శ్రీకాంత్ ‘దేవరాయ’ మూవీ రివ్యూ

By Bojja Kumar

సంస్థ: నానిగాడి సినిమా
నటీనటులు: శ్రీకాంత్‌, మీనాక్షి దీక్షిత్‌, విదిశ, బాలయ్య, రంగనాథ్‌, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్‌ నారాయణ, జీవా, శివాజీరాజా తదితరులు.
సంగీతం: చక్రి
నిర్మాతలు: నాని కృష్ణ, కిరణ్‌ జక్కంశెట్టి
దర్శకత్వం: నానికృష్ఱ

హిట్ సినిమా అంటే ఏమిటో మరిచి పోయిన హీరో శ్రీకాంత్.... తాజాగా 'దేవరాయ' అనే సోషియో ఫాంటసీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్ర దర్శకుడు నాని కృష్ణ తొలి సినిమానే ప్రమోగత్మకంగా సోషియో ఫాంటసీ నేపథ్యాన్ని ఎంచుకోవడంతోపాటు, నిర్మాత కూడా తనే అయ్యాడు. ఈ సినిమాకు నిర్మాతలు ఎవరూ దొరక్కనే... తనే నిర్మాణ బాధ్యతలు నెత్తినేసుకున్నాడని సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది.

విజయనగర ప్రభువైన శ్రీకృష్ణ దేవరాయలు(శ్రీకాంత్) తన ఆస్తాన నర్తకి(మీనాక్షి దీక్షిత్)పై మోజు పడి ఆమె కోసం ఏదైనా చేయాలనే ప్రయత్నంలో అనుకోకుండా త్రిపురసుందరి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడు. విగ్రహ ప్రతిష్టాపన జరుగక పోతే విజయనగర సామ్రాజ్యం నాశనం అయ్యే ప్రమాదం ఉండటంతో రాయలు ఆత్మార్పణ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేద్దామనే ప్రయత్నం....శత్రువుల దాడి కారణంగా విఫలం అవుతుంది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం అంతం అవ్వడం జరిగిపోతుంది. కొన్ని శతాబ్దాల తర్వాత రాయల ఆత్మ అమలాపురంలో అల్లరి చిల్లరగా తిరగే దొరబాబు(శ్రీకాంత్)ను ఆవహిస్తుంది. మరి ఎప్పుడో శతాబ్దాల క్రితం నాటి రాయల వారికి, అల్లరి చిల్లరగా తిరిగే దొరబాబుకి సంబంధం ఏమిటి అనేది తర్వాత కథ.

దొర బాబు పాత్రలో శ్రీకాంత్ ఓకే కానీ... దేవరాయల పాత్రలో ప్రేక్షకులను మెప్పించ లేక పోయాడు. ముఖ్యంగా రాయల పాత్రలో శ్రీకాంత్ చెప్పే డైలాగులు, హావ భావాలు నేచురల్ గా లేవు. ఇద్దరు హీరోయిన్లు కేవల అందాల ఆరబోతకే పరిమితం అయ్యారు. శివాజీ రాజా, రంగనాథ్ తదితరులు ఉన్నా వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. వారితో చేయించిన సినిమాలు కూడా పర్ ఫెక్ట్ చేయించ లేక పోయాడు దర్శకుడు.

టెక్నికల్ గా చూస్తే కేవలం ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్, ఫోటోగ్రఫీ బాగుంది. చక్రి అందించిన సంగీతం పేలవంగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోరు కూడా సినిమాకు మనస్ మారింది. ఇక ఈ సినిమాకు మాటల విషయంలో దర్శకుడు పూర్తిగా శ్రద్ధ తీసుకోలేదని ఇట్టే అర్థం అవుతుంది. ఈ తరం కథతో సాగే దొరబాబు ట్రాక్‌ డైలాగులు ఎలా రాసిన సెట్టవుతాయి. కానీ రాయల పాత్రను ఎంచుకున్నప్పుడు అందుకు తగిన విధంగా, అప్పటి బాషా, పరిస్థితులకు అనుగుణంగా డైలాగులు ఉండాలి.. కానీ ఈ చిత్రంలో రాయల పాత్రకు ఉపయోగించి డైలాగులు ఆ ఫీల్ తేలేక పోయాయి. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా లేదు. మొత్తానికి దర్శకుడు అన్ని విధాలుగా విఫలం అయ్యాడనే చెప్పాలి. మొత్తానికి ఈచిత్రం ద్వారా దర్శకుడిగా, నిర్మాతగా మైనస్ మార్కులు వేసుకున్న నాని కృష్ణ హీరో శ్రీకాంత్ ఖాతాలో తన వంతుగా మరో ప్లాపు జమచేసాడు.

సినిమాకెళ్లేది కేవలం మసాలా సాంగులు, హీరోయిన్ల ఎక్స్ ఫోజింగ్ సీన్లు, నాలుగు ఫైట్లు కోసమే అని ఆలోచించే వారికేమోకానీ.... సగటు ప్రేక్షకుడికి మాత్రం అసంతృప్తి తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X