Dacoit Movie Public Talk: ‘డెకాయిట్' పబ్లిక్ టాక్.. అడివి శేషు సినిమా ఎలా ఉందంటే..?

Dacoit Movie Public Talk: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit). లవ్, ఫ్యామిలీ, యాక్షన్, రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న భారీ అంచనాలతో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీమియర్ షోల పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ 'డెకాయిట్' సినిమాపై పబ్లిక్ టాక్ ఎలాంటి? ప్రేక్షకుల అభిప్రాయాలు, సోషల్ మీడియా రివ్యూల వివరాల్లోకి వెళితే..

డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించగా, అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, షానీల్ డియో దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని ధనుష్ భాస్కర్ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. ఎడిటింగ్‌లను బాధ్యత కోదాటి పవన్ కల్యాణ్ నిర్వహించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను గ్యానీ అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఈ సినిమాను నిర్మించారు.

Dacoit Movie Public Talk  Adivi Sesh  Mrunal Thakur Emotional Action Drama receives positive Reviews

డెకాయిట్ (Dacoit)కి సోషల్ మీడియాలో స్పందనను చూస్తుంటే.. మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా లవ్, ఎమోషన్, యాక్షన్ మిక్స్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హీరో,హీరోయిన్ కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచిందని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అడివి శేష్ తన స్టైలిష్ యాక్టింగ్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లో మంచి ఇంప్రూవ్‌మెంట్ చూపించాడని టాక్ వినిపిస్తోంది. ఇక మృణాల్ ఠాకూర్ పాత్రలోని భావోద్వేగాలు ఆకట్టుకుందని చెప్పుతున్నారు. ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా టచ్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో రివ్యూలు చెబుతున్నాయి.

ఇక కథ, స్క్రీన్‌ప్లే విషయానికి వస్తే.. సినిమా కథ లవ్ స్టోరీతో ప్రారంభమై,విడిపోయిన ప్రేమికులు మళ్లీ కలుసుకోవడం చుట్టూ తిరుగుతుంది. ఈ కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా, స్క్రీన్‌ప్లేలో కొన్ని ట్విస్టులు ఆసక్తిని పెంచాయని ప్రేక్షకులు అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే రివీల్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఇక యాక్షన్ సీక్వెన్స్‌లు, చేజ్ బ్లాక్స్, సినిమాటోగ్రఫీ వంటి టెక్నికల్ హైలైట్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ఎలివేషన్ ఇచ్చాయని రివ్యూలు చెబుతున్నాయి. "కన్నెపెట్టారో" రీమిక్స్ సాంగ్ కూడా ప్రేక్షకులకు నచ్చిన అంశంగా మారింది. అయితే సినిమా పూర్తిగా పర్ఫెక్ట్ అని చెప్పలేమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి భాగం కాస్త స్లోగా అనిపించిందని, కథలో కొత్తదనం తగ్గిందని కొంతమంది టాక్. అలాగే కొన్ని డైలాగ్స్ క్లారిటీ లేకపోవడం కూడా చిన్న మైనస్‌గా చెబుతున్నారు.

ట్విట్టర్‌లో మరికొందరైతే.. 'ఎమోషన్, యాక్షన్ పర్ఫెక్ట్ మిక్స్' అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు "అవెరేజ్ యాక్షన్ ఫ్లిక్" అంటూ మిక్స్డ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం "థియేటర్‌లో ఒకసారి చూడదగ్గ సినిమా" అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మొత్తంగా చూస్తే.. డెకాయిట్ సినిమా పబ్లిక్ టాక్ ప్రకారం ఒక డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలుస్తోంది. స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్‌లు,ట్విస్టులు సినిమాకు హైలెట్ గా మారబోతున్నాయి టాక్. ఈ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో వేచి చూడాలి.

Read more about: adivi sesh mrunal thakur dacoit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X