twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Dear Comrade Movie Review | Vijay Devarakonda | Rashmika Mandanna || Filmibeat Telugu

    Rating:
    3.0/5
    Star Cast: విజయ్ దేవరకొండ, రష్మిక, శృతి రామచంద్రన్, భరత్ కమ్మ
    Director: భరత్ కమ్మ

    అర్జున్ రెడ్డి తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ యాటిట్యూడ్‌తో మరో సంచలన విజయంపై దృష్టిపెట్టిన విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం జూలై 26వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. నూతన దర్శకుడు భరత్ కమ్మ డైరెక్షన్‌లో లక్కీ బ్యూటీ రష్మిక మందన్నతో మరోసారి జతకట్టాడు. టీజర్లు, ట్రైలర్లు, మ్యూజిక్ ఫెస్టివల్స్ హోరెత్తించడంతో ఈ సినిమా కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్‌ను సంపాదించుకొన్నది. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి లాంటి మరో బ్లాక్ బస్టర్ సొంతమైందా? రష్మిక మందన్నకు గీత గోవిందం లాంటి సక్సెస్ లభించిందా? అనే విషయం తెలుసుకోవాలంటే కథ, కథనాల గురించి తెలుసుకోవాల్సిందే.

    డియర్ కామ్రేడ్ కథేంటంటే

    డియర్ కామ్రేడ్ కథేంటంటే

    బాబీ అలియాస్ చైతన్య (విజయ్ దేవరకొండ) కాలేజీ పాలిటిక్స్‌లో చురుకైన నాయకుడు. తొలి చూపులోనే లిల్లీ అలియాస్ అపూర్ణదేవీ (రష్మిక మందన) ప్రేమలో పడుతాడు. క్రికెటర్‌గా జాతీయ స్థాయిలో ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకొంటుంది. కానీ బాబీలో ఉండే ఆవేశం తనకు నచ్చదు. అయితే ఈ క్రమంలో ఓ సంఘటన కారణంగా బాబీ, లిల్లీ విడిపోతారు. మూడేళ్ల తర్వాత డిప్రెషన్‌కు గురైన లిల్లీ కలుసుకొంటాడు.

    డియర్ కామ్రేడ్‌లో ట్విస్టులు

    డియర్ కామ్రేడ్‌లో ట్విస్టులు

    తాను ఎంతో ప్రేమించే బాబీని లిల్లీ వదిలి పోవడానికి కారణమేమిటి? లిల్లీ ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్లింది? లిల్లీ డిప్రెషన్‌కు కారణమేమిటి? మూడేళ్లపాటు దూరంగా ఉన్న బాబీ ఏం చేశాడు? కాలేజీ పాలిటిక్స్‌ను ఎందుకు వదులు కోవాల్సి వచ్చింది? లిల్లీ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నంలో బాబీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే డియర్ కామ్రేడ్ సినిమా కథ.

    ఫస్టాఫ్

    ఫస్టాఫ్

    కాలేజీ పాలిటిక్స్, యూనియన్ల గొడవతో సినిమా కథ ప్రధానంగా సాగుతుంది. లిల్లీకి దూరమైన బాబీ వేదన, బాధతో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో నేరుగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. రోడ్డు యాక్సిడెంట్‌లో పరిచయమైన లిల్లీ క్రికెటర్‌గా ఎస్టాబ్లిష్ చేయడం లాంటి అంశాలతో సరదాగా కథ సాగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఓ కీలక సన్నివేశం బ్యాక్ డ్రాప్‌తో లిలీ, బాబీ విడిపోవడంతో తొలి భాగం ముగస్తుంది. యాక్షన్ సీన్లు, లవ్ ఎపిసోడ్స్‌ ఫస్టాఫ్‌కు పాజిటివ్ అంశాలుగా మారాయని చెప్పవచ్చు.

    సెకండాఫ్

    సెకండాఫ్

    రెండో భాగంలో కథకు అత్యంత బలమైన పాయింట్‌ను చెప్పడానికి దర్శకుడిలో తడబాటు కనిపిస్తుంది. అనేక అంశాలను కథలో దూర్చి పక్కదాని పట్టినట్టు కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా చాలా భారంగా సాగినట్టు ఫీలింగ్ కదులుతుంది. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ఎప్పుడు మొదలువుతుందా అనే విషయం ప్రేక్షకుడిని వెంటాడుతుంటుంది. ఇక క్రికెట్ రంగంలో లైంగిక వేధింపుల అంశం కాస్త ఆలోచింపజేసేలా ఉండటం ప్రేక్షకుడికి కాస్త ఊరటలా ఉంటుంది. అలాగే కమిటీ విచారణ కూడా నాసిరకంగా ఉంటుంది. లాజిక్‌లకు దూరంగా.. సినిమాటిక్ లిబర్టీతో దర్శకుడు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో నిడివి, అనవసరమైన సీన్లు మైనస్ పాయింట్లుగా మారాయి.

    డైరెక్టర్ భరత్ కమ్మ గురించి

    డైరెక్టర్ భరత్ కమ్మ గురించి

    క్రికెట్ రంగంలో లైంగిక వేధింపుల సినిమాకు ఓ వెన్నెముక. అయితే ఆ పాయింట్ చెప్పడానికి లెఫ్ట్ బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకోవడం ఆకట్టుకొనే అంశం. కాకపోతే ఆ నేపథ్యానికి వరంగల్‌, ఖమ్మం లాంటి, లేదా విజయవాడ లాంటి ప్రదేశాన్ని ఎంచుకొంటే యాప్ట్‌గా ఉండేదేమో అనిపిస్తుంది. ఇది సినిమాకు ప్రతికూల అంశం కానే కాదు.. కానీ నేచురాలిటీ అనే సినిమాకు ప్లస్ అయి ఉండేదేమో. ఇక దర్శకుడు తాపీగా, ప్రశాంతంగా కథను చెప్పే తీరు బాగుంది. కాకపోతే కొన్ని నాసిరకమైన, పేలవమైన సన్నివేశాలు స్టోరిని డైల్యూట్ చేసినట్టు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక ఫెర్ఫార్మెన్స్‌‌తోనే దర్శకుడు భరత్ తన నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. జాతీయ స్థాయి అప్పీల్ ఉన్న మంచి పాయింట్‌ను ఇంకా ప్రభావవంతంగా తెరకెక్కిస్తే మంచి ఫలితం దక్కి ఉండేదేమో అనిపించింది.

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్

    ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్ విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్ డియర్ కామ్రేడ్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ విజృంభించాడు. ఎప్పటిలానే సినిమాను తన భుజాలపై వేసుకొని వన్ మ్యాన్ ఆర్మీ అనే ఫీలింగ్ కలిగించాడు. కొన్ని సన్నివేశాల్లో యాక్టింగ్ పరంగా మెచ్యురిటీ కనిపించింది. యూత్‌ను చైతన్య పాత్రతో మళ్లీ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. భారమైన పాత్రను పోషించి తన సత్తాను చాటుకొన్నాడు. కమిటీ విచారణ సందర్భంగా విజయ్ నటన పీక్స్ వెళ్లింది. అలాగే ఇంట్లో రష్మిక ప్రపోజ్ చేసే సీన్‌లో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని చెప్పవచ్చు.

    రష్మిక యాక్టింగ్

    రష్మిక యాక్టింగ్

    డియర్ కామ్రేడ్ సినిమా మొత్తం లిల్లీ పాత్ర చుట్టు అల్లుకోవడం వలన రష్మికకు తన నటనను ప్రూవ్ చేసుకోవడానికి మళ్లీ దొరికిన అవకాశాన్ని పక్కాగా ఉపయోగించుకొన్నది. రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. క్లైమాక్స్‌లోనూ, అలాగే హాస్పిటల్ సీన్లో రష్మిక నటన మరో లెవెల్‌కు వెళ్లిందని చెప్పవచ్చి. అసలు సిసలైన క్రికెటర్ అనే ఫీలింగ్‌ను కలిగించింది. అలాగే ఎమోషనల్ పాత్రలకు, అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు సిద్ధమనే సిగ్నల్‌ కూడా ఇచ్చేసింది.

    ఇతర నటీనటులు గురించి

    ఇతర నటీనటులు గురించి


    డియర్ కామ్రేడ్ చిత్రంలో మిగితా క్యారెక్టర్లకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. సుహాస్ తనదైన మార్కు నటనతో ఆకట్టుకొన్నాడు. క్రికెట్ బోర్డు సెలక్టర్‌గా రాజ్ అర్జున్ నటించాడు. మూడు నాలుగు సీన్లు ఉన్నప్పటికీ, తనదైన శైలిలో గుర్తుండే విధంగా నటనను ప్రదర్శించాడు. శృతి రామచంద్రన్ పాత్ర బాగుంది. రష్మిక తండ్రిగా సంజయ్ స్వరూప్, విజయ్ తండ్రిగా నటించిన ఆనంద్ ఫర్వాలేదనిపించారు. అలాగే చారు హాసన్ పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది.

    సాంకేతిక విభాగాలు

    సాంకేతిక విభాగాలు

    టెక్నికల్ డిపార్ట్‌మెంట్లలో మ్యూజిక్ డియర్ కామ్రేడ్‌కు స్పెషల్ ఎట్రాక్షన్. జస్టిన్ ప్రభాకరన్ అందించిన రీరికార్డింగ్, పాటలు వినడానికి చాలా కొత్తగా, ఫీల్ గుడ్‌గా ఉంటాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లను ఎలివేట్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. గిర గిర తిరగాలి, విరహం పొంగెనే, టైటిల్ సాంగ్ ఆకట్టుకొన్నాయి. ఆర్ట్ విభాగం పనితీరు కూడా బాగుంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    డియర్ కామ్రేడ్‌ను బిగ్‌బెన్ పిక్చర్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించాయి. యష్ రంగినేని, నవీన్, రవికిషోర్, సీవీఎంలు నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమా కథకు తగినట్టుగా బ్యాక్ డ్రాప్‌లను ఎంచుకొనే విషయం, నటీనటుల ఎంపికపై మరింత దృష్టిపెట్టి ఉంటే బాగుండేదేమో. తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకొన్నందున్న తెలుగు నటీనటులు లేమి కనిపిస్తుంది. నిర్మాణ పరంగా సినిమా రిచ్‌గా ఉంది.

    ప్లస్ పాయింట్

    ప్లస్ పాయింట్

    డియర్ కామ్రేడ్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. సుజిత్ సారంగ్ పనీతీరు తెరపైన బ్రహ్మండంగా ఉంటుంది. మంచు పర్వతాలు, ఘాట్ రోడ్స్, కాకినాడ అందాలను చూపించిన తీరు బాగుంది. సినిమా కోసం వాడుకొన్న కలర్ ప్యాటర్న్ కూడా మరో పాజిటివ్ అంశం. కాకపోతే సినిమా నిడివిని కంట్రోల్ చేయలేకపోవడాన్ని ఎడిటర్‌ శ్రీజిత్ సారంగ్‌ను తప్పుపట్టాలా? వద్దా? లేదా దర్శకుడి ప్రభావమా అనే సినిమా ఫలితమే తేల్చుతుంది. కనీసం 20 నిమిషాల కథను ఎడిట్ చేస్తే ప్రేక్షకుడికి చెప్పాలనుకొన్న సినిమా పర్పస్ నేరవేరుతుందని చెప్పవచ్చు. శ్రీజిత్ కలరింగ్ వర్క్ కూడా సూపర్‌గా ఉంది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    డియర్ కామ్రేడ్ క్రీడా రంగాన్ని పట్టి పీడిస్తున్న లైంగిక వేధింపులతో తెరకెక్కింది. మహిళలకు పలు రంగాల్లో ఎదురవుతున్న సమస్యను ప్రధానంగా చర్చించేలా చేసింది. ప్రేమ, బ్రేకప్ లాంటి భావోద్వేగంతో కూడిన ఓ యువతి, యువకుడి ప్రయాణం ఆకట్టుకొనేలా ఉంది. రొమాన్స్, ఎమోషనల్, యాక్షన్ అంశాలతో యూత్‌కు నచ్చే విధంగా రూపొందింది. భరత్ కమ్మ కథ, కథనాలు, విజయ్ దేవరకొండ, రష్మిక ఫెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. కాకపోతే ఓ మంచి పాయింట్‌ను ఫీల్ కావడానికి మూడు గంటల భారాన్ని తలపైన మోసినట్టు అనిపిస్తుంది. సినిమా లెంగ్త్ ఈ సినిమాకు ప్రధానమైన సమస్య. అంతేకాకుండా బీ,సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువయ్యే అంశంపైనే సినిమా ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    తెర వెనుక, తెర ముందు
    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, శృతి రామచంద్రన్ తదితరులు
    దర్శకత్వం: భరత్ కమ్మ
    మ్యూజిక్: జస్టిన్ ప్రభాకరన్
    సినిమాటోగ్రఫి: సుజిత్ సారంగ్
    ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
    నిర్మాత: యష్ రంగినేని
    బ్యానర్: మైత్రీ మూవీమేకర్స్, బిగ్‌బెన్ పిక్చర్స్
    రిలీజ్: 2019-07-2019

    English summary
    Dear Comrade movie review and rating, Vijay Deverakonda movie news, Rashmika Mandanna movie news, Shruti Ramachandran movie news, Bharat Kamma movie new
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X