Demonte Colony 2 Review: డిమోంటే కాలనీ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 3.25
మూవీ: డీమోంటే కాలనీ 2
నటీనటులు: అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్, సెరింగ్ దోర్జి, అరుణ్ పాండ్యన్, అర్చన రవిచంద్రన్, మీనాక్షి గోవిందన్ తదితరులు
దర్శకత్వం: అజయ్ ఆర్ జ్ఞానముత్తు
నిర్మాతలు: విజయ సుబ్రమణియన్, ఆర్సీ రాజ్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్: సామ్ సీఎస్
సినిమాటోగ్రాఫర్: హరీష్ కన్నన్
ఎడిటింగ్: కుమరేష్ డీ
రిలీజ్ డేట్: 2024-08-23
డెమోంటే కాలనీలోని ఓ ఇంటిలో అనుమానాస్పద మరణాలు సంభవిస్తుంటాయి. ఆ మరణాలు మిస్టరీగా ఉండటంతో అందరూ ఆ ఇంటిలోకి వెళ్లడానికి భయపడుతుంటారు. ఆ క్రమంలో ఆ ఇంటిలోకి ప్రవేశాన్ని నిషేదిస్తారు. ఇలాంటి క్రమంలో మిస్టరీగా మారిన తన ప్రియుడు శామ్యూల్ రిచర్డ్ (సర్జావ్ ఖాలీద్) సూసైడ్ వెనుక కారణాలను డెబ్బీ (ప్రియా భవానీ శంకర్) తెలుసుకొనే ప్రయత్నం మొదలుపెడుతుంది. అందుకోసం ఓ స్వామి దావోషి (సెరింగ్ దోర్జీ)ని సహాయం తీసుకొంటుంది.
శ్యాముల్ రిచర్డ్ సూసైడ్ వెనుక కారణం ఏమిటి? శామ్యూల్ ఆత్మతో ఎందుకు మాట్లాడాలనుకొంటుంది? డీమోంట్ కాలనీలోని పాడుబడిన ఇంటిలో పుస్తకంలో ఏమున్నది? ఆ ఇంటిలోని మిస్టరీ బంగారు చైన్ ఏమిటి? డీమోంట్ కాలనీకి శ్రీని, రఘు (అరుళ్ నిధి) అనే కవల సోదరులకు సంబంధం ఏమిటి? హాస్పిటల్ బెడ్‌పై ఉన్న రఘును ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తుంటారు. డెబ్బికి స్వామి ఎలాంటి సహాయం చేశాడు? డెబ్బీకి తన ప్రియుడి సూసైడ్ వెనుక కారణాలు తెలిశాయా? అనే ప్రశ్నలకు సమాధానమే డీమోంటే కాలనీ 2 సినిమా కథ.

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన డీమోంటే కాలనీ సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు ఈ మూవీని రూపొందించారు. దాదాపు కథలో మెయిన్ పాయింట్ ఒకేలా ఉన్నా.. వాటి చుట్టూ రాసుకొన్న పాత్రలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ కథ, కుట్రలు, మోసాలు లాంటి అంశాలు చక్కగా తెర మీద చెప్పాలనే ప్రయత్నంలో మరోసారి సక్సెస్ అయ్యారు. తనకు అత్యంత బలంగా మారిన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడికి ఊపిరి సలపకుండా భావోద్వేగాలతో కట్టిపడేశాడు. అలాగే టెక్నికల్ అంశాలతో థియేటర్లలో ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురి చేశాడని చెప్పవచ్చు. రకారకాల ట్విస్టులు, టర్న్‌లతో సినిమాను ఆద్యంతం పట్టుసడలకుండా కథను నడిపించిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది.
ఇక ఈ చిత్రంలో డెబ్బిగా ప్రియా భవానీ శంకర్ సినిమాను ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. గ్లామర్ తారగా మనకు పరిచమైన ఈ బ్యూటీని ఈ సినిమాలో కొత్త కోణంలో చూసే అవకాశం ఉంది. గ్లామర్, ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాల ఆధారంగా సాగే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. గురు స్వామిగా సెరింగ్ దోర్జి ఈ సినిమాకు బలమైన పాత్ర. ఇక అరుళ్ నిధి, ఇతర పాత్రల్లో నటించిన వారు నూటికి నూరు శాతం తమ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
డెమోంటే కాలనీ 2 చిత్రానికి అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు. ఈ చిత్రంలోని సన్నివేశాలకు డిజైన్ చేసిన సౌండింగ్, అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్‌లో ఉన్నాయి. ఇక హరీష్ కన్నన్ అందించిన సినిమాటోగ్రఫి ఎమోషన్స్‌ను భారీగా ఎలివేట్ చేశాయి. అలాగే సీన్ల స్వభావాన్ని బట్టి ఎంచుకొన్న కలర్ సీక్వెన్స్ బాగుండటంతో మూవీ చాలా రిచ్‌గా.. కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇక కుమరేష్ డీ ఎడిటింగ్ కత్తి మీద సాములా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో ఉండే మ్యాజిక్ తగినట్టుగా సన్నివేశాలను అలా పేర్చుకొంటూ వెళ్లిన తీరు బాగుంది. కథ, కథనాలు, నటీనటుల ఫెర్పార్మెన్స్‌ను ఎలివేట్ చేయడానికి నిర్మాతలు రాజీ పడకుండా ఖర్చు చేసిన విధానం హైలెట్. నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి.

ఇటీవల కాలంలో వచ్చిన అద్బుతమైన హారర్, సస్సెన్స్ థ్రిల్లర్‌తో కూడిన చిత్రం సూపర్ నేచురల్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2. పుష్కలంగా ఉన్న సాంకేతిక అంశాలు, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు పాజిటివ్ అంశం. అయితే హైలీ ఇంటెలెక్చువల్, ట్రీక్కీ స్క్రీన్ ప్లే సాధారణ ప్రేక్షకులకు అర్దమవుతుందా అనేది ఓ ప్రశ్నార్థకం. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే తమిళంలో మాదిరిగా భారీ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఈ వారం ఎలాంటి అంచనాలు, సందేహాలు లేకుండా థియేటర్‌కు వెళితే.. సూపర్ ఎక్స్‌పీరియెన్స్‌తో బయటకు రావడం తథ్యం. ఈ వారం మీ జాబితాలో ఈ సినిమాను చేర్చుకొండి.. మంచి సినిమాను చూశామనే అనుభూతిని కచ్చితంగా పొందుతారు.


Click it and Unblock the Notifications











