DeAr Movie Review ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ హిట్టుకొట్టారా? డియర్ మూవీ ఎలా ఉందంటే?

Rating:
2.0/5

నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులు
రచన, దర్శకత్వం: ఆనంద్ రవిచంద్రన్
నిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేని
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫి: జగదీష్ సుందర మూర్తి
ఎడిటింగ్: కృపాకరన్ రుకేష్
రిలీజ్ డేట్: 2024-04-12

ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేసే అరుణ్ (జీవీ ప్రకాశ్ కుమార్)కు దీపిక (ఐశ్వర్య రాజేశ్)కు వివాహం జరుగుతుంది. అయితే దీపికకు ఉండే ఓ శారీరక సమస్య వల్ల అరుణ్‌కు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. తన ప్రొఫెషన్‌లో రాణించడానికి దీపిక సమస్య అడ్డుగా మారుతుంది. దాంతో వారిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొంటారు.

DeAr Movie Review in Telugu  Un impressive GV Prakash Kumar s family Drama

దీపికకు ఉన్న సమస్య ఏమిటి? భార్యకు ఉన్న సమస్య కారణంగా అరుణ్‌ లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? అరుణ్ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య ఉన్న సమస్య ఏమిటి? అలాగే అరుణ్‌కు సోదరుడు (కాళి వెంకట్)కు ఉన్న విభేదాలు ఏమిటి? దీపికకు విడాకుల వ్యవహారం కుటుంబంలో ఎలాంటి అశాంతికి గురిచేసింది? అరుణ్ ఫ్యామిలీలో గొడవలకు పరిష్కారం ఏమిటి? విడాకులు తీసుకోవాలనుకొన్న అరుణ్, దీపిక జీవితాలకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే డియర్ (DeAr) మూవీ సినిమా కథ.

గురక అనే సమస్య మీద గతంలో కొన్ని సినిమాలు వచ్చి మెప్పించాయి. ఈ కథలో గురక అనే సమస్య చుట్టూ కుటుంబ బంధాల అల్లుకొని తెరకెక్కించారు. అయితే అయితే కథ ఎమోషనల్‌గా నడిపించడానికి కావాల్సిన కంటెంట్ లేకపోవడంతో ఏదో నిస్సారంగా, నిస్తేజంగా.. రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగుతూ.. ఓ సాధారణమైన సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. మూవీలో ఎక్కడా కూడా హై పాయింట్స్ లేకపోవడం వల్ల ఆకట్టుకోలేకపోయిందనే భావన కలుగుతుంది.

DeAr Movie Review in Telugu  Un impressive GV Prakash Kumar s family Drama

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బలమైన, భారమైన పాత్రలతో స్క్రీన్ మీద ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టే ఐశ్వర్య రాజేష్ మరోసారి ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. కానీ ఆ పాత్ర ద్వారా ఎలివేట్ చేయడానికి కంటెంట్, స్కోప్ లేకపోవడంతో నామమాత్రంగానే కనిపించింది. జీవీ ప్రకాశ్ కుమార్ పాత్ర కూడా అంతే.. పాయింట్‌గా ఆయన క్యారెక్టర్ బాగుంటుంది. కానీ డెప్త్‌కు వెళ్లే కొద్ది ఆ రోల్‌లో విషయం.. ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసే అంశాలు లేకపోవడంతో తేలిపోయినట్టు కనిపిస్తుంది. రోహిణి, తలైవసల్ విజయ్, కాళీ వెంకట్, మిగితా పాత్రల పరిస్థితి కూడా అంతేగా ఉంటుంది.

ఇక కథ, సన్నివేశాల కంటెంట్ బాగుంటే.. ఆటోమెటిక్‌గా సాంకేతిక విభాగాలు కూడా మెరుపులు మెరిపిస్తాయి. ఈ మూవీలో బలమైన కంటెంట్ లేకపోవడంతో టెక్నికల్ విభాగాలు కూడా చతికిల పడ్డాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జగదీష్ సినిమాటోగ్రఫి, కృపాకరన్ ఎడిటింగ్ కూడా ఒకే అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

DeAr Movie Review in Telugu  Un impressive GV Prakash Kumar s family Drama

ఆలుమగలు మధ్య సంసారంలో గురక అనేది చాలా ఎమోసనల్ పాయింట్. ఆ పాయింట్‌ను పక్కాగా డిజైన్ చేసి హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి ఎమోషనల్ అంశాన్ని కరెక్ట్‌గా డీల్ చేయలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నప్పటికీ.. కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ల డిజైన్, పాత్రల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవట్ కాకపోవడంతో సాదాసీదాగా మిగిలిపోయింది. జీవీ ప్రకాశ్, ఐశ్వర్య రాజేష్ అభిమానులకు నచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. వాటి కోసం ఓ సారి చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X