twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిరుపతి లడ్డూలానే... ('దేవస్థానం' రివ్యూ)

    By Bojja Kumar
    |

    తారాగణం: కె. విశ్వనాథ్, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఆమని, కోవై సరళ, రావు రామేష్, రమణాచారి తదితరులు
    సంగీతం: స్వర వీణాపాణి
    కెమెరా: విఎన్.సురేష్ కుమార్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జనార్ధన్ మహర్షి
    బ్యానర్ సర్వే జనా సుఖినోభవంతు ఫిల్మ్స్
    విడుదల: 13 ఏప్రిల్, 2012

    శ్రీమన్నారాయణ(కె. విశ్వనాథ్) చిత్తూరు నివాసి. పుణాల గురించి బాగా తెలిసిన వ్యక్తి. అయితే అతన్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు. దీంతో ఆ పెద్దాయన దేవస్థానంలోనే కాలం గడుపుతూ ఉంటాడు. దేవాలయానికి వచ్చే భక్తుల ప్రశ్నలను నివృత్తి చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే తన మరణం తర్వాత ఆ భక్తుల సందేహాలు తేర్చే వారి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యమూర్తి(బాలు) దీనికి తగినవాడని భావిస్తాడు. అయితే ఆ జాబ్ చేయడానికి సుబ్రహ్మణ్య మూర్తి నిరాకరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత జీవితం యొక్క పరమార్థం తెలుసుకుని శ్రీమన్నారాయణ దారిలోకి వచ్చి లిరిసిస్ట్ గా మారతాడు సుబ్రహ్మణ్యమూర్తి. ఆధునికతతో ఆయన రాసిన హరికథలు బాగా పాపులర్ అవుతాయి. ఇద్దరు కలిసి వీటిని జనాల్లోకి తీసుకెళ్లి బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో 'సర్వే జనా సుఖినోభవంతు' అనే ట్రస్టును ప్రారంభిస్తారు. పేద పురోహితులకు ఆర్థిక సహాయం, దేవాలయాల పునరుద్ధరణ కోసం వాటిని వాడుతుంటారు. ఈ క్రమంలో అనుకోని సంఘటన ట్రాజెడీకి దారి తీస్తుంది. మరి అదేమిటి? సినిమా ఉద్దేశ్యం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్: కె. విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా నటించారు. వారి నటన ప్రేక్షకుల మనసును టచ్ చేస్తుంది. చాలా కాలం తర్వాత తెరపై కనిపించిన ఆమని మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

    టెక్నికల్: సినిమాటోగ్రఫీ ఓకే కానీ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది. బోరింగ్ సీన్లు లేక పోయినా...అనవసర సీన్లను ఎడిట్ చేయడంలో విఫలం అయ్యారు. సంగీతం యావరేజ్ కానీ వినొచ్చు. దర్శకుడు దర్శకత్వంతో పాటు డైలాగులు, స్ర్కీన్ ప్లే బాధ్యతలు చేపట్టి వాటికి న్యాయం చాశాడు.

    ఫైనల్ వర్డ్: ఈ సినిమా ట్యాగ్ లైన్ 'తిరుపతి లడ్డంత తియ్యని సినిమా'. ఆ ట్యాగ్ లైన్‌కు తగిన విధంగా సినిమా తియ్యగా ఉంది. ప్రాచీన కళారూపాలను పునరుద్దరించుకోవడం, కాపాడుకోవాలి అనే కాన్సెప్టు ఆహ్వానించదగ్గ విషయమే. ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవం కోసం ఈ సినిమా చూడొచ్చు. అయితే కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికి ఈ సినిమా అంతగా మింగుడు పడక పోవచ్చు.

    English summary
    When a film has big star cast like K Viswanath and SP Balasubramaniam, immediately any one can forecast that the film has nothing big to offer but some good message. In addition, the film is being directed by a writer like Janardhana Maharshi. The tagline to the film ‘Tirupati Laddantha Teeyanaina Cinema’ is very apt and watch the film for a soothing experience. Adding to that the thought of reviving the old and traditional art forms is laudable.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X