Daaku Maharaaj Movie Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పైసా వసూల్
నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం డాకు మహారాజ్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా కథానాయికలు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో బాలకృష్ణ, బాబీ డియోల్ పవర్ ప్యాక్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారు. ఊర్వశి రౌటేలా సెక్సీ ఐటెమ్ సాంగ్ అదిరిపోతుంది. ఈ చిత్రంలోని డైలాగ్స్‌కు సీటీ కొట్టాల్సిందే. సీటీమార్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఈ సినిమా రొటీన్ స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే అయినప్పటికీ.. సంక్రాంతి పండుగకు పక్కాగా సరిపోయే చిత్రం అని ఉమేర్ సంధూ తన రివ్యూ ఇచ్చారు.
డాకు మహారాజ్ గురించి ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఏయ్ దీనమ్మ ఇది కదా మాకు కావాల్సిన ఎమోషన్ నాగవంశీ. డైరెక్టర్ బాబీ. డాకు ఎమోషన్ మూమెంట్స్ విత్ డాకూ హార్స్ అని తన ఎమోషన్స్ ట్వీట్ చేశారు.
డాకు మహారాజ్ గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో తొలి 100 కోట్ల షేర్.. 200 కోట్ల గ్రాస్ వసూలు చేయబోతున్నది. నందమూరి ఫ్యాన్స్‌కు, మెగా ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతి పండుగ మరిచిపోలేనిది మారిపోతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
బాలయ్య అంటే సినిమా రంగంలో కింగ్.. గాడ్ ఆఫ్ మాసెస్, స్వచ్చమైన హృదయం, మాస్ అంశాల కాంబినేషన్. ఆయన అంటే ఓ పండుగ, ఆయన సినిమా అంటే ఓ సెలబ్రేషన్ అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.
డాకు మహారాజ్ బిగ్గెస్ బ్లాక్ బస్టర్.. బాక్సాఫీస్ ఊచకోత మొదలైంది అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











