Darling Review: డార్లింగ్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5
నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, రఘుబాబు, సంజయ్ స్వరూప్, బ్రహ్మానందం తదితరులు
దర్శకత్వం: అశ్విన్ రామ్
నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి
సినిమాటోగ్రఫి: నరేష్
ఎడిటర్: ప్రదీప్ E రాఘవ్
మ్యూజిక్: వివేక్ సాగర్
డైలాగ్స్: హేమంత్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
బ్యానర్: ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 19-07-2024

ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలో పనిచేసే రాఘవ (ప్రియదర్శి) బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించి.. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ వద్దకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. నందిని (అనన్య నాగళ్ల)తో పెళ్లిపీటల మీద మ్యారేజ్ ఎత్తిపోవడంతో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఆనంది (నభా నటేష్) కలిసి ఆత్మహత్య ప్రయత్నం ఆలోచనను మార్చి వేస్తుంది. అయితే అదే సమయంలోఆమెతో ప్రేమలో పడిన రాఘవ, ఆనందిని పెళ్లి చేసుకొంటాడు.

Darling Movie Review  in Telugu

నందినితో రాఘవ పెళ్లి ఎందుకు ఎత్తిపోయింది? రాఘవ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకొన్నాడు? అసలు పరిచయమే లేని ఆనందిని రాఘవ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకొన్నాడు? ఆనందిని నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఆనందికి ఉన్న మానసిక జబ్బు ఏంటి? దాని వల్ల రాఘవకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? ఆనందికి ఉన్న మానసిక సమస్యను దూరం చేసి ఆమె ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? పారిస్‌కు వెళ్లాలనే కోరికను ఎలా తీర్చుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే డార్లింగ్ సినిమా కథ.

డార్లింగ్ సినిమా కథ విషయానికి వస్తే.. అపరిచితుడు లాంటి ఇంటెన్స్ కథ. దర్శకుడు పరుశురామ్ ఆలోచన, పాయింట్ బాగుంది. కానీ తన విజన్‌ను తెరపైకి తీసుకు రావడంలో కొంత తడబాటుకు గురయ్యాడనే చెప్పాలి. అయితే స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నా కానీ.. నభ నటేష్, ప్రియదర్శి తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Darling Movie Review  in Telugu
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నరేష్ సినిమాటోగ్రఫి బాగుంది. మూవీని అందంగా, రిచ్‌గా చూపించారు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ కాగా.. పాటలు అంతగా వర్కవుట్ కాలేదు. ఇక నిర్మాతలు కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని నిరంజన్రెడ్డి, చైతన్య రెడ్డి సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. హనుమాన్ తరహాలోనే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బెస్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సినిమాను అందించారు.

డిఫరెంట్ కాన్సెప్ట్, టేకింగ్‌తో రూపొందించిన సినిమా డార్లింగ్. నభా నటేష్, ప్రియదర్శి తమ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు. సినిమా లెంగ్త్ ఎక్కువ కావడం, కొన్ని సీన్లు గందరగోళంగా ఉండటం వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. ప్రెష్, డిఫరెంట్ లవ్ స్టోరిని, సైకాలజికల్ థ్రిల్లర్ చూడాలనుకొంటే.. డార్లింగ్‌ను చూసేయొచ్చు. మీకు నచ్చేలా డార్లింగ్ ఉందా అేనేది థియేటరల్లో చెక్ చేసుకోండి.

Darling Movie Review  in Telugu

More from Filmibeat

Read more about: darling nabha natesh priyadarshi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X