Gaanam Web Series review క్యూట్, సెన్సిబుల్ లవ్ స్టోరి.. పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన దేత్తడి హారిక!
Rating: 2.75/5
నటీనటులు: దేత్తడి హారిక, భరత్ బండారు తదితరులు
దర్శకత్వం: భార్గవ్ మాచర్ల
నిర్మాతలు: రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి
బ్యానర్: తమడా మీడియా
ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్

గానం వెబ్ సిరీస్ కథేంటంటే?
తెలుగు వినోద పరిశ్రమలో శ్రావ్య (దేత్తడి హారిక) ఓ సింగర్. ట్రావెలింగ్ అంటే ఇష్టమున్న యూట్యూబర్ సిద్దూ (భరత్). ఒంటరితనంతో బాధపడుతుంటే శ్రావ్య కేరళ పర్యటనకు వెళ్తుంది. కేరళ అందాలను తన కెమెరాలో బంధించేందుకు సిద్దు అక్కడికి వెళ్తాడు. అనుకొని పరిస్థితుల్లో శ్రావ్య, సిద్ధు కలుసుకొంటారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు వారిద్దరి మనసులు కలుసుకొనేలా చేస్తాయి. ఒకరంటే మరొకరికి బయటకు చెప్పుకోలేని ఇష్టం ఏర్పడుతుంది.

గానంలో ట్విస్టులు
అయితే సింగర్ శ్రావ్య ఒంటరితనానికి కారణమేమిటి? శ్రావ్య తరచూ కేరళకు వెళ్తుంది? కేరళకు శ్రావ్యకు ఉన్న విడదీయలేని అనుబంధం ఏమిటి? శ్రావ్యకు సిద్దూ ఎలా దగ్గరయ్యారు? శ్రావ్య జీవితంలోని సంఘటనలు తెలుసుకొన్న సిద్దూ ఎలా రియాక్ట్ అయ్యాడు. కేరళ టూర్ ముగిసే సమయానికి వారిద్దరి పరిస్థితి ఏమిటి? సిద్దూ బ్రేకప్ గురించి శ్రావ్య ఎలా రియాక్ట్ అయింది లాంటి ప్రశ్నలకు సమాధానమే గానం వెబ్ సిరీస్ కథ.

దర్శకుడు భార్గవ్ మాచర్ల గురించి
దర్శకుడు భార్గవ్ మాచర్ల ఎంచుకొన్న పాయింట్, రాసుకొన్న సన్నివేశాలు బాగున్నాయి. సున్నితమైన రొమాన్స్‌తో ప్రేమ కథను నడిపించిన తీరు మెప్పించేలా ఉంది. వెబ్ సిరీస్ అంటే బూతు సీన్లు, డైలాగ్స్ అని భయపడే ఈ రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ కంటెంట్‌తో గానం వచ్చిందని చెప్పవచ్చు. కేవలం రెండు పాత్రలతో దర్శకుడు కథను ఇంట్రెస్టింగ్‌గా చెప్పడం ఈ వెబ్ సిరీస్‌కు పాజిటివ్ అంశం. కథలో వైవిధ్యం లేకపోయినా.. కథనంలో, పాత్రల మధ్య కెమిస్ట్రీ సరికొత్తగా అనిపిస్తుంది. కేరళలో శ్రావ్య ఓ ఇంటి చుట్టు తిరగడం సీన్‌ను డీల్ చేసిన విధానం కథను ఎమోషనల్‌గా మార్చిందని చెప్పవచ్చు.

దేత్తడి హారిక పెర్ఫార్మెన్స్
ఇప్పటి వరకు బిగ్‌బాస్ ఫేమ్‌గా అందరికి సుపరిచితమైన దేత్తడి హారిక.. ఇటీవల కాలంలో చిన్న చితక పాత్రలకే పరిమితమైంది. కానీ గానం వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఫుల్ లెంగ్త్ పాత్రలో ఒదిగిపోయింది. ఎమోషనల్ పాత్రలో సహజమైన నటనను ప్రదర్శించింది. వెబ్ సిరీస్ భారాన్ని తన భుజాల మీద మోయడమే కాకుండా ప్రేక్షకులను తన ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. కీలక సన్నివేశాల్లో ఎమోషనల్‌గా నటించిన తీరు బాగుంది.

సిద్దుగా భరత్ బండారు
ఇక సిద్దుగా భరత్ బండారు యాక్టింగ్ చాలా నేచురల్‌గా ఉంది. పాత్రలో నటించడం కంటే సిద్దూగా బిహేవ్ చేశారని చెప్పవచ్చు. తన లవ్ గురించి శ్రావ్యకు చెప్పే సీన్లు భావోద్వేగంతో సాగాయి. భరత్‌లోని ఈజ్ కారణంగా దేత్తడి హారిక రోల్ కూడా చాలా బాగా ఎలివేట్ అయింది.

సాంకేతిక విభాగాల పనితీరు..
సాంకేతిక విభాగాల విషయాలకు వస్తే.. తమడా మీడియా ప్రోడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. పాటల ఆధారంగా కథ సాగడం బాగుంది. సినిమాటోగ్రఫి వెబ్ సిరీస్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మిగితా విభాగాలు పనితీరు ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి. ఓవరాల్‌గా టెక్నికల్ అంశాలు గానం వెబ్ సిరీస్‌ను ఫీల్‌గుడ్‌గా మార్చాయని చెప్పవచ్చు.

ఫైనల్‌గా
గానం: ఏ మ్యూజికల్ టేల్ ఆఫ్ లవ్ వెబ్ సిరీస్.. సెన్సిబుల్ రొమాన్స్, ఎమోషనల్ అంశాలు, లవ్ లాంటి అంశాలు కలబొసిన ఫీల్‌గుడ్ లవ్ స్టోరి అని చెప్పవచ్చు. హరిక, భరత్ ఫెర్ఫార్మెన్స్, పాటలు, కేరళ అందాలు ఈ వెబ్ సీరిస్ చూడాలనిపించేలా చేస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా డిస్నీ+హాట్ స్టార్‌లో హ్యాపీగా చూసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











