Devagudi Movie Review: దేవగుడి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రఘు కుంచె, అన్నపూర్ణమ్మ, రాకెట్ రాఘవ, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, అభినవ్ శౌర్య, తోషి అలహరి, అనుశ్రీ తదితరులు
కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: బెల్లం రామకృష్ణారెడ్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ రెడ్డి అబ్బవరం
సమర్పణ: బెల్లం సుధారెడ్డి
సినిమాటోగ్రఫి: లక్ష్మీకాంత్ కనికే
మ్యూజిక్: మదీన్ ఎస్‌కే
ఎడిటర్: నాగిరెడ్డి వీ
ఫైట్స్: స్టంట్ శివ
బ్యానర్: పుష్యమ్ ఫిల్మ్ మేకర్స్
రిలీజ్ డేట్: 2026-01-30
రాయలసీమలోని దేవగుడి ప్రాంతంలో ఫ్యాక్షనిస్ట్ వీరా రెడ్డి (రఘు కుంచె)ను అక్కడి ప్రజలు దేవుడిలా చూస్తుంటారు. ఆయనకు రాఘవ రెడ్డి (నరసింహ), శ్వేతారెడ్డి (అనుశ్రీ) సంతానం ఉంటారు. వారికి ధర్మ (అభినవ్ శౌర్య) అనే ఫ్రెండ్ ఉంటాడు. వీరారెడ్డి ఫ్యామిలీకి ధర్మ నమ్మిన బంటులా ఉంటాడు. వీరారెడ్డి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డువేయడానికి ధర్మ వెనుకాడడు. అలాంటి యువకుడిని నమ్మక ద్రోహం చేశాడనే కారణంతో మట్టుబెట్టాలని చూస్తారు. కానీ శ్వేతారెడ్డి ఆ ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ధర్మ దేవగుడి గ్రామం నుంచి పారిపోతాడు.
వీరారెడ్డి ఫ్యాక్షన్ వ్యవహారాలతో దేవగుడిని వీరారెడ్డి ఎలా శాసించాడు? వీరారెడ్డి కూతురు, కొడుకుతో ధర్మ స్నేహం ఎలా కొనసాగింది? వీరారెడ్డి కుటుంబాన్ని ధర్మ కంటికి రెప్పలా ఎలా చూసుకొంటాడు? నమ్మినబంటులా ఉండే ధర్మ.. వీరారెడ్డి ఫ్యామిలీకి చేసిన నమ్మక ద్రోహం ఏమిటి? ధర్మను చంపడానికి చేసిన ప్రయత్నాలను శ్వేతారెడ్డి ఎందుకు అడ్డుకొన్నది? కూతురు శ్వేత వ్యవహారశైలిపై వీరారెడ్డి రియాక్షన్ ఏమిటి? చివరకు ధర్మపై వీరారెడ్డి వర్గం ప్రతీకారం తీర్చుకొన్నదా? తన ప్రాణ స్నేహితుడు ధర్మను రాఘవరెడ్డి కాపాడుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

దేవగుడి సినిమా కథ విషయానికి వస్తే.. ఫ్యాక్షన్, లవ్, ఫ్రెండ్‌షిప్, కుల వివక్ష లాంటి అంశాలతో రూపొందించిన రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన యాక్షన్, ఎమోషనల్ డ్రామా. ఈ సినిమా స్టోరిలో కొత్తదనం పెద్దగా కనిపించదు కానీ.. దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని.. ఫిక్షన్ అంశాలను కొంత జోడించి మాస్ మసాల కమర్షియల్ మూవీగా తెరకెక్కించే ప్రయత్నంలో సఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే, ట్రీట్‌మెంట్ బాగుంటుంది. కాకపోతే కథ విషయంలో కొంత కొత్తదనాన్ని జోడించి.. డిఫరెంట్‌గా ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేసి ఉంటే.. తెలుగు సినిమాలో మరో మంచి ఫ్యాక్షన్ లవ్ స్టోరి అయి ఉండేదనే ఫీలింగ్ కలుగుతంది. పాత కథే అయినా నావెల్టీగా చెప్పడంలో దర్శకుడు తన టాలెంట్‌ను చూపించాడు. నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న విధానం బాగుంది.
ఇక సినిమా భారాన్ని మోసిందంతా వీరారెడ్డి పాత్రలో రఘు కుంచె. మరోసారి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను, అలాగే తన పిల్లలను ప్రాణంలా చూసుకొనే తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. వీర, రౌద్ర రసాలను పలికించే ప్రయత్నం చేశారు. అభినవ్ శౌర్య, నరసింహ, అనుశ్రీ కొత్త వారైనా అనుభవం ఉన్న యాక్టర్లుగా తమ వంతు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అనుశ్రీ లవ్ సీన్లలోను, రొమాంటిక్ సీన్లలో సహజంగా నటించింది. లక్ష్మన్, రఘుబాబు, రాకెట్ రాఘవ, ఇమ్మాన్యుయేల్ పాత్రలు కామెడీతో అలరించాయి.
యాక్షన్, లవ్, రొమాంటిక్‌గా సాగే ఈ సినిమాలోని సన్నివేశాలను లక్ష్మీకాంత్ కనికే చాలా నేచురల్‌గా చిత్రీకరించారు. రాయలసీమ వాతావరణాన్ని బాగా చూపించే ప్రయత్నం చేశారు. మదీన్ మ్యూజిక్ కూడా సీన్లను ఎలివేట్ చచేసింది. నాగిరెడ్డి ఎడిటింగ్ కారణంగా మూవీ పరుగులు పెట్టింది. అయితే పస్టాఫ్‌లో కొన్ని, సెకండాఫ్‌లో కొన్ని సీన్లను ట్రిమ్ చేసి ఉంటే ఇంకా కొంత ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ పెరిగి ఉండేది. పుష్పమ్ ఫిల్మ్స్ మేకర్స్, బెల్లం సుధారెడ్డి, ప్రవీణ్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
దేవగుడి సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. రాయలసీమ నేటివిటిని చెప్పే రూటెడ్ రూరల్ డ్రామా. యాక్షన్, రివెంజ్, లవ్ లాంటి అంశాలు రెగ్యులర్ అయినప్పటికీ.. కథ చెప్పే విషయంలో నిజాయితీ కనిపిస్తుంది. నేల విడిచి సాము చేయకుండా సహజంగా కథను చెప్పడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఫ్యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. వారాంతంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ సినిమాలను చూడాలనిపిస్తే ఈ సినిమాను థియేటర్‌లో చూసేయ వచ్చు.


Click it and Unblock the Notifications











