Dacoit First Review: డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ

టాలీవుడ్ యువ హీరో అడివి శేష్, అందాల భామ మృణాల్ థాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ సమర్ఫణలో సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాను నిర్మించారు. ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జ్యాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు.

ఈ మూవీ సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫిని, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గ్యానీ బాధ్యతలను నిర్వర్తించారు. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించి సెన్సార్ జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం గురించి సెన్సార్ బోర్డు వెల్లడించిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ చిత్రం రన్‌టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Dacoit Review By Censor Board

హరి ( అడివి శేష్), జూలియట్ (మృణాళ్ థాకూర్) ప్రేమించుకొంటారు. జీవితంలో ఒకరికొకరు తోడు ఉండాలని కోరుకొంటారు. తాము ఒకటి తలిస్తే విధి మరోలా తలవడంతో ఇద్దరు విడిపోతారు. హరి దుబాయ్‌కి ఎందుకు వెళ్లారు? జూలియట్‌కు కోటి రూపాయలు ఎందుకు అవసరం అయ్యాయి? పోలీసులు జూలియట్‌ను, హరిని ఎందుకు వెంటాడారు? హరి, జూలియట్ తమ కుటుంబంలోకి చిన్నారి జూలియట్ రావాలని కన్న కలలు నిజమయ్యాయా? ఇద్దరు చేసుకొన్న బాసలు, కోరిక మేరకు చివరి వరకు కలిసి ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే డెకాయిట్ సినిమా కథ అనే విషయం ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు.

ప్రేమ కథా చిత్రంగా యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు, అలాగే మరొకొన్ని సీన్లలో డైలాగ్స్‌పై వివరణ కోరారు. అయితే సెన్సార్ అధికారుల ప్రశ్నలకు చిత్ర యూనిట్ కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. డైలాగ్స్ విషయంలో ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందారనే విషయం తెలిసింది.

డెకాయిట్ సినిమా గురించి చిత్ర యూనిట్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూఏ (U/A16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు దాటిన వారు ఈ మూవీని ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో క్లియర్‌గా వెల్లడించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

గత చిత్రాల కంటే మాస్ అవతారంలో శేష్ కనిపించనున్న ఈ చిత్రం సన్నివేశాలు, కథ డిమాండ్ చేయడంతో రన్ టైమ్ భారీగానే పెంచారు. ఈ సినిమా కథా విస్తృతి, పాత్రల ప్రధాన్యంతో సినిమాను డిటెయిల్‌గా చెప్పడంతో రన్‌టైమ్ పెంచాల్సి వచ్చింది అని చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. అంటే సుమారుగా 160 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని తెలిపారు.

పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అడివి శేష్ గత చిత్రాలకు భిన్నంగా మాస్ అవతారంలో ప్రయోగం చేసినట్టు కనిపిస్తున్నది. మృణాల్ థాకూర్ మరోసారి ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ ప్రయోగం శేష్‌కు సక్సెస అందిస్తుందా? లేదా? అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఈ సినిమా గురించిన అప్ డేట్స్, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ తెలుగును ఫాలో అవ్వండి.

Read more about: dacoit adivi sesh mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X