For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dear Megha movie review.. ఫీల్‌గుడ్ ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ..

  |

  Rating: 2.75/5

  తెలుగు సినిమా పరిశ్రమకు లవ్ స్టోరీలు.. ముఖ్యంగా ముక్కోణ ప్రేమకథా చిత్రాలు కొత్తేమీ కాదు. కన్నడలో అద్భుతమైన చిత్రంగా టాక్‌‌ను సొంతం చేసుకొన్న దియా చిత్రానికి రీమేక్‌గా డియర్ మేఘ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ భాషలో మాదిరిగా డియర్ మేఘ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నదా? మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? అర్జున్ సోమయాజులుకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాలను తెలుసుకోవాలంటే..

  డియర్ మేఘ కథ ఇలా..

  డియర్ మేఘ కథ ఇలా..

  తన కాలేజీలో చదివే అర్జున్ (అర్జున్ సోమయాజులు)ను మేఘా స్వరూప్ (మేఘా ఆకాశ్) ప్రేమిస్తుంది. అయితే తన ప్రేమను అర్జున్‌కు చెప్పలేకపోతుంది. కాలేజీ విద్యను పూర్తి చేసుకొన్న అర్జున్ మూడేళ్లపాటు మేఘాకు దూరమవుతాడు. ఆ తర్వాత మేఘా, అర్జున్ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చెప్పుకొని తమ అఫైర్‌‌‌ను పెళ్లి వరకు తీసుకొస్తారు. కానీ తాము ఒకటి తలిస్తే.. విధి మరోలా వారిని వెక్కిరిస్తుంది. పెళ్లికి ముందు అర్జున్ యాక్సిడెంట్‌కు గురై మేఘాకు దూరమవుతాడు.

  డియర్ మేఘలో ట్విస్టులు

  డియర్ మేఘలో ట్విస్టులు

  అర్జున్ యాక్సిడెంట్‌కు గురైన తర్వాత మెఘా మానసిక పరిస్థితి ఏమిటి? మేఘా ఎందుకు సూసైడ్‌కు ప్రయత్నిస్తుంది? అర్జున్‌కు దూరమైన మెఘా జీవితంలోకి ఎలాంటి పరిస్థితుల్లో ఆది (అరుణ్ అదిత్) ప్రవేశిస్తాడు. ఆదితో పరిచయం ఎక్కడికి దారి తీసింది? ఆదికి దగ్గరవుతున్న సమయంలో అర్జున్ మళ్లీ రావడంతో మేఘా ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? మేఘా జీవితంలో చోటుచేసుకొన్స సంఘటన ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి? మేఘా ప్రేమ అర్జున్, ఆదిలో ఎవరికి దక్కింది? అనే ప్రశ్నలకు సమాధానమే డియర్ మేఘ చిత్ర కథ.

  సినిమా ఎలా ఉందంటే..

  సినిమా ఎలా ఉందంటే..

  మేఘ ఆత్మహత్యాయత్నంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. కాలేజీలో అర్జున్, మేఘ మధ్య ప్రేమ సన్నివేశాలు ఫీల్‌గుడ్‌గా సాగుతాయి. అర్జున్ సింగపూర్‌కు వెళ్లిన తర్వాత మేఘ క్యారెక్టర్ చాలా ఎమోషనల్‌గా మారడం హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. అరుణ్ అదిత్ ఎంట్రీతో కథలో జోష్ పెరుగుతుంది. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్‌ అని చెప్పవచ్చు. తల్లికి ఆది రాసే లెటర్ ఎపిసోడ్‌ కొత్తగా, ఆకట్టుకొనేలా ఉంటుంది. ఫస్టాఫ్‌‌లో రొటీన్ అంశాలు ఎక్కువైనా సెకండాఫ్ సినిమాను మరింత ఫీల్‌గుడ్‌గా మారుస్తుంది. కథనం స్లోగా సాగడం సినిమాకు కొంత ప్రతికూలంగా మారినట్టు అనిపిస్తుంది.

  దర్శకుడు సుశాంత్ రెడ్డి గురించి

  దర్శకుడు సుశాంత్ రెడ్డి గురించి

  దర్శకుడు సుశాంత్‌రెడ్డి మూల కథను, ఒరిజినాలిటీని ఎక్కడా మిస్ కాకుండా చాలా వరకు ప్రయత్నించాడు. రీమేక్ అయినా క్యారెక్టర్ల నుంచి ఎమోషన్స్ రాబట్టుకోవడలో దర్శకుడిగా తడబాటు ఆయనలో కనిపిస్తుంది. దర్శకుడు సుశాంత్ రెడ్డి ప్రతిభను పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి ఈ సినిమా సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓవరాల్‌గా దర్శకుడిగా మంచి మార్కులే సంపాదించుకొన్నారని చెప్పవచ్చు.

  మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్ పెర్ఫార్మెన్స్

  మేఘా ఆకాశ్, అరుణ్ అదిత్ పెర్ఫార్మెన్స్

  ఇక నటీనటుల విషయాన్ని వస్తే.. ఆది, మేఘ పాత్రలు పోషించిన అరుణ్ అదిత్, మేఘ ప్రేక్షకులను దాదాపు మెప్పించే ప్రయత్నం చేశారు. కన్నడ సినిమాలోని నటీనటుల ప్రభావం పడకుండా జాగ్రత్త పడినట్టు కనిపిస్తుంది. అర్జున్‌గా అర్జున్ సోమయాజులు ఫర్వాలేదనిపిస్తారు. ఈ మూడు పాత్రలకు సినిమాకు మూలస్తంభాలా మారాయని చెప్పవచ్చు.

  మిగితా పాత్రల్లో పవిత్రా లోకేష్, ఆనంద చక్రపాణి

  మిగితా పాత్రల్లో పవిత్రా లోకేష్, ఆనంద చక్రపాణి

  తల్లి పాత్రలో కనిపించిన పవిత్ర లోకేష్ తన బాధ్యతను సమర్ధవంతంగా పోషించారు. కన్నడతో పోల్చుకొంటే పవిత్ర లోకేష్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇక హీరోయిన్ తండ్రిగా కనిపించిన నటుడు ఆనంద చక్రపాణి మరోసారి ఆకట్టుకొన్నారు. పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోయే పాత్రలో కనిపించడమమే కాకుండా మెప్పించారని చెప్పవచ్చు. మిగితా వారు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.

  తెర వెనుక నిపుణుల గురించి

  తెర వెనుక నిపుణుల గురించి

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఐ అండ్రూ బాబు సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కాలేజీ హీరో, హీరోయిన్ల ఎమోషనల్ అంశాలకు సంబంధించిన సీన్లు తెరపైన ఫీల్‌గుడ్‌ను పంచుతాయి. గౌరా హరి మ్యూజిక్ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ క్రీస్పిగా ఉండటంతో ఎమోషన్స్ పూర్తిస్థాయిలో క్యారీ అయ్యాయని చెప్పవచ్చు. అర్జున్ దాస్యన్ పాటించిన నిర్మాణ విలువలు భేష్‌గా ఉన్నాయి.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్‌తో సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ డియర్ మేఘ. అయితే కథను మరో రేంజ్‌కు చేర్చే బలమైన సన్నివేశాలు, కథనం మందగించడం సినిమాకు ప్రతికూలంగా మారాయని చెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. ఫ్యామిలీ, యూత్, స్టూడెంట్స్‌కు నచ్చే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలిగితే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.

  Director Maruthi Launched 'Achamaina Telugu Inti Pillave' Song From Savitri w/o Satyamurthy
  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు: మేఘా ఆకాశ్, అదితి అరుణ్, అర్జున్ సోమయాజులు, పవిత్రా లోకేష్, ఆనంద చక్రపాణి తదితరులు
  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ సుశాంత్ రెడ్డి
  కథ: కేఎస్ అశోక
  నిర్మాత: అర్జున్ దాస్యం
  సినిమాటోగ్రఫి: ఐ అండ్రూ బాబు
  మ్యూజిక్: గౌర హరి
  ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
  బ్యానర్: వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్
  రిలీజ్ డేట్: 2021-09-03

  English summary
  Dear Megha movie review: Dear Megha is the remake of Kannada Movie Dia Which is released on September 3rd, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X