Dacoit Trailer Review: అడివి శేష్ ‘డెకాయిట్' ట్రైలర్‌ రివ్యూ.. అంచనాలు పెంచేశారుగా..

Dacoit Trailer Review: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్ (Dacoit). ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్న కథలను ఎంచుకునే దర్శకుడు షానిల్ డియో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, హీరోయిన్‌గా మృనాల్ ఠాకూర్ నటిస్తోంది. రివెంజ్ ఎలిమెంట్స్‌తో పాటు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని, ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మూవీ మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ క్రమంలో ట్రైలర్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది.ఈ రోజు (ఏప్రిల్ 4) ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్ ఎలాగా ఉందంటే?
ఎప్పుడూ థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్, ఈసారి 'డెకాయిట్' సినిమాతో మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతోంది. శనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాన్స్, యాక్షన్, రివెంజ్, ఎమోషన్ అన్ని కలిసిన ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా ఫ్యామిలీ, సెంటిమెంట్స్ తో నిండిన కథగా కనిపిస్తోంది.

Dacoit Trailer Review  Adivi Sesh   Mrunal Thakur Film Raises Expectations

ట్రైలర్ ప్రారంభంలో హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్) మధ్య ఉన్న గాఢమైన ప్రేమను ఎంతో సాఫ్ట్‌గా చూపించారు. ఒక సాధారణ ప్రేమ జంటలా జీవితం గడపాలని ఆశపడే వీరిద్దరి జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. పెళ్లి తర్వాత కుటుంబం, పిల్లల గురించి ఆలోచించే సమయంలోనే హరి జీవితంలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. అతను జైలుకు వెళ్లడం, ఆ తర్వాత జూలియట్ ఒంటరిగా సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం కథను ఒక్కసారిగా ఎమోషనల్ లోకి తీసుకెళ్తుంది.

ఇక్కడి నుంచి కథ పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది. జూలియట్ తన కూతురి ప్రాణాలను కాపాడేందుకు భారీ మొత్తంలో డబ్బు అవసరమయ్యే పరిస్థితి రావడం, ఆ పరిస్థితుల్లో హరిని జైలు నుంచి బయటకు తీయడం వంటి అంశాలు కథలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఒక ప్రేమికుడు పరిస్థితుల వల్ల ఎలా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి 'డెకాయిట్'గా మారాడనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశంగా ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

అడివి శేష్ ఈ సినిమాలో రెండు విభిన్న కోణాల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒకవైపు అమాయక ప్రేమికుడిగా, మరోవైపు తెలివిగా వ్యవహరించే నేరస్థుడిగా ఆయన నటనలో ఉన్న వెర్సటిలిటీ ట్రైలర్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మృణాల్ ఠాకూర్ కూడా జూలియట్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ప్రేమికురాలిగా, మరోవైపు.. బాధ్యత గల తల్లిగా ఆమె చూపించిన ఎమోషన్స్ ప్రేక్షకులను కచ్చితంగా కట్టిపడేసేలా ఉన్నాయి.

ఈ సినిమాకు మరో హైలైట్ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఆయన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. అలాగే ప్రకాష్ రాజ్, అతుల్ కుల్కర్ణి, సునీల్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తూ కథను మరింత బలంగా నిలబెడుతున్నారు. స్టార్ కాస్ట్‌తో పాటు కంటెంట్ కూడా స్ట్రాంగ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

టెక్నికల్‌గా కూడా 'డెకాయిట్' మంచి స్థాయిలో కనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ మొత్తానికి ప్రాణం పోసినట్టుగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్, ఎడిటింగ్ అన్ని కలిసి ఒక హై వోల్టేజ్ అనుభూతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రొమాన్స్ నుంచి యాక్షన్‌కి, అక్కడి నుంచి ఎమోషన్‌కి మారే ట్రాన్సిషన్ చాలా స్మూత్‌గా ఉంది. చివర్లో 'అందరూ మహేష్ బాబులు అయిపోదామనే?’ అని అడివి శేషు చెప్పే డైలాగ్ ట్రైలర్ మొత్తానికి హైలెట్ గా మారింది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అడివి శేష్ తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తూ ఈ సినిమాతో మరో హిట్ అందుకునేలా కనిపిస్తున్నాడు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: adivi sesh dacoit mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X