Das Ka Dhamki Review (దాస్ కా ధమ్కీ రివ్యూ) ‘డబుల్’ ధమాకా.. విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో!

Rating: 2.75/5

నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, అజయ్, రోహిణి, రజిత, రంగస్థలం మహేష్, పృథ్వీరాజ్, కాదంబరి కిరణ్ తదితరులు
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
సినిమాటోగ్రఫి: దినేష్ కే బాబు, జార్జ్ సి విలియమ్స్
ఎడిటింగ్: అన్వర్ అలీ
మ్యూజిక్: లియోన్ జేమ్స్
బ్యానర్: వాన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్్ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-03-22

దాస్ కా ధమ్కీ కథ ఏమిటంటే?

దాస్ కా ధమ్కీ కథ ఏమిటంటే?

అనాథ అయిన కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఫైవ్ స్టార్ హోటల్‌లో వెయిటర్. అనాధ శరణాలయంలో తనకు స్నేహితులైన ఆది, మహేష్ (హైపర్ ఆది, రంగస్థలం మహేష్)ను తల్లిదండ్రులుగా భావిస్తుంటాడు. పేదరికంతో బతకడంపై ఈ ముగ్గురు అసహ్యించుకొంటూ ఎప్పటికైనా సంపన్నులుగా బతకాలని కలలు కంటుంటారు. ఇలాంటి దరిద్రపు జీవితంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఓ ఫార్మసీ కంపెనీకి చెందిన సిద్దార్థ్ మల్హోత్రా (రావు రమేష్) వచ్చి.. తమ కంపెనీ అధినేత సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్)గా నటించమని కోరుతాడు.

దాస్ కా ధమ్కీ కథ ట్విస్టులు

దాస్ కా ధమ్కీ కథ ట్విస్టులు

సంజయ్ రుద్ర ఎవరు? సంజయ్ రుద్ర పాత్రలో కృష్ణదాస్‌ను నటించమని ఎందుకు కోరాడు? సంజయ్ రుద్ర పాత్రలోకి వెళ్లిన కృష్ణదాస్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కృష్ణదాస్ ప్రేమించిన కీర్తీ అలియాస్ డాలీ (నివేదా పేతురాజ్) ఎవరు? కీర్తితో కృష్ణదాస్ ప్రేమాయణం ఎలా సాగింది? సంజయ్ రుద్రకు డ్రగ్స్ బిజినెస్ మ్యాన్ (అజయ్) మధ్య ఉన్న వైరం ఏమిటి? 10 వేల కోట్ల కుంభకోణం వెనుక కథ ఏమిటి? సంజయ్ రుద్రగా కృష్ణదాస్ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే దాస్ కా ధమ్కీ సినిమా కథ.

దాస్ కా ధమ్కీ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

దాస్ కా ధమ్కీ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

రావు రమేష్‌ ఆవేదన వ్యక్తం చేసే ఓ ఎమోషనల్ పాయింట్‌తో దాస్ కా ధమ్కీ కథ ప్రారంభమైనప్పటీకి.. ఆ భావోద్వేగాన్ని పక్కన పెట్టేసి.. కేవలం తొలి భాగంలో వినోదానికే పెద్ద పీట వేశారు. కృష్ణదాస్‌తో ఆది, మహేష్ కామెడీ, కృష్ణదాస్ జీవితంలోకి కీర్తీ రావడం లాంటి సన్నివేశాలు చాలా రొటీన్‌గా సాగిపోతాయి. ఫస్టాఫ్ అంతా కృష్ణదాస్, కీర్తీ, ఆది, మహేష్ మీదే ట్రాక్ సాగడంతో రెగ్యులర్‌గా అనిపిస్తుంది. కానీ కృష్ణదాస్‌ను రావు రమేష్ కలిసిన తర్వాత కథలో చలనం మొదలవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే సన్నివేశం ఊహించినట్టే ఉంటుంది. కానీ ఫస్టాఫ్ ముగింపులో నావెల్టీ ఉండటం వలన సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

దాస్ కా ధమ్కీ సెకండాఫ్‌లో హైలెట్ష్

దాస్ కా ధమ్కీ సెకండాఫ్‌లో హైలెట్ష్

దాస్ కా ధమ్కీ సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే.. అనేక ట్విస్టులు, రకరకాల వేరియేషన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. కథలో చోటు చేసుకొనే సంఘటనలు, పాత్రల బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది. దానికి తోడు రెండు పాత్రల్లో విశ్వక్ సేన్ విజృంభించిన తీరు చాలా బాగుంటుంది. నటనపరంగా విశ్వక్ సేన్ మరో రేంజ్‌ను చూపించాడు. సినిమా సినిమాకు నటుడిగా రాటుదేలినట్టు కనిపిస్తాడు. సెకండాఫ్‌ను బ్యాలెన్స్‌గానే కాకుండా కథను నడిపించిన తీరు విశ్వక్ సేన్ దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకొన్నాడు. ఎండ్ టైటిల్ తర్వాత ఓ ఎపిసోడ్‌తో ఇచ్చిన ఇచ్చిన ధమ్కీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

విశ్వక్ సేన్ అన్నీ తానై..

విశ్వక్ సేన్ అన్నీ తానై..

నటీనటులు విషయానికి వస్తే.. కృష్ణదాస్‌గా, అలాగే సంజయ్ రుద్ర పాత్రలో విశ్వక్ సేన్ మంచి వేరియేషన్స్ చూపించడమే కాకుండా.. యాక్టర్‌గా మెచ్యురిటీని చూపించాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తెర ముందు, తెర వెనుక తిపాత్రాభినయం చేయడం సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి. యాక్టర్‌గా విశ్వక్ సేన్‌లో మంచి ఫైర్ కనిపించింది.. అలాగే డైరెక్టర్‌గా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా సీన్స్, కథను హ్యాండిల్ చేశాడనే చెప్పాలి. పాత కథనే కొత్తగా చెప్పిన తీరును అభినందించాల్సిందే.

గ్లామర్ డాల్‌గా నివేదా పేతురాజ్

గ్లామర్ డాల్‌గా నివేదా పేతురాజ్


నివేదా పేతురాజ్ మిగితా నటీనటుల విషయానికి వస్తే.. గతంలో చేసిన పాత్రల కంటే నివేదా కొత్తగా కనిపించింది. హీరోయిన్‌ ఓరియెంటెడ్ పాత్రల్లో అలరించిన నివేదా ఈసారి గ్లామర్ డోస్ గుప్పించింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా మంచి వేరియేషన్ ఉన్న పాత్రలో ఒదిగిపోయిందని చెప్పవచ్చు. రావు రమేష్ ఎప్పటిలానే తన మార్క్ చూపించాడు. ఆది, మహేష్ కామెడీని పండించి నవ్వించారు. అజయ్ పాత్ర చిన్నదైనా ఒకే అనిపించారు. ఎమోషనల్ పాత్రలో కనిపించిన రోహిణి గుర్తుండిపోతారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు ఒకే అనిపించారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. దినేష్ కే బాబు, జార్జ్ సి విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ఫైట్స్ కంపోజిషన్ చాలా బాగున్నది. పాటల చిత్రీకరణ, యాక్షన్ సీన్స్ డిజైన్ బాగున్నాయి. అన్వర్ అలీ ఎడిటింగ్, లియోన్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కరాటే రాజు నిర్మాతగా ఈ సినిమాను రూపొందించిన తీరు బాగుంది. సినిమాపై వారికి ఉన్న అభిరుచి సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించింది.

ఫైనల్‌గా దాస్ కా ధమ్కీ గురించి

ఫైనల్‌గా దాస్ కా ధమ్కీ గురించి


లవ్, ఎమోషనల్, యాక్షన్, కామెడీ అంశాలతో మంచి ట్విస్టులతో సాగే సినిమా దాస్ కా ధమ్కీ. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ విశ్వక్ సేన్. కామెడీని పండించడమే కాకుండా నెగిటివ్ షేడ్‌లో విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌ అని చెప్పవచ్చు. పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ రొటీన్, రెగ్యులర్‌గా సరదాగా సాగిపోతుంది. సెకండాప్‌లో ఫెర్ఫార్మెన్స్, ఎమోషన్స్ పీక్స్‌లో కనిపిస్తాయి. సినిమాలో డైలాగ్స్, పాటలు ఆకట్టుకొనేలా ఉంటాయి. విశ్వక్ సేన్ అభిమానులకు మంచి పండుగలా ఉంటుంది. కామెడీతో కూడిన కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారు.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. నిరాశపరచదని గ్యారెంటీగా చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X