Dhadak 2 Movie Review: ధడక్ 2 హిందీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: త్రిప్తి డిమ్రీ, సిద్దాంత్ చతుర్వేది, సౌరబ్ సచ్‌దేవా, విపిన్ శర్మ, సాద్ బిలగ్రామి, హరీష్ ఖన్నా తదితరులు
దర్శకత్వం: షాజియా ఇక్బాల్
నిర్మాతలు: కరణ్ జోహర్, ఉమేష్ కుమార్ భన్నాల్, ఆదర్ పూనావాలా, అపూర్వ మెహతా తదితరులు
సినిమాటోగ్రఫి: సిల్వస్టర్ చతుర్వేది
ఎడిటర్: చారుశ్రీ రాయ్, ఓంకార్ ఉత్తమ్ సక్పాల్, సంగీత్ వర్గీస్
మ్యూజిక్: తనుజ్ టికూ (బీజీఎం), రోచక్ కోహ్లీ, తనిష్క్ బాగ్చీ, జావెద్ మోసిన్, శ్రేయాస్ పురాణిక్
బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-08-01

నీలేష్ (సిద్దాంత్ చతుర్వేది) దళిత కుటుంబానికి చెందిన యువకుడు. తల్లి కోరిక మేరకు పాలిటెక్నిక్ కోర్సు వదిలేసి న్యాయశాస్త్రం చదివేందుకు సిద్దమవుతాడు. అగ్ర కులానికి చెందిన విధి (త్రిప్తి డిమ్రీ) కూడా నేషనల్ లా కాలేజీలో న్యాయ శాస్త్ర విద్యార్థి. ఇద్దరు ఒకే కాలేజీలో చదవడం వల్ల ఫ్రెండ్స్‌గా పరిచయం జరిగి వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. తక్కువ కులానికి చెందిన నీలేష్‌తో విధి తిరగడం తన సోదరుడికి రోని (సాద్ బిల్‌గ్రామి)కి నచ్చదు. నిలేష్‌ను రకరకాలుగా అవమానిస్తాడు. హత్య ప్రయత్నం కూడా చేస్తారు. దాంతో విధికి నిలేష్ దూరంగా ఉండాలని నిర్ణయించుకొంటాడు.

Dhadak 2 Movie Review

మురికి వాడలో నివసించే నీలేష్‌ను అగ్ర కులం, సంపన్న వర్గానికి చెందిన విధి ఎందుకు ప్రేమించింది? విధి, నీలేష్ మధ్య లవ్ ట్రాక్ ఎలా నడించింది? కుటుంబ అభ్యంతరం చెబితే విధి ఎలా రియాక్ట్ అయింది? విధి నుంచి నీలేష్‌ను దూరం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు నీలేష్ తన ప్రేమను త్యాగం చేశాడా? లేదా విధితో కలిసి పెద్దలను ఎదురించాడా? కుల వివక్షను నీలేష్ ఎలా ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే ధడక్ సినిమా కథ.

జాన్వీ కపూర్ తెలుగు సినిమాకు పరిచయమైన ధడక్ సినిమాకు ఈ చిత్రం ఫ్రాంచైజీ. అయితే పా రంజిత్ నిర్మించిన.. తమిళంలో ప్రశంసలు అందుకొన్న పెరియేరుమ్ పెరుమాల్ సినిమాకు రీమేక్. అయితే హిందీ నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమాను రూపొందించారు. ప్రేమికులను హత్య చేస్తుండే శంకర్ (సౌరభ్ సచ్‌దేవా) క్యారెక్టర్‌తో సినిమాను చాలా ఎమోషనల్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత త్రిప్తి, సిద్దాంత్ లవ్ ట్రాక్, సిద్దాంత్‌కు కాలేజీలో కులం పేరుతో జరిగే అవమానాలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఎమోషన్ప్, యాక్షన్ సీన్లతో కథ రొటీన్‌గా సాగుతుంది. పరువు హత్యల బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ సినిమాలో ఫుల్లుగా ఎమోషన్స్ పండకపోవడం రెగ్యులర్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

బోల్డ్ అండ్ గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన త్రిప్తి డిమ్రీ.. తాను మంచి నటిని, ఫెర్పార్మర్ అనిపించుకొనేలా ఈ సినిమాను ఆమె ఉపయోగించుకొన్నారు. ప్రేమ కోసం పరితపించే యువతిగా, కులం వివక్షను ఎదురించే ప్రేమికురాలిగా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నది. ఇక సిద్దాంత్ చతుర్వేది తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఎమోషనల్‌గా మార్చాడు. దళిత యువకుడి పాత్రలో నటించడమే కాకుండా మంచి మార్కులే కొట్టేశాడు. సౌరభ్, సాద్, విపిన్ శర్మ, జాకీర్ హుస్పేన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలకు పెద్దగా స్కోప్ ఉన్న ఆకట్టుకోలేకపోయాయి. లవ్ స్టోరికి కావాల్సిన సాంగ్స్ లేకపోవడం మైనస్. కాకపోతే బీజీఎం ఈ సినిమాలోని పలు సన్నివేశాలను ఎలివేట్ చేసేలా చేసింది. అలాగే సినిమాటోగ్రఫి బాగుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇతర విభాగాల పనితీరు ఒకే అనిపిస్తాయి.

ధడక్ 2 చిత్రం గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. ధడక్ చిత్రంలో ఉండే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరి, ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల చప్పగా సాగుతుంది. త్రిప్తి డిమ్రీ నుంచి గ్లామర్ ఆశించి వెళ్లిన వారికి పూర్తిగా నిరాశే మిగులుతుంది. లవ్ ట్రాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కథలో బలమైన పాయింట్, ఆడియెన్స్‌ను ఎమోషన్స్ గురి చేసే సీన్లు లేకపోవడం, కథను మలుపు తిప్పే క్యారెక్టర్లు లేకపోవడం వల్ల రెగ్యులర్ లవ్ స్టోరిగానే మిగిలిపోయిందనిపిస్తుంది. త్రిప్తి డిమ్రి కోసం, లేదా పరువు హత్యల నేపథ్యంతో సాగే సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X