twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Crazy Uncles Movie Review : బూతులంటూ రచ్చ రేపిన శ్రీముఖి సినిమా ఎలా ఉందంటే?

    |

    rating : 2.5/5

    టైటిల్ :'క్రేజీ అంకుల్స్'
    నటీనటులు : శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, బండ్ల గణేష్
    నిర్మాణం : గుడ్ సినిమా గ్రూప్‌
    దర్శకత్వం : ఈ. సత్తి బాబు
    సంగీతం : రఘుకుంచె

    సినిమాలకు ఈ మధ్య కాలంలో వివాదం ఏర్పడడం అనేది చాలా కామన్ అయి పోయింది. సినిమా పబ్లిసిటీ ఓకే ఎత్తు అయితే సినిమాల మీద ఏర్పడుతున్న వివాదాలు మీదకు తీసుకు రావడంతో వచ్చిన పబ్లిసిటీ మరో ఎత్తు. ఇప్పుడు అదే విధంగా విడుదలకు ఒక్క రోజు ముందు వివాదం ముంగిట నిలిచిన క్రేజీ అంకుల్ సినిమా ప్రేక్షక లోకానికి బాగా దగ్గరైంది. శ్రీముఖి ప్రధాన పాత్రలో మనో, రాజా రవీంద్ర, భరణి శంకర్, పోసాని కృష్ణమురళి, బండ్ల గణేష్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది ? మహిళా సంఘాలు ఆరోపించినట్లు వివాదాస్పద అంశాలు సినిమాలో ఉన్నాయా? అసలు ఏంటి సినిమా? ఎవరు ఈ క్రేజీ అంకుల్స్ అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    క్రేజీ అంకుల్స్ కథ ఏమిటంటే

    క్రేజీ అంకుల్స్ కథ ఏమిటంటే

    ఒక సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ప్రవీణ్ అనే దర్శకుడు బండ్ల గణేష్ అనే నిర్మాత దగ్గరికి వస్తాడు. అతను బండ్ల గణేష్ చెప్పిన క్రేజీ అంకుల్స్ కథ ఇది. బాగా డబ్బు సంపాదించే ముగ్గురు నడి వయస్కులైన సమాజంలో మంచి పేరు సంపాదించిన వ్యక్తుల కథ ఈ క్రేజీ అంకుల్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజు (రాజా రవీంద్ర), బంగారం వ్యాపారం చేసే రెడ్డి(సింగర్ మనో) ఫైనాన్స్ వ్యాపారం చేసే రావు(భరణి శంకర్) ముగ్గురు మంచి స్నేహితులు.

    ఒక అపార్ట్ మెంట్ లోనే కలిసి జీవిస్తూ ఉంటారు. అయితే ఈ ముగ్గురికి తమ భార్యలతో సంసార జీవితంలో సమస్యలు ఉంటాయి. ముగ్గురికి కామన్ ఇంట్రెస్ట్ కూడా సింగర్ స్వీటీ (శ్రీముఖి). రాజు పుట్టినరోజు నాడు ఆమె చేత ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తారు. ఆ రోజు జరిగిన ఘటనతో ఈ ముగ్గురు జీవితాలు ఎలా మారిపోయాయి? ఎన్ని మలుపులు తిరిగాయి ? అనేది సినిమా కథ.

    క్రేజీ అంకుల్స్ సినిమాలో ట్విస్టులు

    క్రేజీ అంకుల్స్ సినిమాలో ట్విస్టులు

    సినిమా ప్రారంభం నుంచి చాలా సాదాసీదాగా అనిపించిన స్క్రీన్ ప్లే రాజు పుట్టిన రోజు తర్వాత అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. తరువాత కాసేపు రొటీన్ కామెడీ పండించే ప్రయత్నం చేసినా సరే ఎవరు ఊహించని ట్విస్టులు అనేకం సినిమాలో ఉంటాయి. తాను ప్రెగ్నెంట్ అని చెప్పిన స్వీటీ ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అనే విషయం మాత్రం దాట వేయడంతో అప్పటి నుంచి కధ కాస్త వేగం పుంజుకున్న ట్లు అనిపిస్తుంది.

    అయితే అసలు ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్లో ఇచ్చినట్లు చెప్పాలి. ముఖ్యంగా పోసాని ఇచ్చే ట్విస్ట్ మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు. మొత్తం మీద కామెడీ సినిమా అయినా సరే కథలో ట్విస్టులు పెట్టి ప్రేక్షకులను చివరి వరకు థియేటర్లలో ఆసక్తికరంగా కూర్చుని చేశారు.

    దర్శకుడి విషయానికి వస్తే

    దర్శకుడి విషయానికి వస్తే

    దర్శకుడి గురించి మాట్లాడాలి అంటే ఆయన ఎంచుకున్న లైన్ చాలా బాగుంది. భార్యాభర్తలిద్దరూ సఖ్యంగా ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు వాళ్ళు వేరే వారి వంక చూడరు అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారని చెప్పాలి.. అయితే అందుకు ఎంటర్టైనింగ్ యాంగిల్ తీసుకోవడమే ఇప్పుడు ఈ వివాదాలకు కారణమైంది. దానికి తగ్గట్టు సినిమా వాళ్ళు డబ్బులు కోసం ఏమైనా చేస్తారు అనిపించేలాగా కొన్ని డైలాగులు పెట్టి ట్రైలర్ లో వదలడంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది అని సినిమాలో కూడా అదే విధంగా చూపించడానికి ప్రయత్నం చేశారు.

    కానీ చివర్లో ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకుల మనసు గెలవడం ఈ ప్రయత్నం చేశారు. కానీ చివరికి వచ్చే సరికి రొటీన్ కథ అనిపిస్తూ మెసేజ్ ఇచ్చి ఎండ్ అవుతుంది. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న సత్తిబాబు ఈ సినిమాను ఆసక్తికరంగా మలచడానికి ప్రయత్నించారు. కొంత వరకు ఆ ప్రయత్నం సఫలం అయింది అని చెప్పాలి.

    శ్రీముఖి పర్ఫామెన్స్ విషయానికి వస్తే

    శ్రీముఖి పర్ఫామెన్స్ విషయానికి వస్తే

    ముందు నుంచి ఈ సినిమాను శ్రీముఖి సినిమాగా ప్రచారం చేస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. అయితే కథ శ్రీముఖి చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించినా నిడివి మాత్రం ఆమెకు కొంచెం తక్కువగా ఉంటుంది. కనబడినంత వరకూ శ్రీ ముఖి తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బుల్లితెర మీద కనిపించినంత సేపు పక్కింటి అమ్మాయిలా అల్లరి చేస్తూ ఉండే శ్రీముఖి ఈ సింగర్ స్వీటీ పాత్రలో మాత్రం ఒదిగిపోయి నటించింది. చాలా ఒద్దికగా ఈ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    సింగర్ మనో నటన ఎలా ఉందంటే

    సింగర్ మనో నటన ఎలా ఉందంటే

    సింగర్ గా ఇప్పుడు జబర్దస్త్ లో జడ్జిగా మనందరికీ సుపరిచితం అయిన మనో అలియాస్ నాగూర్ బాబు ఈ సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ లో నటించారు. రెడ్డిగారు అనే పాత్రలో ఆయన నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కొన్ని సందర్భాల్లో హావభావాలు పలికించే సమయంలో హావ భావాలను చూస్తే కాస్త ఎబ్బెట్టుగా అనిపించక మానదు. కానీ ఆయన కనిపించినంత సేపు నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. తనకు ఇచ్చిన పాత్రను సమర్థవంతంగా పోషించే ప్రయత్నం చేశారు.

    మిగతా నటీనటుల విషయానికి వస్తే

    మిగతా నటీనటుల విషయానికి వస్తే

    మనోతో పాటు ఫుల్ లెన్త్ పాత్రలు చేసిన రాజారవీంద్ర, భరణి శంకర్ తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా ప్రవీణ్, బండ్ల గణేష్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే గిరి, హేమ, భార్గవి, విజయ, పోసాని కృష్ణ మురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు తాము నటించే ఈ సినిమాలో భాగమయ్యారు. ముఖ్యంగా రాజారవీంద్ర, భరణి శంకర్ ఇద్దరి నటన కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. తమదైన శైలిలో నటించి ప్రేక్షకులలో ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే

    టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే

    ఈ సినిమా టెక్నికల్ విభాగం పనితీరు విషయానికి వస్తే రఘు కుంచే అందించిన సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు తక్కువే అయినా ఎక్కడా బోర్ కొట్టించకుండా సంగీతాన్ని అందించారు రఘు కుంచే. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

    ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఎక్కడా అవుట్డోర్ సీన్స్ లేకుండా ఉండడంతో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గకపోవడంతో ప్రతి ఫ్రేమ్ లో రిచ్ నెస్ కనబడుతుంది.

    క్రేజీ అంకుల్స్ సినిమా ఎలా ఉంది అంటే

    క్రేజీ అంకుల్స్ సినిమా ఎలా ఉంది అంటే

    సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్వించడానికి దర్శకుడు ఎక్కువగా ప్రయత్నించారు. రొమాంటిక్ కామెడీ కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చి తీరుతుంది అని చెప్పవచ్చు. అలాగే మహిళా సంఘాలు గొడవల వల్ల సినిమా కాస్త లైమ్ లైట్ లోకి వచ్చింది. కానీ వాళ్లు కూడా అభ్యంతరాలు చెప్పే విధంగా ఎక్కడ సీన్లు గాని డైలాగులు గాని ఉండవు. ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో దానికి కాస్త కమర్షియల్ హంగులు అద్దిన ఈ సినిమా ఎక్కడా నిరాశ పరచదు అనే చెప్పాలి. కొన్ని సీన్లు ఎబ్బెట్టుగా ఉన్నా మొత్తం మీద చూస్తే సినిమా పరంగా బాగానే ఉందనే చెప్పాలి.

    Recommended Video

    Anchor Sreemukhi Confirms Her Relationship
    ఇక ఫైనల్ గా

    ఇక ఫైనల్ గా

    మంచి మెసేజ్ ఇద్దామని ఉద్దేశంతో దానికి కమర్షియల్ హంగులు జోడించిన ఈ సినిమా చివరి వరకు కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది కానీ ఎక్కడ అదనపు సీన్లకు మాత్రం ఆస్కారం ఇవ్వకుండానే సినిమాను నడిపించారు. మహిళా సంఘాల వివాదంతో కాస్త సినిమాకు క్రేజ్ రావడం తో కలెక్షన్లు బాగానే వస్తాయని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి చూసే సినిమా అని చెప్తున్నా సరే ప్రేక్షకులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది వేచి చూడాల్సి ఉంది.

    English summary
    Sreemukhi's highly anticipated film Crazy Uncles has finally released today (August 19). here is the review and rating of Crazy Uncles in telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X