Deva Movie Review: దేవా మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. పూజా హెగ్డే హిట్టు కొట్టిందా?

Rating: 2.75/5

నటీనటులు: షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పవైల్ గులాటీ, పర్వేష్ రానా తదితరులు
దర్శకత్వం: రోషన్ అండ్రూస్
నిర్మాత: సిద్దార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ భన్సల్
సినిమాటోగ్రఫి: అమిత్ రాయ్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
పాటలు: విశాల్ మిశ్రా, జేక్స్ బిజోయ్
బ్యానర్: జీ స్టూడియోస్, రాయ్ కపూర్, ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2025-01-31

దేవ్ (షాహిద్ కపూర్) నిజాయితీపురుడైన పోలీస్ ఆఫీసర్. డ్యూటీ మైండెండ్‌గా ఉంటూ తనదైన యాటిట్యూడ్‌తో కనిపిస్తాడు. అయితే ఓ కేసు మిస్టరీని ఛేదించానని సంతోషంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆ యాక్సిడెంట్‌లో గతం మరిచిపోతాడు. దాంతో కీలకమైన కేసు పరిస్థితి సందిగ్ధంలో పడుతుంది.

Deva Movie Review

ముంబైలో కీలకంగా మారిన కేసు ఏమిటి? దేవ్ ఛేదించిన కేసు మిస్టరీ ఏమిటి? దేవ్‌ గతం మరిచిపోవడంతో కేసు విచారణలో ఏం జరిగింది? డీసీపీ ఫర్హాన్ ఖాన్ (పర్వేష్ రానా) పరిస్థితి ఏమిటి? ఏసీపీ రోషన్ డీ సిల్వా (పవైల్ గులాటీ) ఏం చేశాడు. జర్నలిస్టు దివ్య సతాయే (పూజా హెగ్డే)కు దేవ్ ఉన్న సంబంధం ఏమిటి? దేవ్ గతం మరిచిపోవడంతో దివ్య ఏం చేసింది? గతం మరిచిపోవడానికి ముందు.. ఆ తర్వాత దేవ్ జీవితం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దేవ్ సినిమా కథ.

ముంబైలో ఓ టన్నెల్‌లో దేవ్ యాక్సిడెంట్‌కు గురి కావడంతో అసలు కథ మొదలవుతుంది. దర్శకుడు రోషన్ ఎలాంటి సమయం తీసుకోకుండా కథలోకి వెళ్లి డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. తక్కువ సమయంలోనే దేవ్ క్యారెక్టర్‌ ఏమిటో చెప్పి.. చుట్టు ఉన్న పాత్రల తీరు తెన్నులను చెప్పి క్యూరియాసిటీని క్రియేట్ చేయడం సినిమాకు పాజిటివ్ పాయింట్ మాత్రమే కాకుండా ఆడియెన్‌ను కథకు కనెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడిందనే చెప్పాలి.

ఇక కథలో రోషన్ డి సిల్వా, ఫర్హాన్ ఖాన్ పాత్రలను బలంగా డిజైన్ చేయడంతో కథ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. దేవ్ ప్రియురాలిగా పూజా హెగ్డే డిఫరెంట్ క్యారెక్టర్‌తో అలరించే ప్రయత్నం చేస్తుంది. దేవ్ చేతలను, చట్టాన్ని చేతులోకి తీసుకొనే విషయాలను ప్రశ్నించే పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో దేవా క్యారెక్టర్ తీరుతో సినిమా చాలా ఇంటెన్సివ్‌గా మలచడానికి దర్శకుడు చూపిన చొరవ బాగుంది.

దేవాగా షాహిద్ కపూర్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కినిపంచాడు. యాక్సిడెంట్‌కు ముందు.. ప్రమాదానికి తర్వాత జరిగే సన్నివేశాల్లో డిఫరెంట్ లుక్, మేనరిజంతో ఆకట్టుకొన్నాడు. దేవాకు ప్రేయసిగా పూజా హెగ్డే ఫర్వాలేదనే పాత్రలో మెప్పించింది. ఇతర పాత్రల్లో నటించిన వారాంత ఫర్వాలేదనిపించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ బాగుంది. బీజఎం సన్నివేశాలను హైలెట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ఈ సినిమా ప్లస్ పాయింట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

దర్శకుడు రోషన్ అండ్రూస్ రూపొందించిన దేవా చిత్రం రెగ్యులర్ మసాలా, యాక్షన్ సినిమా కాదు. ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్. షాహిద్ యాక్టింగ్, పూజా హెగ్డే గ్లామర్, మేకింగ్ అంశాలు ఈ సినిమాను నచ్చేలా చేస్తాయి. సాగదీత, స్క్రీన్ ప్లే, స్లో నరేషన్ అంశాలు కొంత మేరకు ఈ సినిమాకు వెనక్కి లాగే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

More from Filmibeat

Read more about: deva pooja hegde shahid kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X