Devara Movie review దేవర మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ తదితరులు
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: నందమూరి కల్యాణ్ రామ్
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్రఫి: రత్నవేలు
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2024-09-2024

ఎర్ర సముద్రం తీరాన దట్టమైన అడవిలోని కొండ ప్రాంతంలో దేవర (జూనియర్ ఎన్టీఆర్) భైరా (సైఫ్ ఆలీ ఖాన్) తన స్నేహితులు (శ్రీకాంత్, చాకో) కలిసి సముద్రంలో వేటకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే వారి జీవితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం చూసి మురగ (మురశీ శర్మ) వారికి భారీగా డబ్బు వచ్చేలా పని ఇస్తుంటాడు. అయితే సముద్రంలో అధికారుల కళ్లు గప్పి సరుకును ఈ గ్యాంగ్‌ తరలిస్తుంటుంది. అయితే మురుగ ఇచ్చే పని కోసం సముద్రం పైకి వెళ్ల కూడదని దేవర ఆంక్షలు విధిస్తాడు. దాంతో దేవరను మట్టు పెట్టడానికి భైర ప్లాన్ వేస్తాడు. ఆ విషయం తెలిసిన దేవర ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకొంటాడు.

Devara Movie review

సముద్రంపై వేటకు వెళ్లకూడదనే ఆంక్షల్ని దేవర ఎందుకు విధించాడు? ప్రాణ స్నేహితులుగా ఉండే దేవరను భైరా తన స్నేహితులతో కలిసి ఎందుకు చంపాలనుకొన్నాడు? తనపై జరిగిన కుట్రను తెలుసుకొన్న దేవర ఎవరికి చెప్పకుండా సముద్రంపైకి వెళ్లాడు? భైరా గ్యాంగ్‌కు భయం ఎందుకు చూపించాలని అనుకొన్నాడు. దేవర కుమారుడు (వర) పిరికి వాడిగా ఎందుకు మారాడు? వరతో తంగం (జాన్వీ కపూర్) ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు దేవర తిరిగి వచ్చాడా? నాలుగు గ్రామాల కోసం వర ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే దేవర సినిమా కథ.

ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచులు జరిగే స్టేడియాలపై బాంబు దాడి చేసేందుకు యతి మాఫియా ప్లాన్ చేస్తుంది. దాంతో రా అధికారులు (అజయ్ టీమ్) యతి కోసం వేట ప్రారంభించి..తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులోని రత్నగిరి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ యతి కోసం వెతుకుతుంటే.. ముందు మీరు దేవర గురించి తెలుసుకోవాలంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే కథతో మూవీ ఎమోషనల్‌గా మారుతుంది. సైఫ్‌తో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లు పవర్‌ఫుల్‌గా ఉండటంతో మూవీ ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఓ భారీ ట్విస్టుతో ఫస్టాఫ్ ముగించడం బాగుంది.

ఇక సెకండాఫ్‌లో దేవర కనిపించకుండా పోయాక.. ఆయన కుమారుడు వర, తంగం మధ్య లవ్ ట్రాక్, కొన్ని యాక్షన్ సీన్లతో కొరటాల శివ కథను నడిపించిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరిని, సన్నివేశాల్లో ట్విస్టులను జొప్పించిన విధానం ఓ రేంజ్‌లో ఉంది. దేవరకు సంబంధించిన ఓ ట్విస్టు బాహుబలి రేంజ్‌లో ప్లాన్ చేయడం ఫ్యాన్స్‌కు హై ఇచ్చే మూమెంట్స్‌గా ఓ కొత్త అనుభూతిని పంచుతుంది.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించారు. ఎమోషనల్ సీన్లలో యంగ్ టైగర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫైట్స్, రొమాంటిక్ సీన్లలో జాన్వీ కపూర్‌తో కలిసి ఫ్యాన్స్‌ను కేక పెట్టించే ప్రయత్నం చేశాడు. జాన్వీ కపూర్ ఉన్నంత సేపు తన గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. సైఫ్ ఆలీ ఖాన్ చాలా కొత్త విలనిజం పండించాడు. శ్రీకాంత్, అజయ్, ప్రకాశ్ రాజ్, జాన్వీ కపూర్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

Devara Movie review

దేవర సినిమాకు అత్యంత బలం.. అనిరుధ్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫి. ఈ రెండు విభాగాలు సినిమాకు ఓ రేంజ్‌ను తీసుకొచ్చాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశాయనే చేశాయని చెప్పవచ్చు. సముద్ర తీరం.. అలాగే కొండలు, అటవీ ప్రాంతాన్ని రత్నవేలు చక్కగా కెమెరాల బంధించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

దేవర సినిమా విషయానికి వస్తే.. ఎమోషనల్, పవర్‌ఫుల్ పాత్రలతో నడిచే ఓ డిఫరెంట్ జానర్‌ మూవీ. 6 ఏళ్ల తర్వాత సోలోగా వచ్చి అభిమానులకు పండగ వాతావరణం కల్పించే విధంగా ఎన్టీఆర్ సినిమా ఉంది. జాన్వీ కపూర్ కోసం వెళ్లే ఫ్యాన్స్‌కు, సగటు సినిమా అభిమానులకు కొంత నిరాశే ఉంటుంది. కథ కంటే.. కథనం బాగుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌‌లో కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించారు. రెండు పార్టులుగా చేయడం వల్ల కొంత సాగదీశారనిపిస్తుంది. ఓవరాల్‌గా పక్కాగా ఇది ఫ్యాన్ప్‌ మెచ్చే చిత్రం. ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా దేవర మారడం ఖాయం.

More from Filmibeat

Read more about: jr ntr janhvi kapoor devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X