Dacoit Movie Review: డెకాయిట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: అడివి శేష్, మృణాల్ థాకూర్, అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు
నిర్మాత: సుప్రియా యార్లగడ్డ
దర్శకత్వం: షానీల్ డియో
సినిమాటోగ్రఫి: ధనుష్ భాస్కర్
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: గ్యానీ
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-04-10

హరి అలియాస్ హరి దాస్ (అడివి శేష్), సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ థాకూర్) ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించుకొంటారు. కానీ జూలియట్ చేసిన నమ్మక ద్రోహానికి హరి 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అయితే జూలియన్ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు హరి జైలు నుంచి పారిపోయి వస్తాడు. ఈ సమయంలో జూలియట్ తన భర్త, కూతురితో ఓ క్లిష్టమైన సమస్యలో కూరుకుపోతుంది. అయితే తన కష్టాల నుంచి గట్టేక్కేందుకు హరి కరుణ హాస్పిటల్ యజమాని (ప్రకాశ్ రాజ్) దవాఖానలో ఓ దోపిడికి ప్లాన్ చేస్తాడు. ఆ దోపిడిలో జూలియట్ ఇరికించే విధంగా స్కెచ్ వేస్తాడు.

ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన హరిని జూలియట్ ఎందుకు మోసం చేసింది? తన స్నేహితురాలు (కామాక్షి భాస్కర్ల)కు జరిగిన అన్యాయం కేసులో హరిని జూలియట్ ఎలా బలి చేసింది? జైలు శిక్ష సమయంలో హరి అనుభవించిన మానసిక క్షోభ ఏమిటి? కరుణ హాస్పిటల్‌లో యజమాని దందా ఎలా సాగింది? జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత జూలియట్ రియాక్షన్ ఎలా ఉంది? జూలియట్‌కు ఎదురైన కఠిన సమస్య ఏమిటి? జూలియట్‌పై ప్రతీకారానికి బదులు హరి ఎలాంటి త్యాగానికి సిద్దపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే డెకాయిట్ సినిమా కథ.

Dacoit Movie Review and Rating

జైలులో శిక్ష అనుభవిస్తున్న హరిని కలిసేందుకు వచ్చిన తన తోటి ఖైదీ (అతుల్ కులకర్ణి)కి కథ చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో సినిమా మొదలవుతుంది. అయితే కథలోకి వెళ్లడానికి దాదాపు 30 నిమిషాలకుపైగా సమయం తీసుకోవడంతో ఆడియెన్స్‌కు దర్శకుడు షానీల్ డియో పడుతున్న కన్‌ఫ్యూజన్ అర్ధమవుతుంది. జైలు నుంచి పారిపోవడానికి డిజైన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ కొంత కనెక్ట్ కావడంతో సినిమా సరైన గాడిలో పడిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత జూలియట్‌ను కలిసిన తర్వాత కథలో కొంత వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు ఓ ఎమోషనల్ సీన్‌తో ఫస్టాఫ్‌ను ముగించి ఆడియెన్స్‌కు కథ ఇలా ఉండబోతుందనే హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అయితే సెకండాఫ్ తర్వాత కూడా ఫాస్ట్‌గా సాగుతుందని భావించిన ప్రేక్షకుడికి మళ్లీ కథలో సాగదీత ఎదురవుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు రాసిన డ్రామా వర్కవుట్ కావడంచ, కథలో వేగం పెరగడంతోపాటు కొన్ని మూమెంట్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. దర్శకుడు షానిల్ డియో రాసుకొన్న క్లైమాక్స్, డిజైన్ చేసిన సీన్లు హైలెట్‌గా మారాయి. దాంతో సినిమా హిట్ కావాల్సిన హంగులను జోడించడంలో దర్శకుడు సఫలమయ్యాడు.

హరిగా అడివి శేష్, జూలియట్‌గా మృణాల్ థాకూర్ తమ పాత్రల్లో జీవించారు. మరోసారి ఇద్దరూ కూడా డీసెంట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. అడివి శేష్ యాక్షన్లలో హీరోయిజం, ఎమోషనల్ సీన్లలో యాక్టింగ్ బాగుంది. కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, జేయ్ మేరీ ఖాన్ తమ పాత్రల్లో గుర్తుండిపోయేలా నటించడమే కాకుండా సినిమాకు బలంగా మారారు.

డెకాయిట్ సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫి, నాగేంద్ర ఆర్ట్ వర్క్ సినిమాకు హైలెట్‌గా మారింది. భీమ్స్ సిసిరోలియో పాటలు, గ్యానీ బీజీఎం సినిమాకు అల్టిమేట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

More from Filmibeat

Read more about: dacoit adivi sesh mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X