Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా:
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
రిలీజ్ డేట్: 2025-01-12.

మదనపల్లె ప్రాంతంలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం , ఏనుగు దంతాలు స్మగ్లింగ్‌తో ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవికిషన్), అతని తమ్ముడు మనోహర్ నాయుడు అరాచకాలు చేస్తుంటారు. బేబీ వైష్ణవిని ఈ గ్యాంగ్ చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పాపను కాపాడేందుజకు నానాజీ (నందమూరి బాలకృష్ణ) కాపాడుతాడు.

Daaku Maharaaj Movie Review in Telugu  Nandamuri Balakrishna steals show in Mass Avatar

అయితే వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకొంటుంది? వైష్ణవిని నానాజీ ఎందుకు కాపాడాలనుకొంటాడు. నానాజీ ఎవరు? ఇంజినీర్ సీతా రాం (నందమూరి బాలకృష్ణ) ఎవరు? ఈ ఇద్దరిలో ఎవరు డాకు మహారాజ్‌గా మారారు? బల్వంత్ ఠాకూర్ సింగ్ (బాబీ డియోల్) ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని (శ్రద్దా శ్రీనాథ్) పాత్ర ఏమిటి? కావేరి (ప్రగ్యా జైస్వాల్)తో నానాజీకి సంబంధమేమిటి? ఎస్ఐ (ఊర్వేశీ రటేలా) పాత్ర ఏమేరకు ఉపయోగపడింది? త్రిమూర్తులు నాయుడు అరాచకాలకు డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవికి ఎలా అండగా నిలిచాడు? అనే ప్రశ్నలకు సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ.

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాబీ రాసుకొన్న కథ పాతదే అయినా.. నందమూరి అభిమానులకు కిక్కించేలా రాసుకొన్న కథనం బాగుంది. తెలుగు సినిమా హిట్ ఫార్మాలాను దాారటకుండా సేఫ్‌గా కమర్షియల్ హంగులతో తెరకెక్కించారు. బాలకృష్ణ బాడీలాంగ్వేజ్,యాటిట్యూడ్‌కు తగినట్టుగానే నానాజీ, సీతారాం క్యారెక్టర్లను బలంగా రాసుకొన్నారు. బేబీ వైష్ణవి చుట్టు రాసుకొన్న కథలో గట్టిగాన భావోద్వేగాలు దట్టించారు. సంక్రాంతి ప్రేక్షకులకు, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్‌కు పుల్ మీల్స్ లాంటి సినిమాను అందించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.

బాలకృష్ణ ఎప్పటి లానే తనదైన శైలిలో డైలాగ్స్, మాస్ అప్పీల్‌తో నానాజీగా, సీతారాంగా తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. సరికొత్త గెటప్, దానికి తగినట్టుగా మేనరిజంతో అభిమానలను కేక పెట్టించే ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రం నందినిగా శ్రద్దా శ్రీనాథ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో మరోసారి తన మార్కు చూపించారు. కథలో కీలకంగా, స్టోరీని ముందుకు నడిపించే పాత్రతో తనదైన శైలిలో నటించి నటిగా మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇక ప్రగ్యా జైస్వాల్ మరో కీలకమైన పాత్రలో మెరరిసారు. ఎస్‌ఐగా ఊర్వశి రౌటేలా నటనపరంగానే కాకుండా గ్లామర్ పరంగా మసాలాను నింపింది.

బాబీ డియోల్ విలనిజం బాగుంది. బాలయ్యతో పోటీపడి నటించాడు. మరో విలన్‌గా రవికిషన్ నానాజీతో నువ్వా నేనా అనే విధంగా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు.‌స్పెషల్ అండ్ సర్‌ప్రైజ్ క్యారెక్టర్లలో కనిపించారు. చాందినీ చౌదరీ సచిన కేడ్కర్, ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Daaku Maharaaj Movie Review in Telugu  Nandamuri Balakrishna steals show in Mass Avatar

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఫైట్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తమన్ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది. కీలక సన్నివేశాల్లో పూనకం వచ్చిందా? అనే సౌండింగ్ ఇచ్చారు. దబిడి దిబిడి మాస్ ఆడియెన్స్ ఉర్రూతలూగించేలా స్క్రీన్ మీద కనిపించింది. విజయ్ కార్తీక్ డిఫరెంట్ లొకేషన్స్ ఊటి, రాజస్థాన్‌ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తెరను ఆహ్లాదకరంగా మార్చేసింది. ఇసుకు తుఫాన్ లాంటి సీన్లలో విఎఫ్ఎక్స్ పనితీరు బాగుంది. నాగవంశీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాలకృష్ణ ఇమేజ్ లోబడి.. మాస్, కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేసి రూపొందించిన ఎమోషనల్ డ్రామా డాకు మహారాజ్. అయితే ఫస్టాఫ్‌ను బ్రహ్మండంగా ఎలివేట్ చేసినప్పటికీ.. క్లైమాక్స్‌‌లో సింపుల్‌గా ముగించేసి.. తడబాటుకు గురయ్యాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. బోయపాటి రేంజ్‌లో మాస్ డైలాగ్స్‌ ఇంకా జొప్పించి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్, రొటీన్ పాయింట్‌తో బాలయ్యను మరోసారి మాస్ అవతారంతో మ్యాజిక్ చేసే ప్రయత్నం కనిపించింది. నందమూరి ఫ్యాన్స్‌కు, సంక్రాంతి ఆడియెన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. కొత్తదనం ఆశించకుండా వెళితే.. భావోద్వేగమైన అంశాలు మంచి అనుభూతిని పంచుతాయి. డాకు మహారాజ్ మంచి థియేట్రికల్ ఎక్సీపిరియెన్స్ ఉన్న సినిమా..ఎలాంటి అంచనాలు లేకుండా మిమ్మల్ని ఎ నిరాశ పరచదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X