Deadpool & Wolverine Review: డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ మూవీ రివ్యూ.. మార్వెల్‌కు కోడికత్తికి లింకేమిటి బాసు!
డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ (Deadpool & Wolverine)
నటీనటులు: ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్, ఇమ్రా కారిన్, మోరెనా బాక్కారిన్, రాబ్ డిలేనీ, మ్యాథ్ూ మెక్‌ఫాడైన్ తదితరులు
దర్శకత్వం: షాన్ లెవీ
రచన: ర్యాన్ రేనాల్డ్స్, రెట్ రీస్, పాల్ వెర్నిక్, జెబ్ వెల్స్
నిర్మాత: కెవినీ ఫీజ్, లారెన్ షూలర్ డానర్, ర్యాన్ రెనాల్డ్స్, షాన్ లెవీ
సినిమాటోగ్రఫి: జార్జ్ రిచర్డ్
ఎడిటింగ్: డీన్ జిమ్మర్‌మన్
మ్యూజిక్ం రాబ్ సిమోన్‌సెన్
బ్యానర్: మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 ల్యాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2024-07-26
వేడ్ విల్సన్ () టైమ్ ట్రావెల్ డివైజ్ కేబుల్ ద్వారా ఎర్త్ 10005 నుంచి ఎర్త్ 616 కు వెళ్లి హ్యాపీ హోగన్‌ను కలిసి అవెంజర్స్‌తో కలువమని రిక్వెస్ట్ చేస్తాడు గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ డ్రస్‌ను తీసేసి కారు సేల్స్‌మెన్‌గా చేరుతాడు. అలా లైఫ్ లీడ్ చేస్తుంటే.. తన బర్త్ డే రోజున వేడ్‌ను టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు అపహరించి ఎర్త్ 616 జాయిన్ అవ్వమంటారు. అయితే పారాడాక్స్ నుంచి టెమ్ ప్యాడ్ దొంగలించి మల్టీవెర్స్‌కు వెళ్లి లోగన్ వేరియెంట్‌ను సేవ్ చేయాలని ప్రయత్నిస్తాడు.

లోగన్‌తో కలిసి వేడ్ ఏం చేశాడు? మల్టీవెర్స్‌లో ఎలాంటి సాహషాలు చేశారు. పారాడాక్స్‌ను ఎలా ఎదురించారు. కాసాండ్రా ఎత్తులను ఎలా చిత్తు చేశారు? కార్ సెల్స్‌మెన్ పీటర్ విజ్‌డమ్ ఎలా వినోదాన్ని పండించాడు. టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్‌గా ర్యాన్ రెనాల్డ్స్ తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో.. అలాగే పూర్తిగా వినోదాన్ని పండించాడు. లోగన్ అలియాస్ వాల్వెరైన్‌తో కలిసి అద్బుతంగా సీన్లను పండించాడు. యాక్షన్, ఫన్, కామెడీ అనే తేడా లేకుండా తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు రఫ్ ఆడించారు. కసండ్రాగా నటించిన ఎమ్మా కోరిన్ పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా యాక్షన్ మోడ్‌లో వెళ్లుంది.

సెకండాఫ్‌లో ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషనల్ సీన్లు కూడా బాగానే పండాయి. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్.. సెకండాఫ్‌లో కూడా ఉంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు కొంత చప్పగా అనిపిస్తుంది. థోర్: లవ్ అండ్ థండర్, ది మార్వెల్స్, ఎటర్నల్స్ కంటే డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఆధ్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగడం పాజిటివ్‌గా మారింది.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. పెద్దగా గ్రాఫిక్ వర్క్ మెస్మరైజ్ చేయదు.. కానీ కెమెరా వర్క్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకొనేలా ఉంటుంది. డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా తెలుగు వెర్షన్ మాత్రం డైలాగ్స్‌తో కడుపుబ్బ నవ్వించారు. పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్‌తో కేక పెట్టించారు. ఇక హాలీవుడ్ సినిమాను పూర్తిగా తెలుగు నేటివిటికి కనెక్ట్ చేసి.. కోడికత్తి లాంటి సీన్లతో తెలుగు ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకొన్నారనే చెప్పాలి. కోడి కత్తి సీన్లు వచ్చినప్పుడల్లా థియేటర్ గగ్గోలు పెట్టించేలా చేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా మల్టీ వెర్స్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన యాక్షన్, ఫన్ డ్రామా. వినోదంతోపాటు భావోద్వేగానికి గురిచేసే సీన్లు ఉన్నాయి. తెలుగు వెర్షన్ చూస్తే మాత్రం పూర్తి పైసా వసూల్. ఓ నిమిషం కాస్తా అటు ఇటు చూసినా.. మంచి పంచ్ డైలాగ్స్‌ను మిస్ అవ్వడం ఖాయం. కాబట్టి.. ఫోన్లు పక్కన పెట్టి.. ఫన్‌ను ఆస్వాదించండి.. మార్వెల్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి అనుభూతిని కూడా పంచుతుంది.


Click it and Unblock the Notifications











