twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెంటిమెంట్‌ డాడీ!

    By Staff
    |

    Daddy
    -జలపతి
    చిత్రం: డాడీ!
    నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్‌, బేబీ అక్షయ, ఆషీమా భల్లా
    సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
    నిర్మాత: అల్లు అరవింద్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సురేష్‌ కృష్ణ

    రెండు సాధారణ చిత్రాల తర్వాత కూడా చిరంజీవి అదే తప్పు చేశారు. మృగరాజు, మంజునాథ తర్వాత చిరంజీవి ఇమేజ్‌ ను బూస్టప్‌ చేసేందుకు అల్లు అరవింద్‌ సెంటిమెంటే ఆయుధమనుకున్నారేమో. తెలుగు సినిమా ఆస్థాన సెంటిమెంట్‌ రచయిత భూపతిరాజా అల్లిన మరో మూసకథ-డాడీ. సీన్ల కొద్దీ సెంటిమెంటల్‌ సీన్స్‌ గుప్పించి ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశారు దర్శక, రచయితలు. చిరంజీవి బరువు తగ్గి అందంగా తయారై, ట్రెండీ డ్రెస్సెస్‌ వేసుకొని హ్యాండ్‌ సమ్‌ గా ఉన్నా, సినిమా మాత్రం పాతచింతకాయ పచ్చడే.

    ప్రేక్షకులకు పాటలు ఒక్కటే రిలీఫ్‌. చిరంజీవి, సిమ్రాన్‌, బేబీ అక్షయలతోనే సినిమాను లాగించారు. ఒక్క కామెడీ ట్రాక్‌ కూడా లేకపోవడం ప్రేక్షకులకు ఇక ఊపిరితీసుకునే అవకాశం ఉండదు. సినిమా అంటే 'లీనమైపోయి కన్నీళ్ళు కార్చడం' అనుకునే వారికి ఇది బెస్ట్‌ ఫిల్మ్‌.

    సినిమా ప్రారంభం మాత్రం మాస్‌ అప్పీలింగ్‌ గా ఉంటుంది. బైక్‌ మీద వచ్చి యాక్సిడెంట్‌ లో కాపాడే దృశ్యంతో చిరుకు ఇంట్రడక్షన్‌. ఈ సీన్‌ చూసి తమ యాడ్‌ ఫిల్మ్‌ కు హీరో అతనే అనుకొని ఆషిమా భల్లా వెంటపడుతుంది. అంతలోనే లవ్వులో పడుతుంది. చిరు ప్రేమ దక్కకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుంది. అప్పుడు రాజేంద్రప్రసాద్‌ ప్లాష్‌ బ్యాక్‌ చెప్పుతాడు.

    ఫ్లాష్‌ బ్యాక్‌ లో చిరు పెద్ద డాన్స్‌ మాస్టర్‌. పాప్‌ ఆల్బమ్‌ లు చేస్తూ బోల్డంత డబ్బు సంపాదిస్తాడు. సిమ్రాన్‌ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఒక కూతురు పుడుతుంది. కానీ చిరుకు ఫ్రెండ్స్‌ అంటే వీక్‌ నెస్‌. వారికోసం ఏమైనా సాయం చేస్తాడు. అలా అచ్యుత్‌ కు కూడా సాయం చేస్తాడు. కానీ అచ్యుత్‌ మోసం చేయడంతో చిరు దివాలా తీస్తాడు. అదే సమయంలో బేబీ అక్షయకు దెబ్బ తగులుతుంది. ఆస్పత్రిలో చేర్చితే, అక్షయకు శ్వాసకు సంబంధించిన వ్యాధి ఉందని తేలుతుంది. వెంటనే ఆపరేషన్‌ చేస్తేనే బతుకుతుందని చెప్పుతారు. మూడులక్షలు కష్టమైపోయి, చివరికి అక్షయ చనిపోతుంది. చిరు నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని, సిమ్రాన్‌ నిందిస్తుంది. సో ఇద్దరూ విడిపోతారు. ఇంటర్వెల్‌. ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా ముగుస్తుంది. ఆ తర్వాత సిమ్రాన్‌ మరో కూతురుకు జన్మనిస్తుంది. ఈ కొత్త పాప ఐశ్వర్య, సిమ్రాన్‌ లను చిరంజీవి ఎలా కలుసుకుంటాడనేది మిగతా సినిమా.

    చిరంజీవి అందంగానే ఉన్నాడు. కానీ సినిమే అందంగా లేదు. సిమ్రాన్‌ ఓకే. బేబీ అక్షయ బాగానే చేసింది. ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌ సంగీతం ఫర్వాలేదు. పాటల చిత్రీకరణ బాగుంది. చోటా.కె.నాయుడు ఫోటోగ్రఫీ వల్ల, కళాదర్శకుడి ప్రతిభ వల్ల పాటలు చూడడానికి బాగున్నాయి. భూపతిరాజా(కథా రచయిత) మరోసారి జనాలను చావగొట్టాడు. సత్యానంద్‌ మాటలు మరీ పేలవంగా ఉన్నాయి. సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించాడా అనేది డౌటే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X