Dahanam movie review ఆచారాల మాటున ఆకలి.. సమాజాన్ని ఆలొచింపజేసే దహనం!

Rating: 2.5/5

నటీనటులు: ఆదిత్య ఓం, శాంతి చంద్ర, సోనిరెడ్డి, ఎఫ్ఎం బాబాయ్, రాజీవ్ నాయక్ తదితరులు
దర్శకత్వం: అదరి మూర్తి సాయి
నిర్మాత: డాక్టర్ సతీష్ కుమార్
మ్యూజిక్: డాక్టర్ సతీష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: ఎస్ రామకృష్ణ
ఎడిటింగ్: జేపీ
బ్యానర్: ఓపెన్ ఫీల్డ్ మీడియా
సహ నిర్మాత: మిస్ భూమిక నాయుడు
రిలీజ్ డేట్: 2023-03-31

దహనం సినిమా కథేమిటంటే?

దహనం సినిమా కథేమిటంటే?

చిన్నతనం నుంచి శివుడిని పూజిస్తూ.. శివతత్వమే జీవితంగా భావించే శాస్త్రి (ఆదిత్య ఓం). శివుడి ఆలయానికి తండ్రి ఇచ్చిన మాన్యం భూములను వెనుకకు లాగేసుకొనేందుకు ప్రయత్నించే భూస్వామి భూపతి. శివాలయానికి చేరువగా ఉండే శ్మశానంలో కాటికాపరి భైరాగి (ఎఫ్ఎమ్ బాబాయ్ అలియాస్ త్రినాథరావు) శవాలను కాల్చగా వచ్చే డబ్బుతో జల్సాగా జీవితాన్ని లాగిస్తుంటాడు.

శివాలయాన్ని వదిలేస్తే డబ్బుతోపాటు మంచి జీవితాన్ని ఇస్తానని శాస్త్రికి భూపతి ప్రలోభాలను పెడుతుంటాడు. కానీ కటిక పేదరికంతో బాధపడుతున్నప్పటికీ తాను నమ్ముకొన్న శివుడి సన్నిధి నుంచి దూరం కావడానికి శాస్త్రి నిరాకరిస్తాడు.

దహనంలో ట్విస్టులు

దహనంలో ట్విస్టులు

శివాలయానికి సంబంధించిన భూములను అప్పగించడానికి నిరాకరిస్తూ కోర్టుకు వెళ్లిన శాస్త్రికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కోర్టుకు వెళ్లిన శాస్త్రిని భూపతి ఎలాంటి ప్రలోభవాలకు గురిచేశాడు? శాస్త్రి జీవితంలో భైరాగి ఎలాంటి ప్రభావం చూపించాడు? కోర్టులో శాస్త్రి తన పంతం నెగ్గించుకొన్నాడా? తన తండ్రి ధారదత్తం చేసిన మాన్యం భూములను భూపతి దక్కించుకొన్నాడా? శాస్త్రీ పేదరికానికి ఎలాంటి పరిష్కారం లభించింది? బైరాగి జీవితానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దహనం సినిమా కథ.

దహనం మూవీ ఎలా సాగిందంటే?

దహనం మూవీ ఎలా సాగిందంటే?

హిందూ సంప్రదాయం, ఆచారాలు, కట్టుబాట్లను పూర్తిగా నమ్ముకొన్న శాస్త్రికి, తన కుటుంబం దానం చేసిన మాన్యం భూములను చేజిక్కించుకోవడమే కాకుండా శివాలయాన్ని ధ్వంసం చేసే కుట్రపూరితమైన భూస్వామికి మధ్య భావోద్వేగమైన సమస్య ఈ సినిమాకు ముడిసరుకు. కాటికాపరి భైరాగి తాత్వికత కథకు మరింత బలంగా కనిపిస్తుంది. భూస్వామి భార్య, శాస్త్రి కూతురు పాత్రలు ఫిలాసిఫికల్ టచ్‌తో కథను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చుతాయి. భర్తనైనా వదిలేసుకోవడానికి సిద్దం కానీ.. డబ్బు కోసం క్రైస్తవమతం పుచ్చుకోవడానికి నిరాకరించే శాస్త్రీ కూతురు పాత్ర కథను మలుపు తిప్పే అంశంగా ఉంటుంది.

ఆదిత్య ఓం.. ఇతరుల గురించి

ఆదిత్య ఓం.. ఇతరుల గురించి

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గతంలో కనిపించిన గ్లామర్, కమర్షియల్ రోల్స్‌కు భిన్నంగా ఆదిత్య ఓం విభిన్నమైన పాత్రతో కనిపించారు. సంప్రదాయ బ్రహ్మణ పూజారిగా విలక్షణమైన నటనను ప్రదర్శించారు.దేవాలయమే నా దేహం అనే థీమ్ ఉన్న క్యారెక్టర్‌లో ఆదిత్య ఓం ఒదిగిపోయాడు.అదిత్య ఓం ఇలాంటి పాత్ర చేయడం ప్రేక్షకుడికి సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా మారే అవకాశం ఉంది.

దహనం సినిమాలో అత్యుత్తమ నటనను ఎఫ్ఎం బాబాయ్ అలియాస్ త్రినాథరావు ప్రదర్శించారు. సినిమా భారాన్నంత ఎఫ్ఎం బాబాయ్ ఒంటిచేత్తతో మోశారని చెప్పవచ్చు. శ్రీకాకుళం యాసతో ఫిలాసిఫికల్ టచ్‌తో బైరాగి పాత్ర చెప్పిన డైలాగ్స్ ఆలోచింపజేయడమే కాకుండా హృదయాన్ని కూడా హత్తుకొంటాయి.

నిత్యం దేవుడిని కోలిచే వ్యక్తికి పేదరికం.. శవాలను నమ్ముకొనే కాపరి ఇంట్లో విలాసవంత జీవితాన్ని తెరపైన అద్బుతంగా తెరకెక్కించారు. భూపతిగా నటించిన శాంతి చంద్ర సాఫ్ట్ విలనిజంతో తన పాత్రకు న్యాయం చేశారు. భూపతి భార్య, శాస్త్రి కూతురు వైదేహి (సోనిరెడ్డి) కథకు బలంగా నిలిచే పాత్రలో కనిపించారు.

దర్శకుడు, సాంకేతిక విలువ గురించి

దర్శకుడు, సాంకేతిక విలువ గురించి

అగ్ర వర్ణాలకు, తక్కువ కులాల మధ్య వివక్షను తనదైన శైలిలో తెర మీద చూపించే విషయంలో దర్శకుడు అదరి మూర్తి సాయి సక్సెస్ అయ్యాడనిచెప్పవచ్చు. ఈ సినిమాలోని డైలాగ్స్ మరింత బలంగా మారాయి. రచయితగా దర్శకుడు తన మాటల్లో చాలా తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేయడం ఆకట్టుకొనే అంశం.

అంటరాని యువకుడిని తాకిన బ్రహ్మణ యువతి చేతులు కాల్చి శుద్ది చేసే సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. పూజారి కుటుంబ ఆకలిని చూసి భరించలేక కాటికాపరి నిత్యావసర వస్తువులు అందించడం, పూజారి ఇంట్లో ఆహారం లేక చంటి పిల్లాడు ఏడిస్తే.. పాలు పట్టే సీన్ ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయి. ఇక నిర్మాత సతీష్ కుమార్ మ్యూజిక్ అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. భావోద్వేగంతో సాగే సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. ఎస్ రామకృష్ణ అందించిన సినిమాటోగ్రఫి సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయడమే కాకుండా మంచి మూడ్‌ను క్రియేట్ చేసింది.

జేపీ ఎడిటింగ్ బాగుంది. సతీష్ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల ఎంపిక, బడ్జెట్ పరిమితుల కారణంగా రాజీ పడినట్టు కనిపిస్తుంది. మంచి నటీనటులు ఎంపిక చేసి ఉంటే.. ఈ సినిమాకు మరింత మైలేజ్, ఆడియెన్స్ రీచ్ దక్కేదనిపించింది.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

నాలుగు దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రలో జరిగిన వాస్తవ సంఘటనలకు హిందుత్వ విలువలు, సంప్రదాయాలు, ఆచారాలు, కుల మతాల వివక్ష లాంటి అంశాలను జోడించి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం దహనం. కమర్షియల్ విలువలకు దూరంగా కంటెంట్‌ను నమ్ముకొని నిజాయితీగా అటెంప్ట్ చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు.

ఆర్ట్ సినిమాగా కనిపించే ఎమోషనల్ కంటెంట్ ఉన్న చిత్రమని చెప్పవచ్చు. ఆకలికి ఆచారాలు ఉంటాయా? పేదరికానికి మతాల హద్దులు అవసరమా? అంటరానితనం లాంటి అంశాలతో ప్రశ్నించడంలో దర్శకుడి ఆలోచన స్పష్టంగా తెలుస్తుంది. చిన్న నటీనటులు, వర్థమాన నటులు 100 శాతం ప్రతిభను, కష్టాన్ని పెట్టి నటించిన చిత్రం దహనం. కథను నిదానంగా, వివరంగా పాత్రలతో చెప్పించే తీరు నేటితరం ప్రేక్షకులకు కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది.

ఎలాంటి అంచనాల లేకుండా వెళితే.. తప్పకుండా దహనం మంచి ఫీల్ అందిస్తుంది. మిథునం లాంటి సినిమాలను ఆదరించే వారికి దహనం తప్పకుండా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X