడంతో అతడి జీవితం ఓ మలుపు తిరుగుతుంది. ఆ మలుపే ఈ వెబ్ సిరీస్‌కు బేస్‌గా మారింది. ఇక ముందు జరిగే ఆరు పెళ్లిళ్లు ఎలాంటి అనుభూతిని కలిగిస్తాయనే విషయం రానున్న ఎపిసోడ్స్ ద్వారా తేలిపోతుంది.
ప్రస్తుతం నాలుగు ఎపిసోడ్స్‌లో మనుగా కృష్ణ విజయచంద్రన్, దియగా మనస్విని పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ఇతర క్యారెక్టర్లు కూడా కేవలం సపోర్టింగ్‌గానే ఉన్నాయి. సిరీస్ డెప్త్‌లోకి వెళ్లే సరికి క్యారెక్టర్లు బలంగా కనిపిస్తాయోమో. ఈ సిరీస్‌లో చాలా రకాల పాత్రలు పరిచయం కాబోతున్నాయనేది సత్యం. మున్ముందు కథను బలంగా చెప్పే ప్రయత్నమే ఈ సిరీస్‌ను క్రేజీగా మార్చే అవకాశం ఉంది.
కేరళలోని కొచ్చి బేస్‌గా కథ సాగుతుంది కాబట్టి.. లోకేషన్లు చాలా బాగా ఎంపిక చేశారు. ప్రతీ ఫ్రేమ్‌ను కలర్‌ఫుల్‌గా మార్చేశారు. పెళ్లి బ్యాక్ డ్రాప్‌గా సాగడంతో రిచ్, గ్రాండియర్‌గా బాగా డిజైన్ చేశారు. ఎడిటర్‌గా టిటస్ జోసెఫ్, మ్యూజిక్ విభాగాన్ని సందీప్ పలనాడ్, సంజిత్ జార్జ్, సినిమాటోగ్రఫి బాధ్యతలను రవి చంద్రన్ నిర్వహించారు. సాంకేతిక విలువలు స్పష్టంగా బలంగా కనిపించాయి. నిర్మాతలు: ఆదిత్య పిట్టి, సమర్ ఖాన్, అనుప్ చంద్రశేఖరన్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.


Click it and Unblock the Notifications