Dayaa Web Series Review టేకింగ్‌తో అదరగొట్టిన పవన్ సాదినేని.. జేడీ చక్రవర్తి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
Rating: 3/5
నటీనటులు: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీసాన్, విష్ణు ప్రియ, బబ్లూ పృథ్వీరాజ్, కమల్ కామరాజు, గాయత్రి గుప్తా, జోష్ రవి తదితరులు
దర్శకత్వం: పవన్ సాదినేని
నిర్మాతలు: శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని
మ్యూజిక్: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: వివేక్ కాలేపు
ఎడిటర్: విప్లవ్ నైషద్యం
రిలీజ్ డేట్: 2023-08-04
దయా అలియాస్ దయాకర్ ( జేడీ చక్రవర్తి) చేపలను రవాణా చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. కుటుంబ పోషణ కోసం డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. గర్బవతి అయిన దయా భార్య (ఇషా రెబ్బా) ఏ క్షణంలోనైనా ప్రసవించేందుకు సిద్దంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సరకు రవాణా చేయడానికి పక్క ఊరికి వెళ్తాడు. ఆ సమయంలో తన వ్యాన్‌లో శవం ఉంటుంది. దాంతో తన స్నేహితుడు ప్రభా (జోష్ రవి)కి చెప్పి సలహా తీసుకొంటాడు. అప్పటికే పీకల్లోతు సమస్యల్లో ఉన్న దయాకు మరో శవం లభిస్తుంది? చివరకు అందులో ఒక శవం ప్రముఖ జర్నలిస్టు కవిత (రమ్య నంబేసాన్) కావడంతో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అవుతుంది.
దయా నడిపే వ్యాన్‌లోకి రెండు శవాలు ఎలా వచ్చాయి? ఆ రెండు శవాలను ఎందుకు తారుమారు చేశారు? తారుమారు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జర్నలిస్టు కవితను ఎవరు హత్య చేశాడు? ఈ కథలో రాజకీయ నేత (బబ్లూ పృథ్వీరాజ్) పాత్ర ఏమిటి? దయా ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అనే ప్రశ్నలకు సమాధానమే దయా వెబ్ సిరీస్ కథ.

దయా అనే వ్యాన్ డ్రైవర్ జీవితాన్ని అతలాకుతలం చేసిన మర్డర్ మిస్టరీ కథ ఆసక్తికరంగా సాగుతుంది. పాత్రల పరిచయాలకు పెద్దగా సమయం తీసుకోకుండా స్టోరిని ట్రాక్ ఎక్కించిన దర్శకుడు పవన్ సాదినేని ట్విస్టులు, మలుపులతో పరుగులు పెట్టించాడు. ఈషా రెబ్బా క్యారెక్టర్‌ను ఎమోషనల్‌గా డిజైన్ చేశారు. జర్నలిస్టు కవిత మిస్సింగ్ సంఘటనతో కథలో వేగం పెరుగుతుంది.

జర్నలిస్టు కవిత మర్డర్ వెనుక హస్తం ఎవరిదనే కోణంలో కథను నడిపించిన విధానం పవన్ సాదినేని దర్శకత్వం ప్రతిభకు అద్దం పట్టింది. కథలో భావోద్వేగ అంశాలను జొప్పించిన తీరు బాగుంది. జోష్ రవి, రమ్య, ఇషా, పృథ్వీరాజ్ క్యారెక్టర్లను బాగా డిజైన్ చేశారు. సన్నివేశాలను బలంగా రాసుకోవడం ఈ వెబ్ సిరీస్‌కు బలంగా మారిందని చెప్పవచ్చు.
దయా క్యారెక్టర్‌ను ఓన్ చేసుకోవడమే కాకుండా పాత్రలో ఒదిగిపోయి జేడీ చక్రవర్తి అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్లలోను, యాక్షన్ సీన్లలో సహజంగా నటించాడు. జోష్ రవితో సీన్లలో గానీ, విలన్ మరణించిన సీన్లలో గానీ ఇంతకు ముందు ఎప్పుడూ చూపని మెచ్యురిటినీ చూపించాడు. ఇషా రెబ్బా, జోష్ రవి, రమ్య, పృథ్వీరాజ్, గాయత్రి గుప్తా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనీతీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ మంచి అనుభూతిని కలిగిస్తాయి. కథ, పాత్రల మూడ్‌ను ఎలివేట్ చేయడంలో వివేక్ కాలేపు సక్సెస్ అయ్యాడు. రిచ్ కంటెంట్‌తో సీన్లను ఎమోషనల్‌గా మార్చారు. శ్రవన్ భరద్వాజ్ రీరికార్డింగ్ బాగుంది. ఎడిటర్ విప్లవ్ నైషద్యం కథను ఫిట్‌గా ఎడిట్ చేశారు. నిర్మాతలు శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

మర్డర్ మిస్టరీ, ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో గ్రిప్పింగ్‌గా సాగే వెబ్ సిరీస్ దయా. కానీ ఆరంభంలో కొన్ని ఎపిసోడ్స్ సాగదీసినట్టు అనిపిస్తుంది. కాకపోతే కథకు కావాల్సిన ఎన్విరాన్‌మెంట్, మూడ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం తీసుకోవడం వల్ల అలాంటి ఫీల్ కలుగుతుంది. డెడ్ బాడీస్ కథలోకి వచ్చిన తర్వాత కథ ఊపందుకొంటుంది. క్రైమ్, మర్డర్ మిస్టరీ చూసే వారికి మంచి అనుభూతిని అందిస్తుంది. డీస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ స్ట్రీమింగ్ అవుతున్నది. వీలైనంత సమయం కేటాయించి.. ఒకే స్ట్రెచ్‌లో చూస్తే మంచి ఫీల్ కలిగిస్తుంది.


Click it and Unblock the Notifications











