Purusha Pretham Review: పోలీసులు పూడ్చిన శవం మిస్ అయితే? ఊహించని క్లైమాక్స్ తో 'పురుష ప్రేతం'!

రేటింగ్: 2..75/5

టైటిల్: పురుష ప్రేతం (మలయాళం)
నటీనటులు: అలేగ్జాండర్ ప్రశాంత్, దర్శన రాజేంద్రన్, జగదీష్, జింజ్ షాన్, మాల పార్వతి తదితరులు
సినిమాటోగ్రఫీ: క్రిషంద్
దర్శకత్వం: క్రిషంద్
కథ: మను తోడపుళ
స్క్రీన్ ప్లే: అజిత్ హరిదాస్
సంగీతం: అజ్మల్ హస్బుల్లా
సమర్పణ: జియో బేబీ
థియేటర్ విడుదల తేది: ఫిబ్రవరి 24, 2023
ఓటీటీ విడుదల తేది: మార్చి 24, 2023
ఓటీటీ వేదిక: సోనీ లివ్

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా హృదయం. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు సుపరిచితం అయింది ఇందులో హీరోయిన్ గా చేసిన దర్శన రాజేంద్రన్. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'పురుష ప్రేతం' (Purusha Pretham) (The Male Ghost) (తెలుగులో మగ శవం అని అర్థం).

ఇన్వెస్టిగేటివ్, సస్పెన్స్ డ్రామాతోపాటు కామెడీ జోనర్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి చిత్రంగా విజయం సాధించింది. థియేటర్లలో విడుదలైన సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

Darshana Rajendran Alexandar Prashanth Purusha Pretham Movie Review And Rating In Telugu

కథ: సెబాస్టియన్ (అలేగ్జాండర్ ప్రశాంత్) ఒక సాధారణ ఎస్సై. కానీ అతనికి పోలీసు డిపార్ట్ మెంట్ లో సూపర్ సెబాస్టియన్ అని పేరు. ఎందుకంటే మిగతా పోలీసుల్లా కాకుండా దేనికి భయపడకుండా యాక్షన్ అడ్వెంచర్స్ చేసే సూపర్ కాప్ గా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న అతని తల్లి సెబాస్టియన్ ను ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది.

ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ.. తల్లి చేతులో తిట్లు తినుకుంటూ ఉండే సెబాస్టియన్ పరిధిలోకి కాలువలో ఒక మగ శవం కొట్టుకు వస్తుంది. ఆ శవం తాలుకా బంధువుల కోసం ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆ శవం తన భర్తదేనని సూసన్న (దర్శన రాజేంద్రన్) పోలీసు స్టేషన్ లోకి అడుగుపెడుతుంది.

ఎలాంటి పరిస్థితి: అసలు ఈ సూసన్న ఎవరు? తాను చెప్పినట్లుగా కాలువలో కొట్టుకొచ్చిన శవం ఆమె భర్తదేనా? సూసన్న వల్ల ఎస్సై సెబాస్టియన్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అందుకు ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? కాలువలో కొట్టుకొచ్చిన మగ శవం ఎవరు అనే విషయాన్ని సెబస్టాయిన్ కనుక్కున్నాడా? అసలు సూసన్న భర్తకు ఏమైంది? నిజం తెలుసుకున్న సెబాస్టియన్ కు చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? అనే తదితర ఆసక్తికర విషయాల సమ్మేళనమే 'పురుష ప్రేతం'.

విశ్లేషణ: మలయాళం చిత్రాలు ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటాయన్నదానికి పురుష ప్రేతం' మూవీ కూడా ఒక ఉదాహరణ. తమ ఆలోచనలతో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు మలయాళీ దర్శకనిర్మాతలు. నిజానికి సినిమాల్లో హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండకపోయిన ఫిట్ గా చాలా అందంగా, హీరోయిజం కనిపించేలా ఉంటాడు. కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా పొట్ట, బట్టతో ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే సాధారణ ఎస్సైగా హీరో కనిపించే విధానం ఆకట్టుకుంటుంది. సినిమా టైటిల్ పడేంత వరకు అతనే హీరో అన్న విషయం ప్రేక్షకులకు అర్థం కానంతగా చూపించడం విశేషం.

Darshana Rajendran Alexandar Prashanth Purusha Pretham Movie Review And Rating In Telugu

ఆ పాయింట్ తీసుకుని: ఇక కథ విషయానికొస్తే.. సాధారణంగా కాలువల్లో, బ్రిడ్జీల కింద, పలు చోట్ల గుర్తు తెలియని శవాలను పోలీసులు కనుక్కుంటారు. ఆ శవాలకు సంబంధించిన బంధువులు, కుటుంబీకులు ఎవరైన వచ్చి ఆ శవాలను క్లేయిమ్ చేసుకుంటారా అని పోలీసులు ఎదురుచూస్తుంటారు. అలాగే మిస్సింగ్ కేసులను కూడా పరిశీలిస్తారు.

అయితే రోజు శవాల సంఖ్య పెరగడంతో హాస్పిటల్ మార్చురీలో కేటాయించే స్థలం సరిపోదు. ఈ క్రమంలో శవాలను సంబంధించినవారు ఎవరు రాకపోవడంతో కేసు డీటెల్స్ తో ఆ వాటిని ఒక స్మశానంలో పూడ్చి పెడతారు. కానీ ఇలాంటి సందర్భాల్లో వర్షాల కారణంగా అవి మిస్ ప్లేస్ అవుతాయి. ఈ పాయింట్ తీసుకుని ఈ సినిమాను ఒక ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందించారు.

నవ్వు తెప్పించడమే కాదు: ఇక ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కి ఎండ్ వరకు సస్పెన్స్ ను క్యారీ చేయడమే కాకుండా ఒక సరికొత్త పంథాలో కామెడీని జోడించారు. అది పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. ఇందులో హీరో, కమెడియన్ అంతా సూపర్ కాప్ సెబాస్టియనే. శవాలు కొట్టుకొస్తే తమ పరిధిలోకే వస్తాయా లేదా అని పోలీసులు చూసే విధానం నవ్వు తెప్పించడమే కాకుండా వాస్తవ సంఘటనలకు అద్దం పడుతుంది. తమ డ్యూటీస్ చేస్తూ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే క్రమంలో పోలీసులు చేసే తప్పులు వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాయో బాగా చూపించారు. తన భర్తదే శవమంటూ సూసన్ రావడంతో స్టోరీలో మరింత ఆసక్తి పంజుకుంటుంది.

Darshana Rajendran Alexandar Prashanth Purusha Pretham Movie Review And Rating In Telugu

హీరోయిజాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తే మాత్రం: సినిమా ఎలా అయితే స్టార్ట్ చేస్తారో.. అలాగే ఎండ్ చేయడం బాగుంటుంది. ఇక హీరో సూపర్ సెబాస్టియన్ క్లైమాక్స్ లో చూపించే పరిస్థితిని చూసి నవ్వకుండా ఉండలేం. కథను హీరోగా చేసి.. మిగతా నటీనటులతో కామెడీ, డ్రామా, సస్పెన్స్ సన్నివేశాలను బాగా రాసుకొన్నారు. అక్కడక్కడ సినిమాకు హారర్ టచ్ ఇవ్వడం కూడా ఆకట్టుకుంటుంది. అయితే ఇది సాధారణ కథలా చూపించారు క్రైమ్ చేసిన నిందితులను పట్టుకుని జైళ్లో వేసే హీరోయిజాన్ని ఎక్స్ పెక్ట్ చేసేవాళ్లకు మాత్రం క్లైమాక్స్ నిరాశపరుస్తుంది.

ఎవరెలా చేశారంటే: సూపర్ సెబాస్టియన్ గా అలేగ్జాండర్ ప్రశాంత్ నటన అద్భుతంగా ఉందనే చెప్పాలి. నటన, ఎక్స్ ప్రెషన్స్ అన్నీ సమపాళ్లల్లో చూపించి అదరగొట్టారు. దర్శన రాజేంద్రన్ కూడా తన నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. డైలాగ్స్ ఎక్కువగా లేకుండా కేవలం తన కళ్లతోనే హావాభావాలను పలికించి థ్రిల్ కు గురిచేశారు. మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. ఇక సినిమాకు ప్రధాన హైలెట్ బీజీఎమ్. అజ్మల్ హస్బుల్లా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పుడూ చూడనివిధంగా విభిన్నంగా ఆకట్టుకునేలా ఉంది. సస్పెన్స్, డ్రామాతోపాటు మంచి ఫన్ జెనరేట్ అయ్యేలా ఇచ్చారు.

Darshana Rajendran Alexandar Prashanth Purusha Pretham Movie Review And Rating In Telugu

ఫైనల్ గా చెప్పాలంటే: మిగతా సాంకేతిక విభాగం అంతా బాగుంది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అంతా పర్వాలేదనిపించింది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే రెగ్యులర్ సినిమాల్లోలాగా హీరో కమెడియన్ అయినప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం హీరోయిజం చూపించాలి, కేసు సాల్వ్ చేయాలని ఆశ పడేవారికి మాత్రం ఈ సినిమా కాస్తా నిరాశే మిగుల్చుతుంది. కానీ ఒక డిఫరెంట్ ఫన్ మూవీ చాడాలనుకునే వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. వీకెండ్ లో టైమ్ పాస్ కోసం కచ్చితంగా ట్రై చేయొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X