దేవకీ నందన వాసుదేవ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

నటీనటులు: అశోక్ గల్లా, మానస వారణాసి, ఆదిపురుష్ ఫేమ్ దేవదత్త నాగే, ఝాన్సీ, దేవయాని, శత్రు, గెటప్ శ్రీను
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకుడు: అర్జున్ జంధ్యాల
నిర్మాతలు: సోమినేని బాలకృష్ణ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: తమ్మిరాజు
బ్యానర్: శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 22/11/2024

ఈ కథ పురాణాల నుంచి కొన్ని పాత్రలను, థీమ్ ని ఆధారంగా చేసుకొని సెటప్ చేయబడింది. కంసరాజు(దేవదత్త నాగ్) మహా క్రూరుడు తనకి ఎవరు ఎదురెళ్ళినా, వెళ్లాలనే ఆలోచన వచ్చినా కూడా వారికి చివరికి మిగిలేది మరణమే. అలాంటి వాడికి ఓ రోజు కాశీలో మరణగండం అది కూడా అతని సొంత చెల్లెలు మూడో సంతానం వల్ల కలిగే బిడ్డ మూలాన జరుగుతుంది అని చెబుతాడు. అంతే దీనితో కోపంతో ముందు తన చెల్లెలి భర్తని క్రూరంగా చంపేస్తాడు.

devaki nandana vasudeva review in telugu boring family drama sinks

దీనితో తన చెల్లెలి భర్తకి తమ్ముడు.. కంసరాజుపై పెట్టిన పోలీసు కేసుతో 21 ఏళ్ళు తాను జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ 21 ఏళ్ల గ్యాప్ లో తనని చంపే మూడో సంతానం పుడుతుందా? అది ఏ రూపంలో ఉంటుంది. ఈ సమయంలో సత్య (మానస వారణాసి) ఎవరు? తనతో కృష్ణ(అశోక్ గల్లా) ప్రేమలో ఎలా పడతాడు? జైల్లో నుంచి బయటకి వచ్చిన కంసరాజుకి కృష్ణ దగ్గరవుతాడు. కంసరాజుకి కృష్ణకి ఏమన్నా సంబంధం ఉంటుందా? కంసరాజు చెల్లెలు దాచిన రహస్యం ఏంటి? చివరికి కంసరాజు మరణిస్తాడా లేదా? అనేవి సినిమాలో అసలు కథ.

ఇటీవల టాలీవుడ్ సహా సౌత్ నుంచి వస్తున్న మైథలాజి టచ్ ఉన్న చిత్రాలకి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూస్తున్నాం. ఈ దేవకీ నందన వాసుదేవ కూడా ఇదే కోణంలో అది కూడా సెన్సేషనల్ హిట్ హను మాన్ ని అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథతో వచ్చింది. అయితే ఇది మాత్రం ఆ మిగతా సినిమాల తరహాలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు.

devaki nandana vasudeva review in telugu boring family drama sinks

ట్రైలర్ లో చూపినట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ స్టార్ సినిమాలో కూడా మొదలవుతుంది. దీనితో ఆడియెన్స్‌ లోనూ చూడాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. కానీ మెల్లగా సినిమాలో ప్రొసీడింగ్స్ చూస్తూ ఉంటే మాత్రం నీరసం రాక మానదు. సినిమాలో నడుస్తున్న కథనం కారణంగా కొన్ని సీన్స్ ఓవర్ డ్రమాటిక్ గా చాలా అవుట్ డేటెడ్ గా కనిపిస్తాయి. వీటితో సినిమా చూస్తున్నంతసేపు పరమ బోరింగ్ ఫ్లిక్ చూస్తున్న అనుభూతి కలుగక మానదు. అయితే ఈ తరహా సినిమాలో మరీ అన్నీ బోరింగ్ ఎలిమెంట్సేనా అంటే కొన్ని ట్విస్ట్ లు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ బ్లాక్ బాగా అనిపిస్తాయి.

సినిమాలో నటీనటుల ఎంపిక, కొందరి ఓవర్ యాక్షన్ లు అయితే అసలేం సినిమా తీశారు అనిపిస్తుంది. యువ హీరోలు మాస్ ఇమేజ్ కోసం తమకి మించిన రోల్స్ చేసినట్టుగా కూడా అశోక్ గల్లా పాత్ర చూస్తే అనిపిస్తుంది. సినిమాలో ఓవర్ డైలాగులు అనవసరం అనిపిస్తాయి. లైన్ లో మాత్రమే పస ఉంది కానీ కథనం నడిపిన తీరు మాత్రం దారుణంగా అనిపిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహించాల్సింది. ఇంకా సినిమాలో లవ్ ట్రాక్ అలాగే ఎమోషన్స్ కూడా అసలు వర్కౌట్ కావు. ఒక మూస ధోరణిలో పాత చింతకాయ పచ్చడి సినిమా చూస్తున్న భావన ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆడియెన్స్ మైండ్ లో రన్ అవుతుంది.

నటీనటుల విషయానికి వస్తే.. 'హీరో' అనే సినిమాలో డీసెంట్ ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా అందులో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపించాడు. ఈ సినిమాలో పూర్తిగా మాస్ హీరో అయ్యిపోవాలి అని చేసే ప్రయత్నం మాత్రం సరిగ్గా సాగలేదు. తన లుక్స్ వరకు బాగున్నాయి. కానీ తనపై ఫైట్ సీన్స్ లాంటివి చాలా ఓవర్ గా అనిపిస్తాయి. ఓ పెద్ద బల్క్ బాడీ ఉన్న హీరోలు చేయాల్సిన ఫైట్స్ ని తనతో చేయించినట్టు అనిపిస్తుంది.

devaki nandana vasudeva review in telugu boring family drama sinks

హీరోయిన్ మానస వారణాసి తన రోల్ లో హోమ్లీ లుక్స్ లో కనిపిస్తుంది. తన నటన పర్వాలేదు కానీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఇక వీరితో పాటుగా ఆదిపురుష్ సినిమాలో హనుమంతుని రోల్ చేసిన బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే మాత్రం విలన్ గా అదరగొడతారు. ఆదిపురుష్ లో ఎంతో సౌమ్యంగా, గంభీరంగా కనిపించిన తాను ఈ సినిమాలో విలన్ గా అత్యంత క్రూరంగా విలనిజాన్ని ఉట్టి పడేలా చూపించారు. తనకి ఈ తరహా విలన్ రోల్స్ పడితే ఇంకా బాగుంటుంది ఏమో. ఇక వీరు మినహా ఝాన్సీ, దేవయాని తమ పాత్రల్లో బాగానే చేశారు. గెటప్ శ్రీను, శత్రులు నవ్విస్తారు.

సాంకేతిక వర్గానికి వస్తే .. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకి ఎలానో ఖర్చు ఉంటుంది. కాగా ఈ చిత్రానికి కూడా మేకర్స్ పెట్టిన ఖర్చు విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో వి ఎఫ్ ఎక్స్ ఇంకా నాచురల్ గా ఉండాల్సింది. అలాగే సినిమాటోగ్రఫీలో ఒక మాస్ చిత్రానికి కావాల్సిన విజువల్స్ ని అందించారు. భీమ్స్ సంగీతం పర్వాలేదు ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ఎడిటింగ్ వర్క్ లో చెప్పడానికి ఏమి లేదు. చాలా వరకు పనికిరాని బోరింగ్ సన్నివేశాలే ఉన్నాయి . సో తాను ఎన్ని కటింగులు వేసినా ఈ సినిమాని కాపాడడం కొంచెం కష్టమే. సోమినేని రామకృష్ణ నిర్మాణం వహించారు. తన ఖర్చు సినిమాలో కనిపిస్తుంది కానీ ఆ ఖర్చుకి సరైన ఫలితాన్ని అందుకోవడంలో మిస్ ఫైర్ అయ్యింది.

ఇక ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే.. రెండో సినిమాకే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చాలా మందికి ఉండొచ్చు. కానీ ఆ మాస్ ని వెతుక్కుంటూ వెళ్లే ప్రయాణంలో అశోక్ గల్లా నటుడుగా పర్వాలేదు కానీ ఇంకా కష్టపడాల్సి ఉంది. సినిమా థీమ్ ఒకే అనిపిస్తుంది. అలాగే కొన్ని ట్విస్ట్ లు ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ మైథలాజి టచ్ కొంచెం బాగా అనిపిస్తాయి. కానీ సినిమా తెరకెక్కించే విధానంలో అస్సలు పస లేదు. చాలా బోరింగ్ ట్రీట్మెంట్ తో ఒక అవుట్ డేటెడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ని ఈ "దేవకీ నందన వాసుదేవ" మిగులుస్తుంది. సో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి అంత రుచించదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X