CSI Santan Review ట్విస్టులతో సాగే మర్డర్ మిస్టరీ.. ఆది సాయికుమార్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
Rating: 2.5/5
నటీనటులు: ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, రోజా, నందిని రాయ్, తారక్ పొన్నప్ప ,మధు సూదన్, వాసంతి తదితరులు
సినిమాటోగ్రఫీ: జి శేఖర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ. జిఎస్కె మీడియా
నిర్మాత: అజయ్ శ్రీనివాస్
దర్శకుడు: శివశంకర్ దేవ్
బ్యానర్: చాగంటి ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2023-03-10

సీఎస్ఐ సనాతన్ కథ ఏమిటంటే?
వీసీ ఫైనాన్స్ అధినేత విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) పేదలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి దేవుడిగా మారుతాడు. అదే సమయంలో విక్రమ్ చక్రవర్తిపై ఆర్థిక ఆరోపణలు కూడా ఉంటాయి. అతి తక్కువ కాలంలో బిజినెస్‌ను టాప్ రేంజ్‌కు తీసుకెళ్లి ఫోర్స్ జాబితాలోకి చేరుతాడు. ఆ సందర్భంగా జరిగిన పార్టీలో విక్రమ్ చక్రవర్తి దారుణ హత్యకు గురవుతాడు. సంచలనం రేపిన హత్య కేసును విచారించడానికి క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ సనాతన్ (ఆది సాయికుమార్) రంగంలోకి దిగుతాడు.

సీఎస్ఐ సనాతన్‌లో ట్విస్టులు
విక్రమ్ చక్రవర్తి వ్యాపార భాగస్వాములు మంత్రి రాజవర్ధన్ (మధుసూధన్ రావు), దివ్య (నందినీ రాయ్)ను సనాతన్ అనుమానితులుగా ఎందుకు భావించాడు? విక్రమ్ చక్రవర్తికి రాజవర్థన్‌కు ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి? దివ్యతో విక్రమ్ చక్రవర్తికి ఎలా సంబంధాలు ఉన్నాయి? సనాతన్, ప్రియురాలు సుదీక్ష (మిషా నారంగ్) ఎందుకు విడిపోయారు? సనాతన్ సోదరుడు సంజీవ్ కుమార్ ఎలా చనిపోయాడు? విక్రమ్ చక్రవర్తి హత్యకు కారణాలు ఏమిటి? విక్రమ్ చక్రవర్తి హత్యకు ఎవరు? ఎందుకు కుట్ర చేశారు? విక్రమ్ చక్రవర్తి కేసును సనాతన్ ఎలా ఛేదించాడు అనే ప్రశ్నలకు సమాధానమే సీఎస్ఐ సనాతన్ సినిమా కథ.

సీఎస్ఐ సనాతన్ ఎలా ఉందంటే?
విక్రమ్ చక్రవర్తి దేవుడిలా ప్రజలు కొలిచే సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అయితే అంతా పాజిటివ్ నోట్‌తో సాగుతున్న సమయంలో విక్రమ్ మర్డర్ కథను మలుపుతిప్పుతుంది. కేసు దర్యాప్తు కోసం రుద్ర (అలి రెజా) తన స్నేహితుడు సనాతన్ హెల్ప్ తీసుకోవడంతో కథ మరింత ఊపందుకొంలటుంది. కానీ సనాతన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాత అసలు కథ డీవియెట్ కావడం వల్ల ఒక ఫ్లోలో సాగుతున్న కథకు బ్రేక్ వేసినట్టు అనిపిస్తుంది.
అయితే కథా డిమాండ్ వల్ల ఇతర పాత్రల పరిచయాలు.. పాత్రల బ్యాక్ స్టోరి కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో కథ ట్రాక్ మీదకు ఎక్కడం, ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సీన్లు థ్రిల్లింగ్ గానే కాకుండా కథ గమనం కొత్తగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఇన్వెస్టిగేషన్ డ్రామా కొత్తగా ఉందనే ఫీల్ కలుగుతుంది.

దర్శకుడు పనితీరు గురించి
దర్శకుడు శివ శంకర్ దేవ్ రాసుకొన్న పాయింట్ కొత్తగా ఉంది. కాకపోతే కథగా విస్తరించే క్రమంలో తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది. కథనం విషయంలో కొత్త అనుభవరాహిత్యం కనిపించినా.. కథను, పాత్రల తీరుతెన్నులు రాసుకొన్న తీరు బాగుందని చెప్పవచ్చు. కథ, కథనాలపై కొంత కసరత్తు చేసి.. స్టోరీలో డీవియేషన్స్ తగ్గించి ఉంటే మంచి క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది.

ఆది సాయికుమార్ ఫెర్ఫార్మెన్స్ గురించి
ఆది సాయికుమార్ మరోసారి విభిన్నమైన పాత్రతో మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ చూపించాడు. ప్రతీ సినిమాకు వైవిధ్యాన్ని చాటుకొంటున్నాడు. కథలను ఎంచుకొనే తీరు బాగుంది. కానీ ఓవరాల్‌గా అవుట్‌పుట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. సనాతన్ పాత్రకు సంబంధించి.. బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంది. కీలక సన్నివేశాల్లో హావభావాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ చిత్రం ఆది కెరీర్‌లో విభిన్నమైన చిత్రమని చెప్పవచ్చు.

మిగితా క్యారెక్టర్లలో ఎవరెవరంటే?
మిగితా క్యారెక్టర్లలో మంత్రి రాజవర్ధన్‌గా మధుసూదన్ రావు, దివ్యగా నందిని రాయ్, సుదీక్షగా మిషా నారంగ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అలీ రెజా క్యారెక్టర్ నిడివి బాగానే ఉంది. కానీ దాని ఇంపాక్ట్ ఎక్కడా కనిపించదు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. సుదీక్ష, ఆది మధ్య కొన్ని సీన్లు ఉన్నప్పటికీ.. వారి మధ్య కెమిస్ట్రీ ఫీల్‌గుడ్‌గా ఉంది.

సాంకేతిక అంశాలు గురించి
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సీఎస్ఐ సనాతన్ సినిమాకు మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. మర్డర్ మిస్టరీకి కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడంలో బీజీఎం చాలా ఉపయోగపడింది. చాలా సన్నివేశాలు రీరికార్డింగ్‌తో మంచి ఫీల్‌ను అందించాయి. కెమెరా పనితనం బాగుంది.
క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన లైటింగ్‌ను ఉపయోగించిన విధానం బాగుంది. అజయ్ శ్రీనివాస్ నిర్మాతగా చాగంటి ప్రొడక్షన్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్న తీరుతో వారికి సినిమా పట్ల ఉన్న అభిరుచిని తెలియజెప్పాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
మర్డర్ మిస్టరీతో సాగే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆధారిత చిత్రం సీఎస్ఐ సనాతన్. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యాన్ బోన్‌గా నిలిచింది. కథ ఎమోషన్స్, ఇతర అంశాలు బాగానే ఉన్నప్పటికీ.. సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే విధంగా లేకపోవడం కొంత నిరాశను కలిగించే అంశం.
ఆది, నందిని రాయ్, మధుసూధన్ పాత్రలు సినిమాకు బలంగా మారాయి. క్రైమ్, మర్డర్ మిస్టరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. వీకెండ్‌లో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా కేరాఫ్ అడ్రస్. ఈ సినిమాకు సీక్వెల్ లీడ్ కూడా ఇవ్వడం ఆసక్తికరమైన అంశంగా మారింది.


Click it and Unblock the Notifications











