For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దండు(గ) పాళ్యం ( రివ్యూ)

  By Srikanya
  |

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  1.5/5
  టీవీ ఛానెల్స్ లో నేరాలు-ఘోరాలు, క్రైమ్ స్టోరీ, క్రైమ్ వాచ్ వంటి పోగ్రామ్స్ కు అలవాటైన మనకు వెండితెరపై ఈ పోగ్రామ్ ని వెండితెరపై చూడాల్సి వస్తే.. ఎలా ఉంటుంది అంటే..అదీ 'దండుపాళ్యం' సినిమా చూసిన ఎక్సపీరియన్స్ లాగ ఉంటుంది. ఓ తెలుగు దర్శకుడు కన్నడంలో తెరకెక్కించి అక్కడ విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు అనువాదం విడుదలైంది.

  అయితే 'దండుపాళ్యం' కథ నిజంగా కన్నడ ప్రాంతంలో జరిగి,సంచలనం సృష్టించింది కాబట్టి అక్కడి వారికి కనెక్టు అయ్యిండవచ్చు..అలాగే అందులో నటీనటులు తమకు పరిచయమున్న వారు కావటం,టేకింగ్ తమ రెగ్యులర్ చిత్రాల తరహాలో ఉండటంతో నచ్చి హిట్ చేసి ఉండవచ్చు. కానీ... మనకు సంభందం లేని ప్రపంచాన్ని,మనకు పరిచయం లేని నటులతో, నీరసంగా సాగే స్క్రీన్ ప్లే తో అందిస్తే మాత్రం సహన పరీక్షే అనిపిస్తుంది. ఆ విధంగా అందించటంలో దర్శకుడు శాయిశక్తులా ప్రయత్నించి కృతకృత్యుడు అయ్యాడు.

  నటీనటులు: రవిశంకర్‌, పూజా గాంధీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవికాలే, నిషా కొఠారి, రఘు ముఖర్జీ, కర్రి సుబ్బు తదితరులు
  కెమెరా: వెంకట్‌ ప్రసాద్‌,
  సంగీతం: అర్జున్‌ జాన్య,
  రచనాసహకారం: కె.ఆర్‌.కె.రాజు.
  రచన-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

  50 హత్యలు.. 150 మానభంగాలు.. 300పైగా దొంగతనాలు.. బెంగళూరు సమీపంలోని దండుపాళ్య గ్రామానికి చెందిన ఓ బందిపోటు ముఠా ఐదేళ్ల ట్రాక్‌ రికార్డ్‌ ని ఆధారం చేసుకుని అల్లిన కథ ఇది. వీరు ఎప్రోచ్ విభిన్నంగా ఉంటుంది . మొదట ఒంటిరిగా విసిరేసినట్లున్న ఇళ్లు వెతుక్కుంటారు. తర్వాత ఆ ఇంటిలో ఎవరు ఉంటారో రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత వీళ్ల గ్యాంగ్ లోని లక్ష్మి(పూజా గాంధీ) తాము ఎన్నుకున్న ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడుగుతుంది. ఆ ఇంటివాళ్లు తలుపు తెరిచి మంచి నీళ్లు ఇద్దామనుకునే లోగా..వీళ్ళ గ్యాంగ్ లోపలకి ప్రవేశించి..లోపల ఉన్న వాళ్లను చంపేసి దోచుకుని పోతూంటారు. అలా వీళ్లు దొంగతనాలు చేస్తూంటే... సిన్సియర్ పోలీస్ అధికారి చలపతి(రవిశంకర్)రంగంలోకి దిగుతాడు. చిన్న క్లుతో వీరి గుట్టు బయిటపెడతాడు. ఆ క్లూ ఏమిటి.. ఆ పోలీస్ అధికారి ఎంతో పకడ్బందిగా వేసేఈ గ్యాంగ్ ప్లాన్ లను ఎలా చిత్తు చేసాడు అనేది తెరపై చూడాల్సిందే.

  నిజకథను పత్రికల్లో చదివి..బెల్గాం జైలులో నరహంతకులను కలిసి, ఘటనలపైపరిశోధించి..యథా తథంగా సినిమా తీసామని చెప్పారు. అయితే కథలో అనుకున్నంతగా డ్రామా తేలేకపోయారు. గొంతు కోస్తే వచ్చే శబ్ధం వినిహత్యచేస్తాడొక డు..గర్భగుడిలో రేప్‌కి రెడీ...జ్వరం వచ్చిన బాలికనూ వదిలిపెట్టరు...గాడిద టెస్టికల్స్‌ లోంచి రక్తం తాగి పరిగెత్తే మృగాలు వారు..క్లూస్‌ టీమ్‌కి కూడా దొరకని ఎత్తుగడ ఈ దుర్మార్గులది. చివరికి తిరుమలేశునికే పంగనామం పెట్టి దొంగతనం చేశారు. 16సార్లు ఉరి తీయాలని తీర్పు వచ్చినా మార్పు లేని ఏకైక గ్యాంగ్‌ కథ ఇది.

  ఓ పోలీస్ అథికారి హత్యతో ప్రారంభమయ్యే ఈ చిత్రం ఫస్టాఫ్ మరీ టీవీ సీరియల్ లాగ సాగింది. ఈ గ్యాంగ్ హత్య చేయబోయే అమ్మాయి...కి పెళ్లి కావటం..ఆమె భర్తతో పాట...ఆ తర్వాత మొగుడు పెళ్లాలు హ్యాపీ,ఆమె గర్బవతి అవటం ఇలా సాగుతూ...చివరలో ఆమెను హత్యకు గురి చేస్తారు. కథ లో ఒక సీన్ తో రావాల్సిన ఈ ఎపిసోడ్... స్క్రీన్ టైమ్ వృధా చేయటం తప్ప సినిమాకు ఏ రకంగానూ ఉపయోగపడదు.

  దర్శకుడు దృష్టి మొత్తం హింసను గ్లోరిఫై చెయ్యటం మీదే ఉంది కానీ...కథలో మిగతా కోణాలు సృశించలేకపోయాడు. మామూలు మనుష్యులు అలా నరరూప రాక్షసులుగా ఎందుకు తరయారయ్యారు...అందుకు దారి తీసిన పరిస్ధితులు వంటివి కాస్త రీసెర్చ్ చేసి ఉంటే ఉపయోగకరంగా ఉండేది.

  పోనీ జరిగిన సంఘటనలు యధాతథంగా తెరకెక్కించాలనే ఆలోచన ఉన్నా డాక్యుమెంటరీ నేరషన్ ఎత్తుకుంటే బాగుండేది. లేదా రక్త చరిత్ర తరహాలో వాయిస్ ఓవర్ తో ...కథను నడిపించినా జస్టిఫై అయ్యేది..

  అయితే ఈ సినిమాకు దర్శకుడు నేరేషన్ కన్నా ఎక్కువ బలం ఇచ్చింది నటీనటుల ఫెరఫార్మన్సే అని చెప్పాలి. చాలా న్యాచురల్ గా నటించుకుంటూ పోయారు.

  టెక్నికల్ గా కెమెరా వర్క్ ఓకె అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు గతంలో చాలా సినిమాల్లో విన్నదే అన్నట్లుగా ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడు టేకింగ్ ప్లస్ కావాలి..కానీ రెండూ పూర్ గానే ఉన్నాయి.

  సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ ..పోలీస్ అధికారిగా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాడు. సాదా సీదాగా చేసుకుంటూ పోయారు.

  చాలా కాలం తర్వాత కనిపించిన వర్మ క్యాంప్ హీరోయిన్ ప్రియాంక కొఠారి,ఒళ్లు చేసి..అసలు గుర్తు పట్టలేమో అనిపించింది.

  English summary
  Dandupalyam is the infamous crime gang that spread terror in and around Bangalore by slitting the throats of women and the aged before raping and robbing them in late 90s. Director Srinivasa Raju has tried to bring their barbarous acts on-screen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X