Deewana Censor Report: దీవానా తెలుగు మూవీ సెన్సార్ రివ్యూ

తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో, హీరోయిన్లు హర్షిత్ రెడ్డి, స్మేహా మనిమెగలై జంటగా నటించిన రొమాంటిక్, ఎమోషనల్ లవ్ స్టోరీ దీవానా. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్ట రచనా సహకారంతోపాటు దర్శకత్వం వహించారు. అర్హ మీడియా, వీ స్టూడియో బ్యానర్లపై ఈ చిత్రాన్ని ఆర్హా మీడియా, వాసుదేవ్ కొప్నినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: ఈశ్వర్ చంద్, సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు ఎడిటర్: హృషికేష్ పసపాల్, ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాల, క్యాస్టూమ్: మానస తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. కామ్ ఎంటర్‌‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా జూన్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏంటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? ఈ చిత్రంపై వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

Deewana Telugu Movie Censor Report

అమ్ము (స్మేహా మనిమెగలై)ను మనస్పూర్తిగా యువకుడు మున్నా (హర్షిత్ రెడ్డి) ఇష్టపడుతాడు. ఆమె తన ప్రపంచంగా భావిస్తాడు. కానీ అతడి లవ్ వన్ సైడ్ కావడంతో కష్టాలు మొదలవుతాయి. అమ్ము ప్రేమను పొందడానికి మున్నా ప్రయత్నిస్తుంటాడు, పరితపిస్తాడు. ఇద్దరి మధ్య ఓ రకమైన మానసిక సంఘర్షణ ఉంటుంది. మున్నా తల్లిదండ్రులు (ఝాన్సీ, నరేష్) తమ కొడుకు పరిస్థితిని చూసి ఆవేదన చెందుతారు. చివరకు ఆ మున్నా ప్రేమను అమ్ము అంగీకరించిందా? పిచ్చిగా ప్రేమించిన అబ్బాయి పరిస్థితి ఏమైందనే ఈ సినిమా కథ.

ఈ రొమాంటిక్ డ్రామాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు వీక్షించారు. ఈ సినిమాలోని ఎమోషన్స్‌ చుట్టు అల్లుకొన్న కథను రాసిన దర్శకుడు శ్రీకాంత్ సింగిశెట్టిని అభినందించారు. నేటితరం యువతీ, యువకుల మనోభావాలకు తగినట్టుగా రూపొందించిన కథ, సన్నివేశాల్లో ఎలాంటి అభ్యంతరాలు కనిపించకపోవడంతో క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఉన్నట్టుండి అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి నటన, స్మేహ గ్లామర్ ఆకట్టుకొన్నది. ఈ చిత్రంలో ఇతర పాత్రల నటన, సాంకేతిక అంశాలు బలంగా కనిపించాయి. ఈ చిత్రం గురించిన ఫస్ట్ టాక్, సెన్సార్ సర్టిఫికెట్ డిటైల్స్, రన్ టైమ్ కోసం కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: Harishith Reddy Deewana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X