D/O Prasad Rao Web Series Review: D/O ప్రసాదరావు వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: రాజీవ్ కనకాల, ఉదయభాను, గాయత్రి భార్గవి, హిమబిందు, వసంతికా మాధ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ
నిర్మాత: కేవీ శ్రీరామ్
సినిమాటోగ్రఫి: కే మహేష్ కుమార్
ఎడిటర్: చంద్రశేఖర్
మ్యూజిక్ డైరెక్టర్: శ్రీరామ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అంజయ్య
సౌండ్ డిజైనర్: రంగరాజు
ఓటీటీ రిలీజ్ డేట్: జీ5
రిలీజ్ డేట్: 2026-02-27

సూళ్లూరుపేటలో కిరాణం కొట్టు నడుపుకొనే చిరు వ్యాపారి ప్రసాద్‌రావు (రాజీవ కనకాల)కు తన కూతురు స్వాతి (వసంతిక) అంటే పంచ ప్రాణాలు. చిన్నప్పటి నుంచి కంటి రెప్పలా చూసుకొంటాడు. కాలేజీ విద్య పూర్తయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్‌కు వచ్చిన స్వాతి.. భవానీ (గాయత్రి భార్గవి) నడిపే ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో చేరుతుంది. అయితే అతి కష్టంగా స్వాతిని ఒంటరిగా ప్రసాదరావు వదిలి వెళ్తారు. ఓ నెల రోజుల తర్వాత కనిపించకుండా పోయిన స్వాతి శవంగా దొరుకుతుంది. కూతురును ఆ పరిస్థితుల్లో చూసిన తండ్రి స్పృహ తప్పి హాస్పిటల్‌లో చేరుతాడు. సంచలనం రేపిన ఆ కేసును పోలీస్ ఆఫీసర్ రెబాకా జోసెఫ్ (ఉదయభాను) దర్యాప్తు చేపడుతుంది.

స్వాతితో ప్రసాదరావు బాండింగ్ ఎలా ఉండేది? తండ్రి అంటే కూతురుకు ఓ రకమైన భయం ఎందుకు ఉండేది? స్వాతిని తండ్రి ప్రసాద్‌రావు ఎందుకు అనుమానించాడు? ఏ పరిస్థితుల్ల స్వాతి మరణించింది? స్వాతి అనుమానాస్పద మరణంపై రెబాకా దర్యాప్తు ఎలా సాగింది? స్వాతి మరణం వెనుక అసలు కారణం ఏమిటి? స్వాతి మృతి వ్యవహారంలో ఎవరికీ శిక్ష పడింది? ప్రసాద్‌రావు ఎలాంటి శిక్షకు గురయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానమే D/o ప్రసాద్‌రావు వెబ్ సిరీస్ కథ.

D O Prasad Rao Kanabadutaledhu Web Series Review

తండ్రి, కూతుళ్ల మధ్య ప్రేమానురాగాలతో సాగే ఎమోషనల్ జర్నీ ఈ వెబ్ సిీస్ కథ. సింపుల్‌గా రాసుకొన్న కథను అనేక మలుపులతో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సాదాసీదాగా నడిపిచడం చూస్తే దర్శకుడు కృష్ణకు సినిమా కథపై ఉన్న పట్టు ఏమిటో? ఆయన ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. నిందితుడు ఎవరనే విషయంలో రాసుకొన్న ట్విస్టులు ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఉండటంతో కథతోపాటు ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఇలాంటి పాయింట్‌ను మరింత ఎమోషనల్‌గా, బిగ్గర్ స్కేల్‌లో చెప్పడానికి అవకాశం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకనో దర్శకుడు ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకొన్నాడా? అనే అభిప్రాయం ఈ సిరీస్ చూసిన తర్వాత కలుగుతుంది. కథలో వేరియేషన్స్ లేకపోవడం.. చిన్న పాయింట్ చుట్టే కథ అక్కడక్కడే తిరగడం ఓ మైనస్ పాయింట్ అనిచెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ప్రసాదరావుగా రాజీవ్ కనకాల ఎమోషనల్ ఫాదర్‌గా తెరపైన కొత్తగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఒకరకమైన ఇమేజ్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఆయన డిఫరెంట్‌గా ఎమోషనల్ ఫాదర్‌గా పలు రకాల వేరియేషన్స్‌ను చూపించారు. ఆయన నటన సామర్ధ్యం గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌ను భావోద్వేగంగా మార్చడంలో తన మార్కు చూపించారు. చాలా రోజుల తర్వాత స్క్రీన్‌పైకి వచ్చిన ఉదయభాను పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించే ప్రయత్నం బాగుంది. ఆమె బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ పాత్రకు తగినట్టుగా ఉన్నాయి. కథను తన భుజాల మీద వేసుకొని సిరీస్‌ను నడిపించిన తీరు బాగుంది. వసంతికా పాత్ర చిన్నదైనా కథలో కీలకంగా ఉండటంతో గుర్తుండిపోయేలా నటించింది. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ పర్వాలేదనిపించారు.

ఈ సిరీస్ ఎమోషనల్‌గా సాగే క్రైమ్ థ్రిల్లర్ కావడంతో.. సన్నివేశాలకు తగినట్టుగా శ్రీరామ్ డిజైన్ చేసుకొన్న రీరికార్డింగ్ యాప్ట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే బేస్‌తో సాగే కథను తెరపైన కూర్పు చేయడం ఓ రకమైన ఛాలెంజ్. ఆ సవాల్‌ను ఎడిటర్‌గా చంద్రశేఖర్ తన బాధ్యతను సంపూర్ణంగా ముగించారు. కే మహేష్ కుమార్ విజువల్ సెన్స్ బాగుంది. పాత్రల్లో ఉండే ఎమోషన్స్‌ను తెర మీదకు చక్కగా తీసుకొచ్చారు. కేవీ శ్రీరామ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నేటితరం తల్లిదండ్రులకు పిల్లల పెంపకం విషయంలో చక్కటి సందేశాన్ని ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయం.

పిల్లలు, పేరెంట్స్ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా స్వేచ్ఛగా తమ భావాలను పంచుకోవాలనే చక్కటి కథాంశంతో చేసిన స్మాల్ స్కేల్ వెబ్ సిరీస్. ఎలాంటి బిల్డప్స్‌కు వెళ్లకుండా కంటెంట్‌ను ఆడియెన్స్‌కు చెప్పాలనే ప్రయత్నమే కనిపిస్తుంది. పేరెంట్స్ అంటే పిల్లలకు భయం ఉండకూడదు.. తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకొనే వెసులుబాటును కల్పించాలి. తద్వారా ఎలాంటి అపార్ధాలు, తీరని నష్టం జరిగే అవకాశం ఉండదనే విషయాన్ని ఎమోషనల్‌గా చెప్పే సిరీస్ ఇది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. సింపుల్‌గా తక్కువ వ్యవధిలో ముగించే అవకాశం ఉంది కాబట్టి.. ఒకే స్ట్రెచ్‌లో చూస్తే మంచి అనుభూతిని పంచుతుంది. ప్రతీ తల్లి, తండ్రి, పిల్లలు చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X