వీర ధీర శూర మూవీపై ఢిల్లీ కోర్టు స్టే.. మార్నింగ్ షోలు రద్దు.. రిలీజ్ ఎప్పుడంటే?

తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన వీర ధీర శూర సినిమాకు సంబంధించిన మార్నింగ్ షోలు రద్దు చేశారు. ఓటీటీ రైట్స్‌కు సంబంధించిన లీగల్ సమస్యల వల్ల ఈ సినిమా రిలీజ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడంతో మార్నింగ్ షోలను రద్దు చేశారు. దాంతో ఈ సినిమా నిర్మాతలకు సంబంధించిన టీమ్ ఢిల్లీకి చేరుకొన్నది. ఈ లీగల్ సమస్య నుంచి గట్టెక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

చిత్తా ఫేమ్ దర్శకుడు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన వీర ధీర శూర పార్ట్ 2 సినిమాలో ఎస్‌జే సూర్య, దుషారా తదితరులు నటించారు. ఈ సినిమాను భారీగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 27 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ముంబైకి చెందిన బీ4యూ అనే సంస్థతో ఓటీటీ రైట్స్ విషయంలో జరిగిన ఒప్పందం వివాదంగా మారడంతో ఆ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దాంతో ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్‌పై స్టే విధించింది.

Delhi High Court Stayed on Vikram s Veera Dheera Sooran

వీర ధీర శూర నిర్మాతలు ముందుగా బీ4యూ అనే సంస్థతో ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్ అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు. కొన్ని కారణాల వల్ల ఆ ఒప్పందం అమలు చేయడంలో రెండు పార్టీల మధ్య వివాదం చోటు చేసుకొన్నది. బీ4యూ సంస్థ కోర్టును ఆశ్రయించగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలంటూ మధ్యంతర స్టే ఇచ్చింది. దాంతో ఉదయం ప్రారంభం కావాల్సిన షోలు రద్దు చేశారు. అయితే లీగల్ ఇష్యూస్ సాల్వ్ అయితే 11 గంటలకు ఈ సినిమా షోలు పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.

ఇక ఉదయం 6గంటలకు ప్రారంభ కావాల్సిన షోలు రద్దు కావడంతో చిత్ర యూనిట్ స్పందించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు కొనుగోలు చేసిన వారికి బుక్ మై షో ద్వారా డబ్బు వాపసు చేయబడుతుందని వెల్లడించారు. వారికి 7 రోజుల్లో టికెట్ డబ్బులు అకౌంట్‌లోకి వస్తాయని తెలిపారు. ఈ అసౌకార్యానికి చింతిస్తున్నాం. ఈ అసౌకర్యం వల్ల ఇబ్బంది పడిన వారు సహకరించాలని వారు కోరారు.

వీర ధీర శూర సినిమా విషయానికి వస్తే.. విక్రమ్ కెరీర్‌లో ఇది 62వ సినిమా. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. థేనీ ఈశ్వర్ సినిమాటోగ్రఫి, ప్రసన్న జీకే ఎడిటింగ్ బాధ్యతలు, ఫోనిక్స్ ప్రభు స్టంట్స్ సమకూర్చారు. ఈ సినిమాను హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించారు.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X