Devara Twitter Review: దేవర ట్విట్టర్ రివ్యూ.. కొరటాల, ఎన్టీఆర్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేనా?

ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఆరేళ్ల తర్వాత సోలో మూవీగా రిలీజ్ అవుతున్నది. జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ రూపొందించిన సినిమా కావడంలో అన్ని వర్గాల దృష్టి ఈ మూవీపై పడింది. ఈ సినిమా గురించి నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వెల్లడిస్తున్న అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

దేవరను రెండు పార్టులుగా తీయాల్సిన గొప్ప స్టోరీనా? కొరటాల గారు.. సెకండాఫ్‌లో స్టోరి ఏమైనా ఉందా? దేవర సినిమా ఎక్కువగా ఊహించుకొని వెళితే నిరాశ పడొచ్చు. అనిరుధ్ బీజీఎం వల్ల సినిమా సేవ్ అవుతుంది. కొరటాల శివ గొప్పగా తీయలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

దేవర సినిమా చూశాను. సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బాగుంది. దేవర క్యారెక్టర్ కంటే వర క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ బాగున్నాడు. కథలో గొప్పగా అబ్బురపరిచే ట్విస్టులు ఏమి లేదు. కథ చాలా ఫ్లాట్‌గా సాగుతుంది. వీఎఫ్ఎక్స్ బాగాలేవు. సెకండ్ పార్ట్ కోసం డిజైన్ ట్విస్ట్ అంతగా ఇంప్రెసివ్‌గా లేదు. 6 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ఫ్యాన్స్‌కు జోష్ కలిగించే సినిమా ఇది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

దేవర సినిమా చూశాను. పవర్‌ఫుల్‌గా బాగుంది. ఈ సినిమా స్కేల్ చాలా పెద్దగా ఉంటుంది. యాక్షన్ సీన్లు బాగున్నాయి. డ్యాన్స్, ఫైట్స్ కొరియోగ్రఫి సూపర్‌గా ఉన్నాయి. ఎన్టీఆర్ వల్లే ఈ సినిమాకు బలం వచ్చింది.

దేవర సినిమా చూశాను. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ టాప్ రేంజ్‌లో ఉన్నాయి. ఎన్టీఆర్ పవర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. సౌత్ ఇండియాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మరోసారి చూడాలని ఎదురు చూస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధూ ఈ సినిమా గురించి రివ్యూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ గురించి, జాన్వీ కపూర్ గ్లామర్, సైఫ్ ఖాన్ విలనిజం గురించి కామెంట్స్ చేశారు. ఉమేర్ సంధూ రివ్యూ గురించి ఈ లింక్ క్లిక్ చేయిండి..

Devara Twitter Review  Will Jr NTR  Koratala Siva do magic at Box Office

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గతంలో ఎన్నో సినిమాలకు తన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేవర విషయంలో బిగ్ హిట్ కాబోతుంది అని తెలుగు ఆడియెన్స్ సహా తమిళ ఆడియెన్స్ కూడా అనిరుద్ జోస్యాన్ని, తన ఫస్ట్ రివ్యూ ని గట్టిగా నమ్ముతున్నారు. అనిరుధ్ చెబుతున్న రివ్యూ విషయంలోకి వెళితే..

ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ బియాండ్ ఫెస్ట్‌లో దేవర సినిమాతోపాటు ఆయన సర్‌ప్రైజింగ్ దర్శనమిచ్చారు. ఈ సినిమాను లాస్ ఎంజెలెస్‌లోని ఈజిప్టియన్ థియేటర్‌లో సెప్టెంబర్ 6.30 గంటలకు ప్రదర్శించనున్నారు. ఈ సినిమా 27వతేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు.

నిర్మాత నాగవంశీ ట్వీట్ చేస్తూ.. తారక్ అన్నా చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్‌తో వస్తున్నారు. మంచి కంటెంట్ ఇవ్వడానికి ఆయన తన వంతు పాత్రను సమర్ధవంతంగా పూర్తి చేశారు. మా వంతు ప్రయత్నంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీరు కూడా బాధ్యతగా ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి ఫ్యాన్ వార్ క్రియేట్ చేయకండి అంటూ ట్విట్టర్ ద్వారా మెసేజ్ ఇచ్చారు.

సముద్రాలు ఇక నీలం రంగులో ఉండవు. భయంతో ఎరుపెక్కడం ఖాయం. ఈ సినిమా ర్యాంపేజ్‌కు ఆకాశమే ఓ హద్దు అని యువసుధ ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

More from Filmibeat

Read more about: devara jr ntr janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X