Devil Review ట్విస్టులతో అదరగొట్టే డెవిల్.. కల్యాణ్ రామ్ డిఫరెంట్ అంటెప్ట్ ఎలా ఉందంటే? డెవిల్ సమీక్ష

Rating: 2.75/5

Recommended Video

Devil Review కళ్యాణ్ రామ్ అనుకున్నది సాధించారు ఇక తమ్ముడు Jr. NTR దేవర..? | Telugu Filmibeat

నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, ఎడ్వార్డ్, ఎల్నాజ్ నరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, సత్య, చక్రపాణి ఆనంద తదితరులు
దర్శకత్వం: అభిషేక్ నామా
నిర్మాత: అభిషేక్ నామా
సినిమాటోగ్రఫి: సౌందర్‌రాజన్
కథ: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్: తమ్మిరాజు
రిలీజ్ డేట్: 2023-12-29

మద్రాస్ ప్రెసిడెన్సీలోని రాసపాడులోని జమీందార్ కూతురు విజయ హత్య జరుగుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్రిటీష్ సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసే సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (నందమూరి కల్యాణ్ రామ్)ను నియమిస్తారు. జమీందార్ ఇంటిలో ఉండే నైషద (సంయుక్త మీనన్) తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆ క్రమంలో ఆ ప్రాంతానికి ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) చీఫ్ నేతాజి సుభాష్ చంద్రబోస్ వస్తున్నట్టు, ఆ మిషన్‌ను బాధ్యతను త్రివర్ణకు అప్పగించినట్టు బ్రిటిష్ ప్రభుత్వానికి కోడ్ సమాచారం అందుతుంది. ఆ కోడ్‌ను డీకోడ్ చేసే బాధ్యతను డెవిల్‌కు అప్పగిస్తారు.

Devil Telugu Cinema Review and Rating: Nandamuri Kalyan Rams Different attempt

జమీందార్ కూతురు విజయను ఎవరు, ఎందుకు హత్య చేశారు? విజయ మర్డర్ మిస్టరీని డెవిల్ సాల్వ్ చేశాడా? నేతాజీ రాకను డీకోడ్ చేయడానికి చేపట్టిన ఆపరేషన్ టైగర్ హంట్ మిషన్‌ను డెవిల్ ఎలా డీల్ చేశాడు? నేతాజీ రాకకు నౌషదకు లింకు ఏమిటి? నేతాజీ సేనలోని మణిమేకల (మాళవిక నాయర్) రోల్ ఏమిటి? నేతాజీ రాక కోసం ఏర్పాట్లు చేస్తూ ఆల్ క్లియర్ అనే సందేశాన్ని త్రివర్ణకు నౌషద చేరవేసిందా? అసలు త్రివర్ణ ఎవరు? ఆపరేషన్ టైగర్ హంట్‌ను డెవిల్, బ్రిటీష్ ప్రభుత్వం అడ్డుకొన్నదా? నేతాజీ సందర్శనకు ఏర్పడిని అడ్డంకులను త్రివర్ణ ఎలా పరిష్కరించారు అనే ప్రశ్నలకు సమాధానమే డెవిల్ సినిమా కథ.

డెవిల్ కథ విషయానికి వస్తే.. విజయ అనే మర్డర్ మిస్టరీ ఆధారంగా స్వాతంత్రోద్యమం చుట్టూ అల్లుకొన్న కథ. మర్డర్ ఇన్సిడెంట్‌తో కథను ఇంట్రస్టింగ్‌గానే మొదలుపెట్టారు. కానీ ఆ మిస్టరీ డ్రామాలో క్యూరియాసిటీ క్రియేట్ చేయలేకపోవడం వల్ల ఫస్టాఫ్.. రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. రకరకాల వేరియేషన్స్‌తో సాగడం వల్ల అసలు కథలోని వెళ్లడానికి దాదాపు సగం సినిమా వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం డిజైన్ చేసిన ట్విస్టుతో ఫస్టాఫ్ ముగియడమే కాకుండా సెకండాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది.

Devil Telugu Cinema Review and Rating: Nandamuri Kalyan Rams Different attempt

డెవిల్ సినిమా సెకండాఫ్‌లో ఊహించినట్టే రకరకాల ట్విస్టులతో సాగుతుంది. ఆ ట్విస్టులను రివీల్ చేసే తీరు బాగుంది. కానీ కథలో ఎమోషన్స్, ప్రేక్షకుడిని ఓ అనుభూతికి గురిచేసే సంఘటనలు లేకపోవడం వల్ల కథ, కథనాలు రొటీన్‌గా మారినట్టు కనిపిస్తున్నది. ఇక త్రివర్ణ క్యారెక్టర్ రివీల్ తర్వాత మళ్లీ సినిమా ఊపందుకొన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక రొటీన్ క్లైమాక్స్‌తో మమా అనిపించారనిపిస్తుంది.

నందమూరి కల్యాణ్ రామ్‌కు ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. డిఫరెంట్ కంటెంట్‌తో మరోసారి డెవిల్ పాత్రలో తన మార్కు చూపించారు. పూర్తిగా డైలాగ్ డ్రామాతో సాగే మూవీలో కొన్నిచోట్ల ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. కొన్నిసార్లు బింబిసార క్యారెక్టర్ పూనిందా? అనే విధంగా డైలాగ్స్ చెప్పాడు. రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రను తన అనుభవంతో మెప్పించేలా చేశాడు. ఇక సంయుక్త మీనన్‌కు మరోసారి లభించిన బలమైన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇంటెన్స్‌తో కూడిన పాత్రలో ఒదిగిపోయిన విధానంతోపాటు నటనపరంగా చూపించిన హావభావాలు మెప్పించాయి.

Devil Telugu Cinema Review and Rating: Nandamuri Kalyan Rams Different attempt

ఇక మిగితా పాత్రల విషయానికి వస్తే..ఫ్రీడమ్ ఫైటర్‌గా మాళవిక నాయర్ పాత్ర చిన్నదైనా గుర్తుండిపోతుంది. భావోద్వేగమైన పాత్రను భారీగా ఎమోషన్స్ పడించింది. సముద్ర పాత్రలో విశిష్ట సింహా, షఫీ పాత్రలో షఫీ, రమణ పాత్రలో చక్రపాణి ఆనంద, శంకరన్నగా ఉత్తేజ్, పట్వారీగా అజయ్ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. ఇంకా హరితేజ, ఎస్తేరా తదితరులు చిన్న చిన్న పాత్రల్లో ఆకట్టుకొన్నారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఆర్ట్, సినిమాటోగ్రఫి, మ్యూజిక్ ఈ సినిమాకు కీలకంగా మారాయని చెప్పవచ్చు. 1945 నాటి మూడ్‌ను, వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు వేసిన సెట్స్ బాగున్నాయి. గ్రాఫిక్ వర్క్ నాసిరకంగా ఉంది. పలు సన్నివేశాలను హర్షవర్ధన్ రామేశ్వర్ తన బీజీఎంతో మరింత స్టాంగ్‌గా మార్చారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫి మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ గ్రాండ్‌గా రిచ్‌గా ఉండటంతో క్వాలిటీ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఈ వీకెండ్‌లో సినిమా లవర్‌ తమ లిస్టులో చేర్చుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X