Dead Pixels Review గేమింగ్‌తో ట్రాయంగిల్ లవ్ స్టోరి.. నిహారిక కొణిదెల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: నిహారిక కొణిదెల, అక్షయ్ లగుసాని, సాయి రోనక్, హర్ష చెముడు, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు
దర్శకత్వం: ఆదిత్య మందల
నిర్మాతలు: సమీర్ గోగటే, రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బోర
మ్యూజిక్ ఢైరెక్టర్: సిద్దార్థ సదాశివుని
సినిమాటోగ్రఫి: ఫాహద్ అబ్దుల్ మజీద్
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-05-19

గాయత్రి (నిహారిక కొణిదెల), భార్గవ్ (అక్షయ్ లగుసాని) ఐశ్వర్య (భావన సాగి), ఆనంద్ (హర్ష చెముడు) ఆన్‌లైన్ గేమింగ్ డెవలపర్స్. గేమ్ డెవలప్‌మెంట్ సమయంలో భార్గవ్‌ను చూసి ఇష్టపడుతుంది. తన ఆఫీస్‌లో చేరిన రోషన్ (సాయి రోనక్)ను చూసి గాయత్రి ఆకర్షణకు లోనవుతుంది. హెడ్‌లో ఒకరిని, బెడ్‌లో మరొకరితో ఉంటానని చెప్పిన గాయత్రి తన రెండు పడవల ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

గాయత్రి, భార్గవ్ మధ్య ఎలాంటి రిలేషన్ చోటు చేసుకొన్నది? రోషన్ చూసిన తర్వాత గాయత్రి ఎలా తన మనసును మార్చుకొనే ప్రయత్నం చేసింది. గాయత్రి ప్రేమ విషయంలో స్నేహితురాలు ఐశ్వర్య ఎలాంటి సలహాలు ఇచ్చింది? గేమ్ డెవలప్‌మెంట్‌ సమయంలో ఆనంద్ కాపురంలో ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి? చివరకు గాయత్రి, భార్గవ్, ఐశ్వర్య తమ గేమ్ పూర్తి చేయడంలో సక్సెస్ అయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే Dead Pixels (డెడ్ పిక్సెల్స్) వెబ్ సిరీస్ కథ.

 Dead Pixels Review

గేమింగ్ డెవలపర్స్ ఆఫీస్‌లో పనిచేసే ఐదుగురు యువతీ, యువకుల జీవితాల్లో చిన్న చిన్న కోరికలు, ఆధునిక పోకడల అంశాలతో కథ సాగుతుంది. ప్రతీ క్యారెక్టర్‌లోను నేటి తరం యువత అలవాట్లు, అభిరుచులు, జీవన విధానం కళ్లకుకట్టినట్టు చూపే ప్రయత్నం చేశారు. అయితే కథ సాగదీసినట్టు ఉండటం వల్ల చివర వరకు ఏం జరుగుతుందనే విషయం అర్థం కాదు. అయితే ఒకరమైన క్యూరియాసిటిని రేకెత్తించడంలో దర్శకుడు ఆదిత్య మందల సక్సెస్ అయ్యారు. భార్గవ్ తన తండ్రి (రాజీవ్ కనకాల)తో సన్నివేశంలో ఎమోషన్స్ బాగా పండాయి.

గేమ్ ఆధారంగా యువతీ, యువకుల ఎమోషన్స్‌తో కలిపి కథను నడిపించిన విధానం బాగుంది. కనిపించి వినిపించకుండా అడల్ట్ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. Dead Pixels (డెడ్ పిక్సెల్స్) పిల్లలకు కూడా నచ్చే విధంగా తెరకెక్కించారు. చివరి ఎపిసోడ్‌లో ఆనంద్ పాత్రతో కొంత సెంటిమెంట్‌ను కథకు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం ఆకట్టుకొన్నది. ఇక సెకండ్ సిరీస్‌ కూడా ఉంటుందని హింట్ ఇవ్వడంతో అసలు కథ అప్పుడే మొదలు పెడుతారా అనే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది.

 Dead Pixels Review

గాయత్రి పాత్రలో ఆధునిక పోకడలు, ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న పాత్రలో నిహారిక కొణిదెల ఒదిగిపోవడం కాకుండా సహజ సిద్దంగా నటించిందనిపిస్తుంది. గాయత్రి పాత్ర ద్వారా కథను ముందుకు తీసుకొనే బాధ్యతను నిహారిక కొణిదెల పూర్తిగా నెరవేర్చింది. భార్గవ్ పాత్ర అక్షయ్, రోషన్ పాత్రలో సాయి రోనక్, ఆనంద్‌గా హర్ష, ఐశ్వర్యగా భావన తమ పాత్రల పరిథి మేరకు ఒకట్టుకొన్నారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. గేమింగ్ పార్ట్‌ను, కథను బ్లెండ్ చేయడం కష్టమైన పనే. కానీ ఎడిటర్ సృజన కథను, యానిమేషన్ పార్ట్‌ను కలిపిన విధానం బాగుంది. ఎడిటర్‌గా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించింది. సిద్దార్థ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకొనేలా ఉంది. సినిమాటోగ్రఫి విషయానికి వస్తే ఫహద్అబ్దుల్ ఉపయోగించిన కలర్ ప్యాలెట్ బాగుంది. తమడా మీడియా ఇటీవల కాలంలో నిర్మించిన అహనా పెళ్లంట వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ కోసం తమడా మీడియా పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్‌కు కూడా యూత్ నుంచి మంచి స్పందన రావడం విశేషంగా మారింది.

Dead Pixels

Dead Pixels (డెడ్ పిక్సెల్స్) వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన ఎంటర్‌టైనర్. బలంగా కథను రాసుకొని, సన్నివేశాలను పక్కాగా రాసుకొని ఉంటే.. ఎమోషన్స్ బలంగా పండేవనే ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ సీజన్‌లోనైనా కథ, కథనాలు, సన్నివేశాల్లో ఎమోషన్స్‌ను బలంగా దట్టించ గలిగితే.. ఇంకా బెటర్ ఫలితం కనిపించడానికి అవకాశం ఉంది. డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నందున తీరిక వేళ్లల్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X