Devika & Danny Web Series Review: దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

వెబ్ సిరీస్: దేవిక అండ్ డానీ
నటీనటులు: సుబ్బరాజు, కోవై సరళ, శివన్నారాయణ, గోపరాజు రమణ,మౌనిక రెడ్డి, సోనియా సింగ్ తదితరులు
నిర్మాత: సుధాకర్ చాగంటి
మ్యూజిక్ డైరెక్టర్: జయ్ క్రిష్
సినిమాటోగ్రాఫర్: వెంకట్ సీ దిలీప్
ఎడిటర్: కార్తీకేయన్ రోహిణి
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్: జియో హాట్ స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: 2025-06-06

ఓ గ్రామంలోని స్కూల్‌లో దేవిక (రీతూ వర్మ) మ్యూజిక్ టీచర్. పక్క గ్రామానికి చెందిన జగ్గు (సుబ్బరాజు)తో పెళ్లి నిశ్చితార్థం జరుగుతుంది. తొలి చూపులోనే దేవికను ఫుల్లుగా ఇష్టపడిన జగ్గు.. ఆమెను ఎవరూ కూడా కన్నెత్తి చూడకుండా సొంత ఆస్తిలా భావిస్తాడు. అలాంటి సమయంలో దేవీక జీవితంలోకి డానీ (సూర్య వశిష్ట) అనే యువకుడు వస్తాడు. డానీపై దేవీక కూడా మనసు పారేసుకొంటుంది.

Devika  amp amp  Danny Web Series Review

ఎలాంటి పరిస్థితుల్లో జగ్గూని పెళ్లి చేసుకోవడానికి దేవిక ఒప్పుకొంటుంది? జగ్గూ పొసెసివ్ నేచర్ వల్ల దేవికకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? దేవిక జీవితంలోకి వచ్చిన డానీ ఎవరు? డానీ లైఫ్‌లో చోటుచేసుకొన్న సంఘటన ఏంటి? డానీ జీవితానికి చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం ఏమిటి? దేవిక లైఫ్‌లోకి డానీ ఎందుకు వచ్చాడు? జగ్గు, డానీ మధ్య దేవిక లైఫ్ ఎలాంటి ఆటుపోట్లకు గురైంది? అనే ప్రశ్నలకు సమాధానమే దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ కథ.

డైరెక్టర్ బీ కిషోర్ ఎంచుకొన్న, రాసుకొన్న సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులకు టోటల్‌గా కొత్తది కాకపోయినప్పటికీ.. కథను చెప్పిన విధానం, పాత్రలను రాసుకొన్న తీరు, గ్రామీణ వాతావరణం ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. స్టోరీలో ఓ టిస్టు సిరీస్‌ను డ్రైవ్ చేసినప్పటికీ.. కథలో ఏం జరుగబోతుందో ఊహించడం పెద్దగా కష్టం కాదు. కథలోని పాత్రలు నిత్యం మన చుట్టూ తిరిగేలా ఉండటం వల్ల వెబ్ సిరీస్‌కు కనెక్ట్ అయ్యేలా చేయడమే కాకుండా కొంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. దర్శకుడు అతిగా ప్రయోగాలకు వెళ్లకుండా కథలో ఉండే ఎమోషన్స్‌పైనే ఫోకస్ చేయడం పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది.

దేవీకగా రీతూ వర్మకు తనకు తాను నటిగా ప్రూవ్ చేసుకోవడానికి దొరికిన ఛాన్స్‌గా కనిపిస్తుంది. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నారని చెప్పవచ్చు. సిరీస్ భారాన్ని తానే మోసి.. భావోద్వేగాలను పండించారు. డానీగా సూర్య వశిష్ట చాలా ప్రెష్‌గా కనిపించడమే కాకుండా స్టోరిని డ్రైవ్ చేసే పాత్రలో ఒదిగిపోయాడు. శివ కందుకూరి మరోసారి ఆకట్టుకొన్నాడు. మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్ అందించాడు. సుబ్బరాజు విషయానికి వస్తే.. ఆయనకు జగ్గు పాత్ర రొటిన్‌ అయినప్పటికీ.. తన మార్కును చూపించే ప్రయత్నంలో సఫలమయ్యాడు. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. వెంకట్ సీ దిలీప్ సినిమాటోగ్రఫి, జయ్ క్రిష్ మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్‌కు ప్లస్ పాయింట్స్. వెబ్ సిరీస్ అంటే.. రక్తపాతం, మితిమీరిన శృంగారం అనే భయాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను వెంటాడుతున్న సమయంలో చక్కటి పల్లె వాతావరణాన్ని తెర మీద ప్రతిబింంచేలా వెంకట్ సన్నివేశాలను చిత్రీకరించారు. సన్నివేశాలను ఫీల్ గుడ్‌లా మార్చేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. సుధాకర్ చాగంటి అనుసరించిన నిర్మాణ విలువలు, కథల ఎంపిక చూస్తే.. సినిమాపై ఆయనకు ఉండే అభిరుచి తెలియజేస్తుంది.

దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఎలాంటి హంగులు, ఆర్బాటాలు, బూతు డైలాగ్స్, అశ్లీల సన్నివేశాలు లేకుండా సాదాసీదాగా సాగిపోయే ఓ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కూడిన మర్డర్ మిస్టరీ. స్టోరీలో ఊహించని, అదిరిపోయే ట్విస్టులు ఏ మాత్రం ఉండవు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్, టెక్నికల్ అంశాలు ప్లస్ పాయింట్. సాగదీసినట్టు కథను చెప్పడం వల్ల అక్కడక్కడ బోర్ అనిపిస్తుంటుంది. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. లాజిక్స్ వెతుక్కోకుండా సమయం లభించినప్పుడు ఈ వెబ్ సిరీస్‌ను చూసేయండి.

More from Filmibeat

Read more about: ritu varma shiva kandukuri
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X