Dasara Review నాని, కీర్తీ సురేష్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్.. శ్రీకాంత్ ఓదెల ఎలా డీల్ చేశారంటే?

Rating:
3.0/5
Star Cast: Nani, Keerthy Suresh, Dinesh Shetty, Samudrakhani, Chako
Director: Srikanth Odela

నటీనటులు: నాని, కీర్తీ సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయికుమార్, జరీనా వాహెబ్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
రిలీజ్ డేట్: 2023-03-30

దసరా కథేమిటంటే?

దసరా కథేమిటంటే?

మద్యం మత్తులో ఊగి తూగే కరీంనగర్ జిల్లా వీర్లపల్లిలో ధరణి (నాని), సూర్య (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) క్లోజ్ ఫ్రెండ్స్. తన ప్రాణం కంటే ఎక్కువగా సూర్యను ప్రేమించే ధరణి.. స్నేహం కోసం వెన్నెలపై ఉన్న ప్రేమను చంపుకొని.. స్నేహితుడి కోసం త్యాగం చేస్తాడు. వీర్లపల్లిలో పంచాయితీ సర్పంచ్ చిన్న నంబి (చాకో), సర్పంచ్ పదవికి పోటీ చేసి ఊడిన రాజన్న (సాయికుమార్) మధ్య వైరం ఉంటుంది. ఊరి రాజకీయాలు వల్ల ధరణి, సూర్యపై ఎటాక్ జరుగుతుంది.

దసరాలో ట్విస్టులు

దసరాలో ట్విస్టులు

సూర్యను ఇష్టపడే వెన్నెలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సూర్య కోసం ధరణి ఎలాంటి రిస్క్ తీసుకొన్నాడు? ధరణితోపాటు స్నేహితులు మద్యానికి ఎందుకు అలవాటు పడ్డారు. రాజకీయాల వల్ల గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. గ్రామంలో సిల్క్ బార్ కోసం నంబి, రాజన్న మధ్య ఎలాంటి వైరం కొనసాగింది.

సిల్క్ బార్ కోసం ధరణి చేసిన ఛాలెంజ్ ఏమిటి? సూర్యను ప్రేమించిన వెన్నెలకు ఎలాంటి సమస్య ఎదురైంది. ధరణి, సూర్యపై ఎటాక్ జరిగిన తర్వాత వెన్నెల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. వెన్నెల జరిగిన అన్యాయానికి ధరణి ఎలాంటి పరిష్కారం చూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే దసరా సినిమా కథ.

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోల్చితే దసరా సినిమా స్లో నేరేషన్, డల్ నోట్‌తోనే మొదలవుతుంది. నాని ఎంట్రీ తర్వాత కథలో చలనం వస్తుంది. ఫస్టాఫ్‌లో నాని, దీక్షిత్ శెట్టి కాంబినేషన్ సీన్లు, కీర్తి సురేష్ నిజాయితీతో కూడిన యాక్టింగ్ సినిమాకు ఫీల్‌గుడ్‌గా మారుస్తాయి. క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ తర్వాత కథ మరింత ఊపందుకొంటుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌గా పీక్స్ అనిపిస్తుంది. చాకో క్యారెక్టర్‌ను ఫస్టాఫ్ నుంచి ఓ రేంజ్‌లో హైప్ ఇచ్చి ఉంటే.. మూవీ ఇంకాస్త ఎంట్రెస్టింగ్ ఉండేదనిపిస్తుంది.

సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా

సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా

సెకండాఫ్ విషయానికి వస్తే.. దసరాకు స్లో నేరేషన్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. దర్శకుడి అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపించినా.. డైరెక్టర్ హానెస్ట్ మేకింగ్ బ్యాలెన్స్ చేసిందని చెప్పవచ్చు. క్లైమాక్స్ కావాలనే సాగదీసినట్టు అనిపిస్తుంది. రావణాసుర వధ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలిచిందనిపిస్తుంది. స్యూర్యకు ప్రేమను ఇవ్వకుండా.. బాధను ఇస్తామా? లాంటి డైలాగ్స్, కీర్తీ, నాని మధ్య చెరువు గట్టు వద్ద సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సిల్క్ బార్ దహనానికి ముందు మహిళలతో నాని ఎపిసోడ్ ఆలోచింపజేస్తుంది. దర్శకుడు శ్రీకాంత్.. సెకండాఫ్‌లో మరింత ఎఫెక్టివ్‌గా డీల్ చేయాల్సి ఉందనిపిస్తుంది.

నాని, కీర్తి సురేష్ కెరీర్ బెస్ట్

నాని, కీర్తి సురేష్ కెరీర్ బెస్ట్

దసరా మూవీలో నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. నాని, కీర్తీ సురేష్ కోసమే కథ, పాత్రలు రాశారా అనే రేంజ్‌లో అనిపిస్తుంది. ఇప్పటి వరకు నాని చేసిన పాత్రలు ఒక ఎత్తు.. దసరాలో ధరణి పాత్రతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ధరణి పాత్రలో నాని వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఇక కీర్తీ సురేష్ తెలంగాణ యువతి పాత్రలో ఒదిగిపోయింది. గ్రామీణ యువతిలో కనిపించే బాడీ లాంగ్వేజ్‌ను ఒడిసిపట్టుకొని తెర మీద అద్బుతంగా హావభావాలను ప్రదర్శించింది. నాని, కీర్తి సురేష్ కెరీర్ ది బెస్ట్ అన చెప్పవచ్చు.

మిగితా క్యారెక్టర్ల గురించి

మిగితా క్యారెక్టర్ల గురించి

దసరాలో మిగితా పాత్రల విషయానికి వస్తే.. చాకో పాత్ర ఇంకా బెటర్‌గా రాయాల్సిందనిపిస్తుంది. విలనిజం పెద్దగా పండకపోవడం వల్ల చాకో పాత్ర ఎలివేషన్ సరిగా జరగలేదనిపిస్తుంది. సాయికుమార్ కొన్ని సీన్లలో తన మార్క్ చూపించారు. ఝాన్సీ, జరీనా వాహెబ్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు రాణించారని చెప్పవచ్చు.

 టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఫైట్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి విజువల్‌గా ఎక్ట్రార్డనరీగా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో కొత్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సిందనిపిస్తుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి అనుసరించిన నిర్మాణ విలువలు హై రేంజ్‌లో ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

తెలంగాణ నేటివిటితో ప్రేమ, ప్రతీకారం, ఎమోషన్స్ దట్టించిన చిత్రం దసరా. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించారు. ప్రతీ ఫ్రేమ్‌ను చక్కగా ఒద్దికగా తెరకెక్కించారు. తెలంగాణ వాస్తవ పరిస్థితులను సజీవంగా చూపించే ప్రయత్నం చేశారు. కీర్తీ సురేష్ మరోసారి మహానటిని మించిన ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించింది.

ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అనే విధంగా నాని తన పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారు. అయితే స్క్రిప్టు విషయానికి వస్తే చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా ఉంది. కానీ దర్శకుడు కథను నిజాయితీగా చెప్పిన విధానం బాగుంది. కథ స్వభావ రీత్యా ఇంకా ఎమోషన్స్ పండి ఉంటే దసరా మరింత బెటర్‌గా ఉండేది. నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, చాకో ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కొత్తదనం ఆశించే వారికి, నాని, కీర్తీ సురేష్ అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
నాని, కీర్తీ సురేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్
శ్రీకాంత్ టేకింగ్, రైటింగ్
సినిమాటోగ్రఫి
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ సాగదీసినట్టు
ఫ్లాట్ అండ్ స్లో నేరేషన్
ఎమోషన్స్ పూర్తిస్థాయిలో పండకపోవడం
క్లైమాక్స్ ఉహించే విధంగా ఉండటం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X