Devara First Review: దేవర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ అధిగమిస్తాడా?

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఏదైనా ఉంది అంటే "దేవర" అనే చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత మాస్ ఆడియెన్స్ లో కూడా గట్టి అంచనాలు సెట్ చేసుకున్న సినిమా కూడా ఇదే.. కాగా ఈ సినిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ చేస్తుంది.

కాగా తనతో పాటుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాలో నటించి తాను కూడా తెలుగు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలా ఈ భారీ ప్రాజెక్ట్ మంచి అంచనాలు సెట్ చేసుకొని ఇప్పుడు విడుదలకి రాబోతుంది. కాగా ఈ సినిమా విషయంలో హిట్ అవ్వడానికి ఎన్ని పాజిబులిటీస్ ఉన్నాయో కాకుండా ఉండడానికి కూడా చాలా సెంటిమెంట్స్ అడ్డు పడుతున్నాయి.

devara first review is out now will anirudh sentiment work

కానీ ఇప్పుడు మాత్రం అభిమానుల్లో దేవర ఫస్ట్ రివ్యూతో ఒక్కసారిగా నమ్మకం వచ్చేసింది. కాగా ఆ రివ్యూ ఎవరి నుంచో కాదు మ్యూజిక్ సెన్సేసన్ అనిరుద్ రవిచందర్ నుంచి వచ్చిన పోస్ట్ తో అయితే దేవర తో హిట్ కొట్టేసినట్టే అని తారక్ అభిమానులు బ్లైండ్ గా ఫిక్స్ అయ్యిపోయారు. కాగా అనిరుద్ ఇప్పుడు దేవరకి పెట్టినట్టుగానే రిలీజ్ కి ముందు పోస్ట్ చేసిన సినిమాలు అన్నీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత చూపించాయి.

మరి అనిరుద్ చివరి సరిగా సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్" కి షారుఖ్ ఖాన్ తో చేసిన భారీ చిత్రం "జవాన్" కి అలాగే గత ఏడాదిలోనే వచ్చిన విజయ్ దళపతి సినిమా "లియో" ఈ మూడింటికి కూడా అనిరుద్ తన మార్క్ ట్వీట్స్ హిట్ కోటేసినట్టుగా ఒక ఛాంపియన్ ట్రోఫీలు పెడుతూ ఉంటాడు. ఇలా పెట్టిన అన్ని సినిమాలు ఆ హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

devara first review is out now will anirudh sentiment work

ఇంకా ఇంట్రెస్టింగ్ గా తాను పెట్టని సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమానే కమల్ హాసన్ శంకర్ ల కాంబినేషన్ లో చేసిన "ఇండియన్ 2" ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించినప్పటికీ తాను ఇలాంటి ఒక పోస్ట్ ని కాన్ఫిడెన్స్ గా పెట్టలేదు. కానీ పెట్టిన అన్నీ భారీ హిట్స్ అయ్యాయి. సో అనిరుద్ పై ఈ సెంటిమెంట్ ప్రకారం తన మొట్ట మొదటి రివ్యూ జవాన్, లియో, జైలర్ కి ఇచ్చిన మాదిరి గానే దేవర కి కూడా పెట్టాడు.

అంటే ఈ సినిమా కూడా బిగ్ హిట్ కాబోతుంది అని తెలుగు ఆడియెన్స్ సహా తమిళ ఆడియెన్స్ కూడా అనిరుద్ జోస్యాన్ని, తన ఫస్ట్ రివ్యూ ని గట్టిగా నమ్ముతున్నారు. దీనితో దేవర ఫస్ట్ ఎవర్ రివ్యూ అంటూ సౌత్ ఫ్యాన్స్ లో దేవర రిజల్ట్ వైరల్ గా మారిపోయింది. మరి అనిరుద్ జోస్యం కానీ మరోమారు నిజం అయితే మాత్రం ఇక తన నుంచి నెక్స్ట్ ఇలాంటి పోస్టులు పడితే కళ్ళు మూసుకొని జనం ఆ సినిమాకి వెళ్ళిపోతారు అని చెప్పొచ్చు.

More from Filmibeat

Read more about: devara janhvi kapoor jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X