Deewana Movie Review: దీవానా తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహా మనిమేఘలై, వీకే నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, జీవన్ కుమార్ తదితరులు
దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి
నిర్మాతలు: ఆర్హా మీడియా, వాసుదేవ్ కొప్నినేని, శ్రీదేవి కార్యంపూడి
డిస్ట్రిబ్యూషన్: గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్
మ్యూజిక్: ఈశ్వర్ చంద్
సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: హృషికేష్ పసపాల్,
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాల
క్యాస్టూమ్: మానస
బ్యానర్స్: అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2026-06-19
సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అంశాలు హైలెట్‌గా అనిపిస్తాయి. వంశీ పచ్చి పులుసు కెమెరా వర్క్ బాగుంది. మిడిల్ క్లాస్ వాతావరణాన్ని బాగా క్యాప్చర్ చేశారు. హృషికేష్ ఎడిటర్‌గా ఇంకాస్త షార్ప్‌గా కట్ చేయాల్సింది.
హైదరాబాద్‌కు చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) ఎలాంటి లక్ష్యం, బాధ్యతలు లేకుండా స్నేహితులతో జల్సాలు చేసుకొంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. దిగువ మధ్య తరగతి చెందిన తల్లిదండ్రులు (వీకే నరేష్, ఝాన్సీ) కష్టార్జితంతో బతికేస్తుంటాడు. ఓ రోజు ఈ-సేవలో పనిచేసే అమూల్య (స్మేహా మణిమేఘలై)ను తొలి చూపులోనే ప్రేమించడం మొదలుపెడుతాడు. ప్రతీ రోజు ఏదో పని నెపంతో ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. ఓ దశలో మున్నా లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని వస్తే.. నీ ప్రేమను అంగీకరించే విషయంపై ఆలోచిస్తాను. అప్పటి వరకు నా వెంట పడకూడదనే ఆంక్ష విధిస్తుంది. ప్రేయసి పెట్టిన షరతు, ఆంక్షతో ఉద్యోగం సంపాదించే పనిలో పడుతాడు.

స్నేహితులతో మున్నా లైఫ్ ఎలా కొనసాగింది? అమూల్య కోసం మున్నా ఎంతకు తెగించాడు? మున్నా ప్రేమను అమ్ము ఎందుకు తిరస్కరించింది? గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే.. ప్రేమించే విషయం ఆలోచిస్తానని ఎందుకు మెలిక పెట్టింది? మున్నా ఎలాంటి ఉద్యోగాన్ని సంపాదించాడు? ఉద్యోగ సంపాదించిన తర్వాత మున్నాను అమ్ము ఎందుకు దూరం పెట్టే ప్రయత్నం చేసింది. చివరకు అమ్ము ప్రేమను మున్నా గెలుచుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే దీవానా సినిమా కథ.
ప్రేమ కథలో యువతీ ఇష్టపడటమో లేదా యువకుడు ఇష్టపడటమో అనేది కామన్ పాయింట్. ఆ పాయింట్ చుట్టూ ఎమోషన్ పాయింట్ లేదా? ట్విస్టుతో కథను రాసుకొంటే డిఫరెంట్ లవ్ స్టోరీగా మారే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో కథను భావోద్వేగంగా మార్చే, అలాగే సెంటిమెంట్‌ను పండించే అద్బుతమైన ట్విస్ట్ ఉండటంతో తెర మీద నిజాయితీతో కూడిన ప్రేమ కథగా మారిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్లు, అమ్ము, మున్నా ప్రేమ కథను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకొని.. కథను సాగదీసినట్టు చేశాడు. కానీ ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమాను దర్శకుడు, హీరో తమ వైపుకు తిప్పుకొన్నారు.
సెకండాఫ్ విషయానికి వస్తే.. ఇంటర్వెల్ ట్విస్ట్ చుట్టూ రాసుకొన్న ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాలు చాలా కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా రఘు కారుమంచి సీన్ ఒకటి.. తండ్రి నరేష్ కొడుకు మున్నా మధ్య వచ్చే సన్నివేశాలు.. మటన్ కూడా సీన్ సెంటిమెంట్‌ను పండించటమే కాకుండా సగటు ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా ఉంటాయి. ఇక క్రైమాక్స్‌లో డ్రామాను దర్శకుడు అద్బుతంగా పండించాడు. దాంతో ఈ సినిమా నిజాయితీగా వెండితెర మీద చెప్పిన ప్రేమ కథగా మారింది.
ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్న యువ హీరో హర్షిత్ రెడ్డి సినిమా భారన్నంతా తన భుజాలపై మోయడమే కాకుండా ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. హీరోయిన్ స్మేహ సాఫ్ట్ క్యారెక్టర్‌లో జీవించాడు. ఈ సినిమాలో వీకే నరేష్ సైలెంట్ కిల్లర్‌గా మారాడు. రఘు కారుమంచి ఎమోషనల్ క్యారెక్టర్‌తో ఆకట్టుకొన్నారు. మున్నా ఫ్రెండ్స్ బ్యాచ్, హీరోయిన్ ఫ్రెండ్ సూపర్‌గా నటించారు. జీవన్ కుమార్ కామెడీనే కాకుండా ఎమోషనల్‌గా నటించారు. అర్హ మీడియా, వీ స్టూడియో, కామ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుసరించిన నిర్మాణ విలువలు, ఈ సినిమాలోని పాత్రలకు నటీనటుల ఎంపిక చాలా బాగుంది. యూత్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మెండుగా ఉన్న ఈ మూవీని ఈ వారం తప్పకుండా చూడాల్సిన జాబితాల్లో చేర్చుకోచ్చు. ఈ సినిమా హానెస్ట్ అటెంప్ట్.. రకరకాల భావోద్వేగాలను అందించడమే కాకుండా మంచి సినిమా చూసిన అనుభూతిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications