De De Pyaar De 2 Twitter Review: దే దే ప్యార్ దే 2 ట్విట్టర్ రివ్యూ
టీ సిరీస్ ఫిల్మ్స్, లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృషాణ్ కుమార్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించిన చిత్రం దే దే ప్యార్ దే 2. అన్షుల్ శర్మ దర్శకత్వం వహించారు. దే దే ప్యార్ దే 2 చిత్రంలో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. మాధవన్, జావెద్ జాఫ్రీ, మీజాన్ జాఫ్రీ, గౌతమి కపూర్, ఇషిత దత్తా, సంజీవ్ సేథ్, సుహాసినీ ములే, గ్రేసి గోస్వామి తదితరులు కీలకపాత్రలు పోషించారు. లవ్ రంజన్ కథ అందించగా.. సుధీర్ కే చౌధురి సినిమాటోగ్రాఫర్‌గా, చేతన్ ఎం సోలంకి ఎడిటర్‌గా వ్యవహరించారు. యోయో హనీ సింగ్, జానీ, ఆదిత్య దేవ్, పాయల్ దేవ్, అవ్వీ స్రా, సాగర్ భాటియాలు స్వరాలు సమకూర్చగా... హితేష్ సోనిక్ నేపథ్య సంగీతం అందించారు.
హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో దే దే ప్యార్ దే 2 చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

దేదే ప్యార్ దే కంటే దే దే ప్యార్ దే 2 బాగుంది. స్టోరీ జెన్యూన్‌గా ఉంది, పరిస్ధితులకు తగినట్లుగా వినోదాన్ని అందించారు. మాధవన్‌తో అజయ్ దేవగణ్ సీన్లు ఫన్నీగా ఉన్నాయి. అలాగే స్క్రీన్ వైఫ్ (గౌతమి కపూర్)తో మాధవన్ కామెడీ కడుపుబ్బా నవ్వించింది. ఆయేషాగా రకుల్ ప్రీత్ సింగ్ బలమైన పాత్ర పోషించారు. మిజాన్ జాఫ్రి నటన బాగుంది. ఓవరాల్‌గా ఈ సినిమాకు క్యాస్టింగ్ బాగా కుదిరింది, లవ్ రంజన్ ట్రేడ్ మార్క్ పంచ్ లైన్స్, దర్శకత్వం, సంగీతం, కథ చెప్పడం అంతా బాగుందని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
దే దే ప్యార్ దే 2 అనేది రొమాన్స్, గందరగోళం, కుటుంబంలోని గొడవల సరదా మిశ్రమం. నిజమైన భావోద్వేగాలలోకి తొంగిచూస్తూ మిమ్మల్ని ఈ చిత్రం నవ్విస్తుంది. వయసు తేడా తరహా ప్రేమకథ.. ఇంత సరదాగా, గజిబిజిగా, చూడతగ్గదిగా ఎప్పుడూ కనిపించలేదు. అజయ్ దేవగణ్ ఎప్పటిలాగే పరిపూర్ణంగా నటించాడు. మాధవన్ హాస్యం, తీవ్ర భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తూ సహజంగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ మనోహరంగా ఉంది, ప్రతి సన్నివేశానికి ఆమె ఛార్మింగ్ తీసుకొచ్చారు అని ఓ యూజర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.
దే దే ప్యార్ దే 2 నిజంగా అజయ్ దేవగణ్‌దే. ఆయన ఉనికి మాత్రమే సినిమాను శాసిస్తోంది. అజయ్‌కి ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తల్లిదండ్రులుగా ఉన్న వారికి మధ్య జరిగే సంభాషణ హాస్యాస్పదంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి.. వాటిని మళ్లీ మళ్లీ చూడటం విలువైనదే అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
దే దే ప్యార్ దే 2 రివ్యూ: పూర్తిగా ఫన్ నిండిన ఎంటర్‌టైనర్. లవ్ రంజన్ మళ్లీ రిపీట్ చేశాడు. సూపర్ ఎంటర్‌టైనింగ్ స్క్రీన్ ప్లేతో కూడిన సీక్వెల్‌ని అందించాడు. దే దే ప్యార్ దే 2లో నవ్వు తెప్పించే అల్లరితో పాటు భావోద్వేగ స్పర్శను కూడా కలిగి ఉంది.
దే దే ప్యార్ దే సీక్వెల్ నుంచి మీరు ఆశించే ప్రతిదీ ఈ చిత్రంలో ఉంది. సంబంధాలు, ప్రేమ, కుటుంబం, జీవితం యొక్క పరిణితి. ఫస్ట్ పార్ట్ ముగిసిన చోట నుంచి ప్రారంభమయ్యే సంభాషణలు, కథాంశంతో సజావుగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని హాస్య క్షణాలతో కొంచెం సీరియస్ జోన్‌లోకి వెళ్తుంది. చివరి 15 నిమిషాలు ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ పీక్స్‌కి చేరింది.
నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అజయ్ దేవగణ్ ఎప్పటిలాగే బాగా చేశారు. ఆర్ మాధవన్ అద్భుతంగా పవర్‌ఫుల్ యాక్టింగ్ అందించాడు. రకుల్ ప్రీత్ సింగ్ కామిక్, ఎమోషనల్ సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. మీజాన్ జాఫ్రీ బలమైన అరంగేట్రం చేశాడు. జావేద్ జాఫ్రీ, ఇతరులు చక్కని సహకారం అందించారు. లవ్ రంజన్ ఎప్పుడూ సాలిడ్ స్క్రిప్ట్, డైలాగ్స్, కాన్సెప్ట్‌తో మనల్ని ఎలా ఎంటర్‌టైన్ చేస్తాడోనని ఆలోచించేవాడిని. ఎప్పటిలాగే ఈసారి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఓవరాల్‌గా దే దే ప్యార్ దే 2 సినిమాను ఖచ్చితంగా చూడాల్సిందే. బ్యాంగర్ ఎంటర్‌టైనర్.


Click it and Unblock the Notifications











